భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎట్టి పరిస్థితిలో చేయకూడని పనులు

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎట్టి పరిస్థితిలో చేయకూడని పనులు 

హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆఛారాలను  పాటించాలి. అంతేకాదు భార్య కోరికమేరకు నడుచుకోవాలి. ఆమెకు ఏది ఇష్టం తెలుసుకుని ఆ వస్తువులను తెచ్చిపెట్టాలి.

ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులోని బిడ్డకూడా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని కొన్ని ఆచారాలు కూడా మన హిందూ సంప్రదాయాలలో ఉన్నాయి.

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎట్టి పరిస్థితిలో చేయకూడని పనులు 

1. గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త యొక్క ముఖ్య ధర్మం. అలా చేయడం వల్ల చిరాయుష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడు . భార్య కోరికలు తీర్చకపోతే దోషము కూడా  కలుగుతుంది .

2. భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చెట్టు నరకడం మరియు  సముద్ర స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు.

3. భర్త క్షౌరము చేయించుకోకూడదు . భార్య గర్భం దాల్చిన 6 నెలలు తర్వాత భర్త క్షౌరము చేయించుకోరాదు .

4. భార్య గర్భిణిగా ఉన్న సమయంలో శవాన్ని మోయడం వంటి పనులు చేయకూడదు .

5. భార్య గర్భం ధాల్చిన తర్వాత విదేశీ ప్రయాణాలు చేయడం మరియు  భార్యను విడిచి దూరంగా వెళ్ళడం లాంటివి చేయకూడదు .

6. భార్య గర్భం దాల్చిన ఏడవ నెల మొదలైనప్పటి నుండి క్షౌరము, తీర్థయాత్ర మరియు  నావ యొక్కుట వంటి పనులకు దూరంగా ఉండాలి.

7. గ్రుహారంభము కానీ మరియు  వాస్తుకర్మ కానీ, చేయకూడదు .పర్వతారోహణము, యుద్దము చేయుట వంటివి వాటికి దూరంగా ఉండాలి.

8.భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త  శవాన్ని అనుసరించి వెళ్ళరాదు. అలాగే ప్రేతకర్మలు చేయకూడదు . ఇంకా ఉపశమనం, పిండదానం వంటి పనులు చేయ కూడదు.