సాక్షాత్తు శ్రీమహావిష్ణువు పాదాలు గల క్షేత్రం విష్ణుపాద ఆలయం

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు పాదాలు గల క్షేత్రం విష్ణుపాద ఆలయంవిష్ణుపాద ఆలయం. ఇది బీహార్ రాష్ట్రం గయా జిల్లాలో గయలో ఉన్నది. ఫల్గునీ, మధుర, స్వేదా నదులు కలిసే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో గదాధరుడైన శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంటుంది. గర్భగుడికి ముందున్న ముఖమండపంలో వెండిరేకులతో  అలంకరించబడిన పాదముద్రలు ఉంటాయి. ఇవి గయుని శిరస్సు మీద నిలబడి ఉన్న విష్ణుమూర్తి పాదముద్రలు. విష్ణుపాద ఆలయానికి ఎదురుగా నది అవతలి గట్టుమీద ఉన్న కొండ మీదున్న చిన్న మందిరంలో తన మామగారికి పిండప్రదానం చేసిన సీతమ్మవారి చేతులు దర్శనమిస్తాయి.

ఒకసారి అరణ్యవాసం చేస్తున్న సమయంలో తండ్రి తిథి రోజున అడవికి వెళ్ళిన శ్రీరాముడు సమయానికి వెనుతిరిగి రాకపోవటంతో సీతమ్మే స్వయంగా పిండప్రదానం చేసింది. ఆ విషయం శ్రీరాముడికి చెప్పగా శ్రీరాముడు నమ్మకపోవటంతో ఫల్గుణీనదీ, మర్రిచెట్లు సీతమ్మ పిండ ప్రదానం చెయ్యటం, ఆమె మామగారే స్వయంగా వచ్చి స్వీకరించటం తను కళ్ళారా చూసామని సాక్ష్యం చెబుతాయి. అందుకే సీతాదేవి ఆ మర్రిచెట్టుకి మరణం లేదనీ, ఫల్గునీ నది ఎండిపోదని వరం ఇస్తుంది. అదృశ్యంగా గమనించటం వల్ల ఫల్గునీ నదిలో ఒక నెల రోజుల మాత్రమే నీరు నిండుగా ఉండి, మిగిలిన రోజుల్లో నది అదృశ్యంగా పారు తుంది. పైకి మాత్రం ఇసుక కనిపిస్తుంటుంది.
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు పాదాలు గల క్షేత్రం విష్ణుపాద ఆలయం

0/Post a Comment/Comments

Previous Post Next Post