వేదాంత అధ్యయనానికి అర్హులు ఎవరు?

*వేదాంత అధ్యయనానికి అర్హులు ఎవరు?*

????
—-జగద్గురు శ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామివారు
‘ వక్తారమాసాద్య యమేవ నిత్యా సరస్వతీ స్వార్థ సమన్వితాసీత్ !
నిరస్తదుస్తర్క కళంక పంకా నమామి తం శంకరమర్చితాంఘ్రిం !! ‘
అనేకమంద అనేక పండితులద్వారా వేదాంతం వింటూనే ఉన్నారు. ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రములలో, భగవద్గీతలో, ఆ వేదాంత తత్త్వం అనేది చాలా విస్తారంగా చెప్పబడింది. దానిని మనం వింటూనే ఉన్నాం.
కానీ ఎవ్వరికీ ఆ తత్త్వం అనేది సరిగా వంటబట్టిందా?
ఎవరైనా ఆ తత్త్వాన్ని సరిగా మననం  చేయగలుగుతున్నారా?
ఆ వేదాంతంలో చెప్పినటువంటి సాధనములను ఎవరైనా అనుష్ఠిస్తున్నారా?
 అని అంటే దానికి జవాబు ఇవ్వడం చాలా కష్టం.
వేదాంత అధ్యయనానికి అర్హులు ఎవరు
ఎందుకంటే ఎన్నిసార్లు ఆ వేదాంతోపన్యాసాలు విన్నా ఆతత్త్వం సరిగా వంటబట్టడం లేదు. ..
ఎందుకని? ఎవరిది లోపం? చెప్పేవాళ్ళది లోపమా? వినే వాళ్ళది లోపమా?
చెప్పేవాళ్ళు పాపం వేదాంతంలో చాలా పరిశ్రమ చేసే చెబుతున్నారు. చేయకుండా చెప్పే వాళ్ళ విషయం నాకు తెలియదు.
 ఏదో పైపైన చూసుకొని చెప్పే వాళ్ల విషయం మనకి అక్కరలేదు కానీ  నీలకంఠ దీక్షితులు చెప్పినట్లు ” ఆకౌమారాత్ గురుచరణ శుశ్రూషయా బ్రహ్మవిద్యా స్వాస్థాయాస్థాం అహః మహతీం అర్జితం కౌశలం యత్” బాల్యం నుంచి గురుకులవాసం చేసి గురు శుశ్రూష చేసి ఆ గురువుల ముఖం నుండి వేదాంత తత్త్వాన్ని చక్కగా తెలుసుకొని ఆవేదాంతంలో పాండిత్యం సంపాదించిన పండితులు చెప్పినప్పటికీ ఎందుకు వంటబట్టడం లేదంటే మనకు వేదాంత శ్రవణ అధికారం రాలేదు.
వేదాంత అధ్యయనానికి అర్హులు ఎవరు
దేనికైనా ఒక యోగ్యత అనేది కావాలి. ఆరో తరగతి పిల్లవాడిని బి ఎ క్లాసులో కూర్చోబెట్టి అక్కడ పాఠాలు లెక్చరర్లు చెప్తున్నారు వాడికి వంటబట్టడం లేదు అంటే ఎలావంటబడుతుంది?
బి ఎ క్లాసులో కూర్చొని ఆ పాఠాన్ని అర్థం చేసుకొనే యోగ్యత వాడికి రాలేదు.
ఆ యోగ్యత వాడు సంపాదించుకోవాలి. ఆ యోగ్యత సంపాదించుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి అర్థమౌతుంది. కానీ యోగ్యత సంపాదించకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి ఏమి అర్థం అవుతుంది?
అలాగే మనకి కూడా వేదాంతం సరిగా వంటబట్టాలంటే దానికి కొంత యోగ్యత మనం సంపాదించుకోవాలి.
శృతిలో చెప్పారు
“నావిరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః!
నాశాంత మానసోవాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్!!”
అని కఠోపనిషత్తు చెప్పింది. దుశ్చరితాత్ అవిరతః యేనం న ఆప్నుయాత్ – మనం ఆ మంత్రార్థాన్ని సులభమైన భాషలో తెలుసుకోవాలి అంటే చెడ్డ అలవాట్లు వీడని వాడు దీనిని తెలుసుకొనజాలడు. శాస్త్రం దేనిని నిషేధించిందో దానినే మనం చాలా అపేక్షిస్తున్నాం. ఇది లోకంలో చాలా విచిత్రమైన విషయం.
????

Originally posted 2023-02-06 01:25:06.

Read More  దీపావళి నరకచతుర్దశి మరునాటి పండుగ విశిష్టత
Sharing Is Caring:

Leave a Comment