చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

చేప నూనె  వలన కలిగే  ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలుసీఫుడ్ (సముద్రం నుండి లభించే ఆహారపదార్దాలు) మన ఆహార విధానంలో చేర్చగల అత్యంత పోషకమైన మరియు ఆరోగ్యకరమైన ఒక  ఆహారం. ఇది విటమిన్లు మరియు ఖనిజాలతో సహా అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఒమేగా -3 కొవ్వులు అధికంగా ఉండే వనరులలో చేప ఒకటి. కానీ, మీరు చేపలంటే అంతగా ఇష్టపడకపోతే మరియు ఈ ఆరోగ్యకరమైన కొవ్వుల ప్రయోజనాలను పొందాలనుకుంటుంటే, మీరు చేపకు బదులుగా చేప నూనెను కూడా  ఎంచుకోవచ్చును .

ఒమేగా -3 కొవ్వులే కాకుండా, చేపల నూనెలో విటమిన్ ఎ మరియు విటమిన్ డి కూడా కొంత మొత్తంలో ఉంటాయి.  ఇవి ఈ చేప నూనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలను మరింత బాగా పెంచుతాయి.

సాల్మొన్ (మాగా) మరియు కాడ్ (డాల్పిన్, గుండు మీను) వంటి నూనె గల చేపల కణజాలాల నుండి తీయబడే చేప నూనె, ఇకోసాపెంటెనోయిక్ ఆసిడ్ (ఇపిఎ) [eicosapentaenoic acid (EPA)]మరియు డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం (డిహెచ్ఎ) [docosahexaenoic acid (DHA)] వంటి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అత్యంత సమృద్ధిగా ఆహార వనరులలో ఇది ఒకటి, .

ఇపిఎ (EPA) మరియు డిహెచ్ఎ (DHA) లు కొన్ని ఇకోసానాయిడ్ల యొక్క పూర్వగాములు (ప్రీకస్సర్స్), ఇవి మానవ శరీరంలో వాపు యొక్క స్థాయిలను బాగా  తగ్గిస్తాయి. మరియు మరొక ఉత్తమ విషయం ఏమిటంటే, అవి హానికరమైన కొలెస్ట్రాల్‌ను కూడా పెంచవు! కుంగుబాటు, ఆందోళన, క్యాన్సర్ మరియు మాక్యులర్ డిజనెరేషన్ వంటి అనేక ఇతర సమస్యలలో ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్లు మరియు చేప నూనెల ప్రయోజనాలు విస్తృతంగా అధ్యయనం చేయబడ్డాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కొవ్వును చేపలు స్వయంగా తయారు చేయలేవు అయితే, అవి తినే నాచు (planktons) నుండి వాటి శరీరంలో ఇవి ఏర్పడుతుంది.

చేప నూనె సప్లిమెంట్లను ద్రవ రూపంలో తీసుకోవచ్చును .  అయితే, మీరు ఆ రుచిని ఇష్టపడకపోతే, చేప నూనె గుళికలను మీ స్థానిక మందుల దుకాణం నుండి సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్య సప్లిమెంట్ గా మాత్రమే కాక, ఆయింట్మెంట్లు, ఎమోలియంట్లు మరియు బాడీ ఆర్ట్ వంటి బాహ్యంగా ఉపయోగించే వాటిలో చేప నూనెల ఉపయోగం చాలా  ఉంటుంది!

చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు


కాడ్ లివర్ ఆయిల్ పోషక వాస్తవాలు

చేప నూనె ఆరోగ్య ప్రయోజనాలు 


 • మెదడుకు చేప నూనె ప్రయోజనాలు 
 • గుండెకు చేప నూనె ప్రయోజనాలు 
 • జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి చేపనూనె 
 • అల్జీమర్స్ వ్యాధికి చేప నూనె 
 • కళ్ళకు చేప నూనె ప్రయోజనాలు 
 • మూర్ఛ కోసం చేప నూనె
 • బరువు తగ్గడానికి చేప నూనె 
 • చేప నూనె వాపును తగ్గిస్తుంది 
 • చర్మానికి చేప నూనె ప్రయోజనాలు 
 • పిండం అభివృద్ధికి చేప నూనె 

చేప నూనె దుష్ప్రభావాలు 

ఉపసంహారం కాడ్ లివర్ ఆయిల్ పోషక వాస్తవాలు 

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అని పిలువబడే ప్రయోజనకరమైన నూనెలను అధికంగా కలిగి ఉండే చేపలలో హెర్రింగ్, ట్యూనా, మాకేరెల్, సాల్మన్, కాడ్ లివర్, వేల్ బ్లబ్బర్ (తిమింగలంలో ఉండే కొవ్వుపొర) మరియు సీల్ బ్లబ్బర్ వంటివి  చాలా ఉన్నాయి.

కాడ్ లివర్ ఆయిల్ భారతదేశంలో చేప నూనె యొక్క అత్యంత సాధారణ ఒక రకం.

యుఎస్‌డిఎ (USDA) న్యూట్రియంట్ డేటాబేస్ ప్రకారం చేప నూనె, కాడ్ లివర్‌లోని పోషక విలువలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

పోషకం :100 గ్రాములకు 

శక్తి :902 కిలో కేలరీలు

కొవ్వులు  :100 µg

విటమిన్లు  :100 గ్రాములకుఫ్యాట్స్ /ఫ్యాటీ ఆసిడ్స్:100 గ్రాములకు

అన్సాచురేటెడ్:22.608 గ్రా

మోనోఅన్సాచురేటెడ్:46.711 గ్రా

పోలిఅన్సాచురేటెడ్:22.541 గ్రా

కొలెస్ట్రాల్:570 mg


చేప నూనె ఆరోగ్య ప్రయోజనాలు 

చేప నూనె శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇటీవలి కాలంలో, శాస్త్రవేత్తలు కూడా దీనిపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. చేప నూనె గుండె, మెదడు మరియు కళ్ళకు ఒక వరం వంటిదని అధ్యయనాలు కూడా తెలుపుతున్నాయి. 

పిండం అభివృద్ధికి: గర్భధారణ యొక్క చివరి త్రైమాసికంలో ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ ను తీసుకోవడం వలన శిశువులో మేధాశక్తి, ఇంద్రియల అభివృద్ధి బాగా మెరుగుపడుతుందని పరిశోధనలు తెలిపాయి. అలాగే చేప నూనె శిశువులో దృష్టి/చూపు ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

చర్మానికి: ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్ల వనరుగా చేప నూనె చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పొడిదనాన్ని తగ్గించడానికి  బాగా సహాయం చేస్తుంది. ఇది సోరియాసిస్ రోగులలో ఫలకాల పరిమాణాన్ని కూడా  తగ్గించిందని ఒక పరిశోధన తెలిపింది.

వాపు కోసం: మధుమేహం, కుంగుబాటు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలను వాపు మరింత కఠినతరం కూడా చేస్తుంది. ఈ వాపుని తగ్గించడం వలన ఆ వ్యాధుల లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చును . వివిధ అధ్యయనాలు చేపనూనెల యొక్క యాంటీ-ఇన్ఫలమేటరీ ప్రభావాలు అటువంటి వ్యాధుల చికిత్సకు బాగా  సహాయపడతాయని తెలిపాయి.

మెదడు కోసం: ఫిష్ ఆయిల్ సప్లీమెంటేషన్ కుంగుబాటు మరియు ఆందోళన వంటి  సమస్యలను తగ్గిస్తుందని అధ్యయనాలు కూడా తెలిపాయి. ఇపిఎ మరియు డిహెచ్ఎ అనేవి రెండు ప్రధానమైన ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు ఇవి మెదడుపై అద్భుతమైన చర్యలను కూడా చూపిస్తాయి.

