శిలాజిత్తు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
శిలాజిత్తు అంటే ఏమిటి?
శిలాజిత్తు సహజంగా లభించే ఖనిజ పదార్ధం. ఇది భారత ఉపఖండంలోని హిమాలయ మరియు హిందూకుష్ శ్రేణులలో లభిస్తుందని కూడా కనుగొనబడింది. ఇది లక్క లాంటి అరుదైన “రెసిన్” (గుగ్గిలం). మొక్కలు మరియు మొక్క-సంబంధ పదార్థాలు వేలాది సంవత్సరాల పాటు కుళ్ళిపోయి, అటుపై అలా ఆ కుళ్ళిన పదార్ధం బండరాళ్ళపైన, రాళ్ళ మధ్యలోను చిక్కుకు పోయి కాలక్రమాన నల్లటి లేక గోధుమ రంగు బంక-వంటి పదార్ధంలాగా తయారై శిలాజుత్తుగా మారుతుంది. భారతీయ సంప్రదాయిక వైద్య విధానం వేల సంవత్సరాల నుండి శిలాజిత్తు ను ఉపయోగిస్తోంది. ఇందుకు శిలాజిత్తులో ఉన్న ఆరోగ్య రక్షక లక్షణాలే కారణం.
శిలాజిత్తు గురించిన ప్రస్తావనలు చరక సంహిత మరియు శుశ్రుత సంహిత లో కూడా కనిపిస్తాయి. ఈ రెండింటిలోనూ శిలాజిత్తు ను "బంగారం వంటి లోహపు రాళ్ళు" గాను, మరియు సాంద్రత కల్గిన బంకపదార్థం (gelatinous substance) గానూ పేర్కొనబడింది. ఆయుర్వేద శాస్త్రం శిలాజిత్తును మొత్తం శరీర ఆరోగ్యాన్ని వృద్ధిపరిచే ఓ “టానిక్” లేదా “రసాయనం” అని కూడా పేర్కొనింది. శిలాజిత్తు యొక్క విస్తృత ప్రయోజనాలను ఆయుర్వేదం బాగా వివరించింది. వాస్తవానికి, “శిలాజిత్తు” పేరుకు అర్థం "పర్వతాల విజేత” అని, మరియు “బలహీనతను నాశనం చేస్తుంది" అనే అర్ధం వస్తుంది. దురదృష్టవశాత్తు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం సహజసిద్ధమైన “శిలాజిత్తు” అనబడే ఈ అద్భుత (మందు) వస్తువు గురించి ఇంకా పరిశోధనాది అన్వేషణలు జరపాల్సి ఉంది.
శిలాజిత్తు ప్రాథమిక వాస్తవాలు:
లాటిన్ పేరు: ఆస్ఫాల్టం పుంజాబియనం (Asphaltum punjabianum)
సాధారణ పేరు: తారు, ఖనిజ పిచ్, మినరల్ మైనం, షిలాజిట్
సంస్కృతం పేరు: శిలాజిత్, శిలాజిత
భౌగోళిక పంపిణీ: శిలాజిత్తు సాధారణంగా హిమాలయాల్లో కనిపిస్తుంది. భారత్ లోని హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్‌లు రాష్రాల్లో శిలాజిత్తు సాధారణంగా లభిస్తుంది. ఇది చైనా, నేపాల్, పాకిస్తాన్, టిబెట్ మరియు ఆఫ్ఘనిస్తాన్లలో కూడా దొరుకుతుంది.
మీకు తెలుసా?
ఆయుర్వేద వైద్యులు చెప్పిన ప్రకారం, శిలాజిత్తు యొక్క వాసన ఆవు మూత్రంలా (పంచితం) ఉంటుంది. జానపద కథల ప్రకారం కల్తీ లేని ముడి శిలాజిత్తును స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సేవిస్తే అది వారిరువురికీ కూడా చాలా మిక్కుటంగా ఉపయోగపడుతుందట.
