మొటిమలు తగ్గాలంటే...

మొటిమలు తగ్గాలంటే..

 మొటిమలు మిమ్మల్ని విపరీతంగా బాధిస్తున్నాయా! అయితే ఇంట్లో తయారుచేసుకోగలిగిన ఈ ఫేస్‌ప్యాక్‌లను ఓ సారి ట్రై చేసి   కూడా చూడండి. 
- టమాట  కమలాపండు(సంత్రా), రసాన్ని సమపాళ్లలో కలపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. అరిన తరువాత కడిగేయండి. ఇలా రోజు చేస్తే ముఖంపై ఉన్న మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతంగా  కూడా అవుతుంది. 
- ఎల్లిపాయలకు ,ఎండబెట్టిన కమలాపండు(సంత్రా) తొనలు సరిపడా నీళ్లు కలుపుతూ పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి స్క్రబ్‌లా  కూడా ఉపయోగించండి. 
- పుదీనా ఆకులను  తీసుకొని వాటిని  మెత్తగా ఫెస్ట్‌లా తయారు చేసుకొని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కూడా కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు కూడా  తొందరగా మాయమైపోతాయి. 
- రోజ్‌వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ముఖంపై అప్లై చేయాలి. 15-30 నిమిషాల తరువాత నీళ్లతో  శుభ్రంగా  కడిగేయాలి. 
మొటిమలు తగ్గాలంటే...
-ఒక  దోసకాయను తీసుకొని దానికి ఓట్‌మిల్, మూడు టీస్పూన్స్ తేనేను కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దానిని ముఖానికి మాస్క్‌లా అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా  కూడా అవుతుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post