నాగదోషాలు పోవటానికి దర్శించాల్సిన క్షేత్రం ఇసుక ప్రసాదంగా లభించే క్షేత్రం నాగరాజమందిరం

నాగదోషాలు పోవటానికి దర్శించాల్సిన క్షేత్రం ఇసుక ప్రసాదంగా లభించే క్షేత్రం నాగరాజమందిరం

నాగరాజమందిరం తమిళనాడు కన్యాకుమారి నుండి నాగర్ కోయిల్ పట్టణంలో ఉన్నది. ఇక్కడి నాగరాజు మందిరం అతి పురాతనమైనది. చోళులు ఈ ఆలయాన్ని నిర్మింపచేసినా ఆలయం గోడలపై జైన తీర్థంకరులు, మహావీర, పార్శ్వనాథ చిత్రాలు కనిపిస్తాయి. గర్భాలయంలోని స్వామి విగ్రహం ప్రక్కనే ఒక చిన్ని నీటి ఊట ఉంటుంది. ఆ నీటిని తీర్థంగా, అక్కడ ఇసుకని ప్రసాదంగా అర్చకుడు ఇవ్వటం ఇక్కడి విశేషం. అయితే ఆ ఇసుక మొదటి ఆరు నెలలు తెల్లగానూ, తర్వాత ఆరునెలలు నల్లగా ఉంటుందని చెబుతారు. నాగరాజమందిరం నుంచి 2 కి.మీ పరిసర ప్రాంతంలో ఎక్కడా కూడా పాముకాటుకు విషం ఎక్కదని వరం ఉందని తెలుస్తోంది. 

నాగదోషాలు పోవటానికి దర్శించాల్సిన క్షేత్రం ఇసుక ప్రసాదంగా లభించే క్షేత్రం నాగరాజమందిరం

0/Post a Comment/Comments

Previous Post Next Post