గుండెకు: చేప నూనె గుండెకు ఒక వరం వంటిది అని చెప్పవచ్చును . చేప నూనె తీసుకునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం తగ్గిందని అధ్యయనాలు తెలిపాయి. ఒక ఆరోగ్యకరమైన కొవ్వుగా ఇది అధికరక్తపోటు, అరిథ్మియా వంటి సమస్యల  ప్రమాదాన్నిబాగా  తగ్గిస్తుంది. 

కళ్ళకు: కొవ్వులు కూడా శరీరం యొక్క సాధారణ పనితీరుకు అవసరం. చేప నూనెలో అధిక మొత్తంలో డిహెచ్ఎ కూడా ఉంటుంది.  ఇది వయసు సంబంధిత కంటి సమస్యలను బాగా తగ్గిస్తుంది. చేప నూనె సప్లీమెంట్లతో వయస్సు-సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చును .

మెదడుకు చేప నూనె ప్రయోజనాలు 

చేపనూనె మెదడు ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహార పదార్దం కావచ్చును . ఆందోళన, నిరాశకు మరియు రక్తంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల తగ్గుదలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, చేప నూనె మరియు ఒమేగా -3 కొవ్వుల యొక్క సప్లీమెంటేషన్ నిరాశ మరియు ఆందోళన యొక్క లక్షణాలను మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలింది. చేపల నూనెలో ఉండే రెండు ప్రధాన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఇపిఎ (EPA) మరియు డిహెచ్ఎ (DHA) మరియు అవి మెదడుపై అద్భుతమైన ప్రభావాన్ని కూడా చూపుతాయి. ఇపిఎ అధికంగా ఉండే నూనెలు డిహెచ్ఎ అధికంగా ఉండే నూనెల కన్నా వేగంగా నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని గమనించబడింది.

ఒక పైలట్ (చిన్నపాటి) అధ్యయనంలో, పిల్లలలో అటెంషన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్ డి) తో ముడిపడి ఉండే అనేక ప్రవర్తనా సమస్యలను తగ్గించడానికి డిహెచ్ఎ సప్లీమెంటేషన్ సహాయంచేస్తుందని కనుగొనబడింది. ఈ అధ్యయనం ప్రకారం, రోజుకు కొన్ని గ్రాముల ఇపిఎ మరియు డిహెచ్ఎ ను తీసుకున్న పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మెరుగుదల కనిపించింది, దీనిని వారి తల్లిదండ్రులు మరియు వారికి చికిత్స చేసే మానసిక వైద్యులు గమనించినట్లు తెలిపారు.

గుండెకు చేప నూనె ప్రయోజనాలు 

ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన కారణాలలో గుండె జబ్బులు ఒకటి. మరియు చేప నూనె హృదయానికి ఒక వరం లాంటిది. చేప నూనె తీసుకునేవారికి గుండె జబ్బులు చాలా తక్కువగా సంభవిస్తాయని అధ్యయనాలు బాగా  చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన కొవ్వు కావడం వల్ల ఇది అధిక రక్తపోటు, అరిథ్మియా మరియు అథెరోస్క్లెరోసిస్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చేపల నూనెలో లభించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లం మానసిక ఒత్తిడి సమయంలో గుండెను కాపాడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీలో ప్రచురితమైన నివేదికలు 1 నెల కన్నా ఎక్కువ సమయంపాటు చేప నూనె సప్లిమెంట్లను తీసుకున్న వ్యక్తులు మానసిక ఒత్తిడితో కూడిన పరిస్థితులలో కూడా మంచి హృదయనాళ పనితీరును కలిగి ఉంటారని సూచించాయి .