శిలాజిత్తు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
- చక్కెరవ్యాధికి శిలాజిత్తు
- కొవ్వు (కొలెస్ట్రాల్) స్థాయిని నిర్వహించే శిలాజిత్తు
- బరువు కోల్పోయేటందుకు శిలాజిత్తు
- మలబద్ధకానికి శిలాజిత్తు
- కడుపు పూతలకు శిలాజిత్తు
- గుండెకు శిలాజిత్తు
- రక్తహీనతకు శిలాజిత్తు
- మొలలకు శిలాజిత్తు
- పురుషులకు శిలాజిత్తు ప్రయోజనాలు
- శిలాజిత్తు అనామ్లజని లక్షణాలు -
- ఎత్తుప్రదేశాల్లో వచ్చే రోగాలకు శిలాజిత్తు
- మతిపరుపు (అల్జీమర్స్) వ్యాధికి శిలాజిత్తు
శిలాజిత్తును ఎలా ఉపయోగించాలి
శిలాజిత్తు మోతాదు
శిలాజిత్తు దుష్ప్రభావాలు
శిలాజిత్తు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :
శిలాజిత్తుకు పలు రకాల రోగాల్ని నయం చేసే ప్రయోజనాలున్నాయి. అతి ముఖ్యంగా ఇది ఆరోగ్య బలవర్ధకౌషధం (health tonic). మన ఆరోగ్యాన్ని హెచ్చించే శిలాజిత్తు ఉపయోగాలు
బరువు కోల్పోవటానికి సహాయం చేస్తుంది: క్లినికల్ అధ్యయనాలు శిలాజిత్తు కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలను కలిగి ఉందని సూచిస్తున్నాయి, అవి బిఎంఐ (BMI) ను పెంచడం ద్వారా బరువు మరియు చుట్టుకొలత కూడా తగ్గిస్తుంది.
మలబద్ధకం తగ్గిస్తుంది: శిలాజిత్తు శరీరంలోని టానిక్ ప్రభావాలను కలిగి ఉంటుంది, ఇది పేగు కండరాల కదలికను పెంచుతుంది మరియు జీర్ణక్రియను పెంచుతుంది. శరీరం నుండి జీర్ణమైన ఆహారాన్ని బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది, తద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది: శిలాజిత్తును సుమారు 1.5 నెలలు క్రమం తప్పకుండా తీసుకుంటే, వీర్యకణాల సంఖ్యను మెరుగుపరుచుకోవడంలో సమర్థవంతమైనదిగా కూడా పని చేస్తుంది.
పర్వత అనారోగ్యాన్నితగ్గిస్తుంది: శిలాజిత్తు అనేది పర్వత అనారోగ్య సమస్యలకు ఒక మంచి పరిష్కారం. ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఊపిరితిత్తుల సమస్యలను మరియు హైపోక్సియా వంటి పర్వత అనారోగ్యాలని తగ్గించడానికి శిలాజిత్తు బాగా సహాయపడుతుంది.
రక్తహీనతను అదుపు చేస్తుంది: శిలాజిత్తు ఇనుముకు మంచి మూలకం, ఇది హిమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. శరీరానికి ఒక టానిక్‌లా పనిచేసి, రక్తహీనత మరియు అలసట కూడా తగ్గిస్తుంది.
అల్జీమర్స్ పురోగతిని తగ్గిస్తుంది: శిలాజిత్తులో ఉన్న ఫుల్విక్ యాసిడ్ (fulvic acid) మెదడులో టావు ప్రోటీన్ (tau protein) అధికంగా చేరడాన్ని కూడా నిరోధిస్తుంది, ఈ టావు ప్రోటీన్ న్యూరోడెజెనరేషన్ మరియు అల్జీమర్స్ కు బాధ్యత వహిస్తుంది. అయితే, ఈ ప్రయోజనాన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు కూడా అవసరమవుతాయి.
కడుపు పూతలను నిరోధిస్తుంది: శిలాజిత్తు గ్యాస్ట్రిక్ స్రావాలాను తగ్గిస్తుందని మరియు కడుపు లోపల పొరల్ని బలోపేతం చేస్తుందని. తద్వారా కడుపులో పుండు ఏర్పడకుండా నిరోధిస్తుందని కూడా తెలుస్తుంది.
చక్కెరవ్యాధికి శిలాజిత్తు :
ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం, శిలాజిత్తు మధుమేహం రోగ లక్షణాలను నయం చేసేటందుకు ప్రసిద్ధి చెందింది. చక్కెరవ్యాధి ఉన్నవారిలో వాళ్ళు సేవించే వివిధ ఔషధాల దుష్ప్రభావాలను తగ్గించదానికి శిలాజిత్తును వాడమంటూ ఆయుర్వేద వైద్యులు సూచిస్తుంటారు. అంతేకాకుండా, శిలాజిత్తును కొందరిలో రాత్రిపూట కలిగే అతిమూత్ర వ్యాధికి, అంటే ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు పోవాల్సివచ్చే సమస్యకు, ఆయుర్వేద వైద్యులు సూచిస్తుంటారు. రాత్రి సమయంలో అనేకసార్లు మూత్రవిసర్జన సమస్య అనేది వృద్ధాప్య సూచనను లేదా చక్కెరవ్యాధి పొడజూపే లక్షణంగా భావించబడుతుంది.
