జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి?

జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి?


సింహాదేకం బకాదేకం షట్ శున స్త్రీణి గర్దభాత్ ! వాయసాత్పంచ శిక్షేచ్చత్వారి కుక్కుటాత్ ||
సింహము నుంచి ఒక విషయాన్ని, కొంగ నుంచి రెండు విషయాలనీ, కుక్క నుంచి ఆరు విషయాలనీ, గాడిద నుంచి మూడు విషయాలనీ, కాకి నుంచి అయిదు విషయాలనీ, కోడి నుంచి నాలుగు విషయా లనూ నేర్చుకోవాలి.
మృగాలను వేటాడేటప్పుడు సింహం సర్వశక్తులనూ ఉపయోగిస్తుంది.
కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణ ప్రకారం గానూ కాలానుగుణంగానూ తీసుకుంటుంది. మనుజుడు కూడా కార్యాన్ని అలానే చేయాలి.
జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి


అలాగే కుక్క ఆ అవసరమైనంత భుజించుట, అల్పసంతోషము, చక్కటి   నిద్ర, తగు సమయమున నిద్రలేచుట, నమ్మిన బంటుగా , ఉండుట, పరాక్రమాన్ని కలిగి ఉండుట చేస్తుంది. ఈ  ఆరుగుణాలు కుక్కనుంచి నేర్చుకోవాలి.
అలాగే గాడిద , మోయలేని బరువుని కూడా హొస్తుంది.
వాతావరణాన్ని లెక్క చేయకపోవటం, బాగా పనిచేసి అలసి సొలసి సుఖంగా ఉండుట.
ఈ మూడు గుణాలను గాడిద - నుంచి నేర్చుకోవాలి.
కాకి నుంచి అడ్డుగల శృంగారమూ, కాఠిన్యమూ, ఇల్లు నిర్మించుకొనుటలో జాగురూకత, సోమరితనాన్ని లేకుండుట... ఇట్టివి నేర్చుకోవాలి.
ఇక కోడి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది.
పోరాటంలో వెనకకు తగ్గకుండుట, ఉదయాన్నే నిద్రలేవటమూ, బంధువులతో భుజించటమూ, ఆపదలప్పుడు స్త్రీలను (పెట్టను) రక్షించుకొనుట... ఇటువంటివి కోడి నుండి తెలుసుకోవాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post