చేపల నూనె, దాని వాపు నిరోధక లక్షణాల ద్వారా, అథెరోస్క్లెరోటిక్ గాయాలను తగ్గించడానికి  బాగా సహాయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. గుండెలో స్టెంట్ ఉన్నవారిలో చేప నూనెలు తీసుకోని వారితో పోల్చితే, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో పాటు రెండు బ్లడ్-తిన్నింగ్ మందులు తీసుకున్న వ్యక్తులలో గుండెపోటు ప్రమాదం తగ్గిందని గుర్తించబడింది.

అలాగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్, ఏవైనా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు చేపలు మరియు ముఖ్యంగా నూనెగల చేపలను తినాలని సిఫార్సు చేస్తుంది.


జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి చేపనూనె 

ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్ గుండెకు మాత్రమే మంచిదని చాలా మంది అనుకుంటారు.  కాని ఇది మెదడుకు కూడా చాలా మంచిదని కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఫిష్ ఆయిల్ను తప్పనిసరిగా ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా తీసుకోవాలి. ముఖ్యంగా జ్ఞాపకశక్తిలో ఇబ్బందులు మరియు మెదడు నెమ్మదిగా ఉండడం వంటి సమస్యలను బాగా ఎదుర్కొంటునట్లయితే. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల వినియోగం ఆరోగ్యకరమైన యువకులలో పనిచేసే జ్ఞాపకశక్తిని బాగా మెరుగుపర్చడానికి సహాయపడుతుందని PLoS One పత్రికలో నివేదించిన ఒక పరిశోధన తెలిపింది.

ఏరోబిక్ వ్యాయామం మరియు మేధాశక్తి ప్రేరణ (cognitive stimulation)తో కలిపి ఒమేగా -3 ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేధాశక్తి బలహీనతను కూడా నివారించవచ్చని మరొక అధ్యయనం సూచించింది.

అల్జీమర్స్ వ్యాధికి చేప నూనె 

అల్జీమర్స్ ఒక న్యూరోడెజెనరేటివ్ వ్యాధి.  దీనిలో మెదడు నెమ్మదిగా దాని మేథాశక్తి మరియు జ్ఞాపకశక్తిని కూడా కోల్పోతుంది. వృద్ధులలో చిత్తవైకల్యం రావడానికి ఇది చాలా సాధారణ కారణమని తేలింది. చేప నూనెను ఎక్కువగా తీసుకునే వ్యక్తులలో వారి వృద్ధాప్యంలో మెదడు పనితీరు తగ్గడమనేది మెరుగవుతుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం, అల్జీమర్స్ వ్యాధి యొక్క ప్రారంభ దశలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాన్ని క్రమంగా తీసుకోవడం ద్వారా దానిని నివారించవచ్చని బలమైన ఆధారాలు  కూడా ఉన్నాయి.

న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనాలు చేపలు, ఒమేగా -3 నూనెలు, పండ్లు మరియు కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా చిత్తవైకల్యం మరియు అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని నివేదించాయి.


కళ్ళకు చేప నూనె ప్రయోజనాలు 

కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్లు) కొవ్వుల (ఫ్యాట్స్) యొక్క బిల్డింగ్ బ్లాక్స్. శరీరం యొక్క సాధారణ పనితీరుకు ఇవి ముఖ్యమైనవి. చేపనూనెలో డిహెచ్ఎ (DHA) ఎక్కువ గా ఉంటుంది. కెనడియన్ పరిశోధకులు ఇన్వెస్టిగేటివ్ ఆప్తాల్మాలజీ & విజువల్ సైన్స్ పత్రికలో తెలిపినట్లుగా, తగినంత డిహెచ్ఎ ను ఆహారం తీసుకోవడం వలన వయస్సు-సంబంధిత సమస్యల కారణంగా ఏర్పడే దృష్టి లోపం నుండి మనలను కాపాడుతుంది. మన కంటి నిర్మాణంలో ఒమేగా -3 కొవ్వులు ముఖ్యమైన పాత్ర  కూడా పోషిస్తాయి. తగినంత ఒమేగా -3 కొవ్వులు అందని వారికి కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇంకా, వృద్ధాప్యం రావడంతో పాటుగా కంటి ఆరోగ్యం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది మరియు ఇది వయస్సు-సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్ (age-related macular degeneration, AMD) కు దారితీస్తుంది. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ కొంతవరకు ఎఎండి ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.


