ప్రపంచంలోనే ఉన్న ఏకైక దుర్యోధన ఆలయం

ప్రపంచంలోనే ఉన్న ఏకైక దుర్యోధన ఆలయం 


మలనాడలో ఉన్నది. ఇది కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా కేంద్రానికి 35 కి.మీ దూరంలో మలనాడులో నిర్మంపబడి ఉన్నది. చిన్నకొండ మీదున్న ఆలయం. దుషుడిగా చూడబడే దుర్యోధనునికి కట్టిబడిన ఈ ఆలయంలో తమ ఆవులనీ, పంటపొలాల్నీ కాపాడే దేవునిగా నిత్యపూజలను చేస్తారు భక్తులు. ఆలయంలోని  గర్భగుడిలో నల్లరాతి గద్దె దర్శనమిస్తుంది. ఎటువంటి అర్చామూర్తి ఉండడు. అరణ్యవాసం తర్వాత పాండవులు చేస్తున్న అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయటానికి వచ్చిన దుర్యోధనుడు ఈ ప్రాంతంలోనే ఉండి సిద్ధుల సలహా మేరకు ప్రస్తుతం ఆలయ గద్దె ఉన్న ప్రాంతంలోనే శివుని కొరకు ఘోర తపస్సు చేశాడని స్థలపురాణం. అలా ఇక్కడకు వచ్చిన దుర్యోధనుని ఆ ప్రాంత ప్రజలు ఘన స్వాగతం పలుకగా దుర్యోధనుడు సంతసించి ఆ ప్రాంతానికి వారినే పాలకులగా నియమించాడని చెబుతారు. కేరళ భాషలో మల అంటే కొండ, నాడ అంటే ఆలయం. అందుకే ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి మలనాడ అని పేరు వచ్చింది.
ప్రపంచంలోనే ఉన్న ఏకైక దుర్యోధన ఆలయం

0/Post a Comment/Comments

Previous Post Next Post