నిమ్మ లోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు
పోషకాలు : సిట్రస్ జాతికి చెందిన కాయ నిమ్మ. దీనిలో విటమిన్ సి ఎక్కువ గా ఉంటుంది. విటమిన్ A, B కాంప్లెక్స్, ఐరన్, కాల్షియమ్ మరియు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, పెక్టిన్, ఫైబర్ కూడా ఉంటాయి. నిమ్మలో ఇంకా యాంటీ వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి .
నిమ్మ వల్ల కలిగే లాభాలు :
గుండెలో మంట, కడుపు ఉబ్బరాన్నికూడా తగ్గిస్తుంది .
శరీరానికి తక్షణ శక్తినిస్తుంది మరియు జీర్ణ శక్తిని కూడా పెంపొందిస్తుంది.
నిమ్మ రసంలో తేనే కలుపుకొని త్రాగటం వలన బరువు తగ్గటమే కాకుండ నోటి దుర్వాసన, చిగుర్ల ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.
చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది, ముడతలు, దదుర్లు రాకుండా చేస్తుంది.
మలబద్దకాన్ని నివారించి , పైల్స్ రాకుండా నిరోధిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని విషపదార్దాలను బయటికి పంపిస్తుంది.
బిపి ని కంట్రోలులో ఉంచుతుంది. కీళ్ళ నొప్పులను కూడా నివారిస్తుంది .
కాలేయాన్ని శుభ్రపరుస్తుంది, పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది.
జలుబు, జ్వరం నుండి ఉపశమనాన్నికూ డా ఇస్తుంది.
శరీరం దుర్వాసన లేకుండా చేస్తుంది.
Post a Comment