మూర్ఛ కోసం చేప నూనె

మూర్ఛ అనేది నాడీ సంబంధిత ఒక రుగ్మత. ఇది మెదడు కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది మరియు మూర్ఛలకు కూడా కారణమవుతుంది. చేప నూనె వినియోగం ఆరోగ్యకరమైన మెదడు మరియు మెరుగైన మెదడు పనితీరుతో ముడిపడి ఉంటుందని ఈపాటికి మనకు తెలిసింది.

న్యూరాలజీ, న్యూరోసర్జరీ & సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజూ మితమైన మోతాదులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తీసుకునే మూర్చరోగులు ఫీట్స్ సంభవించడాన్ని తక్కువగా ఎదుర్కుంటారు అని తెలుస్తుంది.


బరువు తగ్గడానికి చేప నూనె 

బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్‌ఐ) సంఖ్య 30 కన్నా ఎక్కువ ఉండటం అనేది సాధారణంగా  ఊబకాయంగా నిర్వచించబడుతుంది. జీవనశైలి మరియు ఆహార మార్పుల వలన ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం కేసులు బాగా పెరిగాయి. అమెరికా వంటి అధిక ఆదాయ దేశాలలో ఈ ఊబకాయుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఊబకాయం గుండె జబ్బులు, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

క్లినికల్ అధ్యయనాలు చేప నూనె సప్లీమెంటేషన్ ఊబకాయం ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో  బాగా సహాయపడుతుందని సూచిస్తున్నాయి.

అదనంగా, కొన్ని అధ్యయనాలలో డెయిటింగ్ లేదా వ్యాయామంతో పాటుగా చేపల నూనెను కూడా తీసుకుంటే అది బరువును వేగంగా తగ్గించడానికి కూడా సహాయపడుతుందని తేలింది.


చేప నూనె వాపును తగ్గిస్తుంది 

ఇన్ఫలమేషన్ (వాపు) అనేది అంటువ్యాధులు మరియు గాయాలకు వ్యతిరేకంగా మన రోగనిరోధక వ్యవస్థ యొక్క సహజ ప్రతిస్పందన. అయినప్పటికీ, అధిక సమయం పాటు తక్కువ స్థాయిలో వాపు సంభవించే అవకాశం ఉంటుంది. దీనిని క్రానిక్ (దీర్ఘకాలిక) ఇన్ఫలమేషన్ అని కూడా అంటారు. ఇది స్థూలకాయం/ఊబకాయం, మధుమేహం, నిరాశ మరియు గుండె జబ్బులు వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు మరింత క్షిణించేలా చేస్తుంది. అటువంటి సందర్భాలలో వాపు యొక్క ప్రభావాలను బాగా తగ్గించడం అనేది ఈ వ్యాధుల లక్షణాలకు చికిత్స చేయడంలో కూడా సహాయపడుతుంది. చేపల నూనె యొక్క వాపు నిరోధక లక్షణాలను అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి, ఇవి అటువంటి వ్యాధుల చికిత్సకు సహాయపడతాయి.

చేపల నూనె యొక్క వాపు నిరోధక ప్రభావం ఇన్ఫలమేటరీ కారక జన్యువులను తగ్గించడంతో ముడిపడి ఉంటుందని జంతు-ఆధారిత అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఒక క్లినికల్ అధ్యయనంలో, ఆర్థరైటిక్ రోగులలో వాపు మరియు కీళ్ల నొప్పులను తగ్గించడానికి చేప నూనె సప్లీమెంటేషన్ సహాయపడుతుందని కనుగొనబడింది. చేపల నూనె ఇబుప్రోఫెన్ (వాణిజ్యపరమైన వాపు నిరోధక ఔషధం) వలె ప్రభావవంతంగా ఉంటుందని మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి ఒక ఔషధంగా పనిచేస్తుందని ఈ  అధ్యయనం సూచించింది.

చర్మానికి చేప నూనె ప్రయోజనాలు 

చర్మం మానవ శరీరంలో అతిపెద్ద అవయవం .  ఇది అనేక పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లను కలిగి ఉంటుంది. చర్మ కణాలలో ప్రధాన లిపిడ్ గా మాత్రమే కాకుండా, చర్మ కణజాలం యొక్క బెరియర్ (హద్దు) పనిని నిర్వహించడానికి మరియు చర్మం లోపలి పొరలకు నీరు మరియు పోషకాల సరఫరాను సులభతరం చేయడానికి ఒమేగా 3 కొవ్వులు అవసరం. అయితే, చర్మ ఆరోగ్యం వయస్సు పెరగడంతో పాటు తగ్గుతుంది. హానికరమైన కాలుష్య కారకాలు మరియు యువి కిరణాలకు గురికావడం వల్ల మన చర్మం దాని సహజమైన ప్రకాశాన్ని కూడా కోల్పోతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మూలంగా, చేపల నూనె సప్లీమెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు చర్మం పొడిబారడాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఒక క్లినికల్ అధ్యయనంలో, చేప నూనెను 25 మంది సోరియాసిస్ రోగులకు 4 వారాల పాటు సమయోచితంగా (topically) అందించారు. సోరియాసిస్ ఫలకాల పరిమాణంలో గుర్తించదగిన తగ్గుదల గమనించబడింది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, చేపల నూనెలో ఉండే పాలిఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఇన్ఫలమేషన్ చర్యలో జోక్యం చేసుకోవడం ద్వారా మరియు ప్రోఇన్‌ఫ్లమేటరీ అణువుల చర్యను నిరోధించడం ద్వారా చర్మపు వాపును బాగా తగ్గిస్తాయి.


పిండం అభివృద్ధికి చేప నూనె 

శిశువు చిన్నపాటి నుండి పెరుగుదల మరియు అభివృద్ధికి ఒమేగా -3 లు అవసరం, అందువల్ల, తల్లులు గర్భధారణ సమయంలో మరియు పాలిచ్చేటప్పుడు ఒమేగా -3 కొవ్వులను తగినంత నిష్పత్తిలో తీసుకోవడం చాలా అవసరం. గర్భం యొక్క చివరి మూడు నెలల్లో ఒమేగా -3 ల వినియోగం పిండంలో ఇంద్రియ, మేధాశక్తి మరియు మోటారు అభివృద్ధిని కూడా మెరుగుపరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పిండం యొక్క మెరుగైన అభివృద్ధి కోసం గర్భిణీ స్త్రీలు తమ గర్భం యొక్క చివరి త్రైమాసికంలో చేప నూనెను తప్పనిసరిగా చేర్చాలని సలహా ఇవ్వబడుతుంది.

గర్భధారణ సమయంలో మరియు పాలిచ్చే సమయంలో ఫిష్ ఆయిల్ సప్లీమెంటేషన్  శిశువులలో చేతి మరియు కంటి సమన్వయాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. చేప నూనెను తల్లి ద్వారా అందించడం శిశువుకి వలన శిశువులలో దృష్టి/చూపు అభివృద్ధిని బాగా  మెరుగుపరుస్తుంది మరియు అలెర్జీ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.


చేప నూనె దుష్ప్రభావాలు 

చేప నూనె మరియు ఫిష్ లివర్ ఆయిల్ యొక్క ఒమేగా -3 సప్లిమెంట్లను తీసుకోవడం కొంతమంది ఆరోగ్యానికి ప్రమాదకరమని కూడా సూచించబడింది.


 • పంటి చిగుళ్ళ మరియు ముక్కురక్తస్రావం అధిక చేప నూనె వినియోగం యొక్క ప్రామాణికమైన దుష్ప్రభావం. పరిశోధన ప్రకారం, చేప నూనె ఆరోగ్యకరమైన వారిలో కూడా రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోధిస్తుంది, ఇది ఈ రక్తస్రావం యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, శస్త్రచికిత్సకు ముందు చేపల నూనె తీసుకోవడం మానేయాలని మరియు వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులను వాడుతున్నట్లయితే ఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకునే ముందు మీ వైద్యుడితో ఒకసారి మాట్లాడాలని సూచించబడుతుంది.
 • చేపల నూనె యొక్క సాధారణ అనారోగ్య ప్రభావాలలో అపానవాయువు వంటి ఇతర జీర్ణక్రియ సమస్యలతో పాటు అతిసారం ఒకటి. చేపల నూనెలో ఇతర రకాల ఒమేగా -3 కొవ్వులు కూడా ఉంటాయి, ఇవి అతిసారానికి కూడా కారణం కావచ్చు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు తీసుకున్న తర్వాత అతిసారం అనుభవించినట్లయితే, మీరు మీ సప్లిమెంట్లను భోజనంతో కలిపి తీసుకోవాలి మరియు లక్షణాలు కొనసాగుతుంటే మోతాదును తగ్గించండి.
 • విటమిన్ ఎ అధికంగా ఉండే కొన్ని రకాల ఒమేగా -3 కొవ్వు ఆమ్ల సప్లిమెంట్లు ఉన్నాయి. అధిక మొత్తంలో తీసుకుంటే ఇది విషపూరితం అవుతుంది. విటమిన్ ఎ టాక్సిసిటీ మైకము, వికారం, కీళ్ల నొప్పులు మరియు చర్మపు చికాకు వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో, ఇది కాలేయ దెబ్బతినడానికి మరియు తీవ్రమైన పరిస్థితులలో కాలేయ వైఫల్యానికి కూడా దారితీస్తుంది. ఈ కారణంగా, మీ ఒమేగా -3 సప్లిమెంట్లలోని విటమిన్ ఎ కంటెంట్ పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
 • మీరు చేపల నూనె సప్లిమెంట్లను తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు, మొదట్లో  గుండెల్లో మంట మరియు కడుపులో అసౌకర్యాలను అనుభవించవచ్చును . దీనికి కారణం దానిలో ఉండే అధిక కొవ్వు పరిమాణం. కొవ్వు కూడా అజీర్ణానికి దారితీస్తుందని అనేక అధ్యయనాలలో తేలింది. మితమైన మోతాదులో తీసుకోవడం మరియు భోజనంతో పాటుగా సప్లిమెంట్లను తీసుకోవడం ఉత్తమం ఇది యాసిడ్ రిఫ్లక్స్ను తగ్గిస్తుంది మరియు దాని లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా, మీ మోతాదును చిన్న భాగాలుగా విభజించి, రోజంతా వాటిని తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్య తగ్గుతుంది.


ఉపసంహారం 

చేప నూనెల సప్లిమెంట్ల యొక్క మంచి/తగినంత మోతాదు ఎటువంటి వైద్య సమస్యలు లేనంత వరకు సురక్షితంగా ఉపయోగించవచ్చును . ఫిష్ ఆయిల్ దాని ఆరోగ్య ప్రయోజనకర లక్షణాలకు బాగా ప్రసిద్ది చెందింది. చేప నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్నందున, ఇది రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుందని, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుందని మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల యొక్క లక్షణాలను కూడా తగ్గిస్తుందని తేలింది.

అయినప్పటికీ, అధికమైన చేప నూనె వినియోగం ఎల్లప్పుడూ మంచిది కాదు మరియు అధిక మోతాదులో తీసుకోవడం అనేది ఆరోగ్య విషయంలో మంచి కంటే హానే ఎక్కువ కలిగిస్తుంది.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post