భారతదేశంలో జరిపిన అధ్యయనాలు ధృవీకరించేమంటే శిలాజిత్తును చక్కెరవ్యాధికిచ్చే ఔషధాలతో కలిపి తీసుకున్నట్లైన చక్కెరవ్యాధి రోగుల్లో రక్తంలో చక్కెరస్థాయిని తగ్గించడంలో ఆ మందులు మరింత సమర్థవంతంగా పని చేస్తాయని అధ్యయనాలు సూచించడం జరిగింది. అయినప్పటికీ, శిలాజిత్తు గురించిన అధ్యయనాలు, పరిశోధనలు మనుషులపైన ఇంకా జరపనందున, చక్కెరవ్యాధిగ్రస్థులు శిలాజిత్తును సేవించాలనుకుంటే ముందు మీ వైద్యులు లేదా ఆయుర్వేద వైద్యులతో సంప్రదించి వారి సలహా మేరకే శిలాజిత్తును సేవించండి.
కొవ్వు (కొలెస్ట్రాల్) స్థాయిని నిర్వహించే శిలాజిత్తు :
ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని నిర్వహించడంలో శిలాజిత్తు గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రెండు గ్రాముల శిలాజిత్తును దిననిత్యం సేవిస్తున్న యెడల తక్కువ సాంద్రత కలిగిన కొవ్వులు లేదా "చెడు కొలెస్ట్రాల్" స్థాయిల్ని తగ్గించడంలో, అదే సమయంలో ఎక్కువ సాంద్రత కలిగిన కొవ్వులు లేదా "మంచి కొలెస్ట్రాల్" ను పెంచడంలోనూ శిలాజిత్తు ప్రభావవంతంగా పని చేస్తుందని అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి.
శిలాజిత్తులో ఉండే “ఫుల్విక్ యాసిడ్,” రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈ పదార్థానికు (శిలాజిత్తు) న్న హైపోలియోపిడెమిక్ ప్రభావాలే కారణమని అధ్యయనంలో సూచించబడింది. అంతేకాక, శిలాజిత్తులో అనామ్లజనకాలైన విటమిన్ సి మరియు E కూడా ఉన్నాయి. ఈ అనామ్లజనకాలు ధమనులలో ఫలకం (plaque) పెరుగుదలను నివారించడం, తద్వారా గుండె స్ట్రోకుల ప్రమాదాన్ని తగ్గించడం జరుగుతుందని అధ్యయనకారులు కూడా సూచిస్తున్నారు.
బరువు కోల్పోయేటందుకు శిలాజిత్తు :
నానాటికీ ఊబకాయం సమస్య ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను కలిగించే సమస్యల్లో ఒకటిగా తలెత్తుతోంది. ఆధునిక సంస్కృతి మరియు జీవనశైలి ఈ సమస్యను అత్యంత ప్రాముఖ్యమైన అంశంగా మార్చింది. వాస్తవానికి, WHO ఊబకాయం సమస్యను ఒక "ప్రపంచ అంటువ్యాధి" గా పేర్కొంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ లో ప్రచురించబడిన ఒక సమీక్షా వ్యాసం, శరీర కణజాలంలో ఆక్సిజన్ యొక్క సరఫరా (supply) మరియు డిమాండుల్లో కలిగే అసమతుల్యతే ఊబకాయం సమస్యకు ప్రాధమిక కారణం అని సూచించింది. ఫుల్విక్ ఆమ్లం, ఖనిజాలు మరియు ఇనుముకు శిలాజిత్తు ఓ గొప్ప మూలం అని ఆయుర్వేదంలో సూచించబడింది.
ఇది శరీరంలోని ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ఎర్ర రక్త కణాలు శరీరంలోని కణజాలాలకు ప్రధాన ఆక్సిజన్ వాహకాలు.కాబట్టి, ఎంత వేగంగా ఈ కణాలు పునఃస్థాపించబడతాయో అంతే వేగంగా కణజాలాలకు ప్రాణవాయువును కూడా సరఫరా చేస్తాయి. బరువును కోల్పోయేటందుకున్న పలు మార్గాలు, కార్యక్రమాలలో శిలాజిత్తు యొక్క ప్రభావాలను పరీక్షించడానికి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. భారతదేశంలో జరిపిన ఒక అధ్యయనంలో 70 మంది వ్యక్తులపై శిలాజిత్తు ప్రభావాన్ని పరీక్షించారు. శిలాజిత్తు సేవనం కడుపు మడతల్ని తగ్గించిందని మరియు తుంటి మరియు నడుము చుట్టుకొలతలో కూడా గణనీయమైన బరువు తగ్గడానికి శిలాజిత్తు దోహదపడిందని ఆ పరిశోధన తెలిపింది. మరో అధ్యయనం ప్రకారం, శిలాజిత్తును, జయచెట్టు/అగ్నిమంథ/ఆర్నీ (Clerodendrum phlomidis) తో కలిపి కొంతమందికిచ్చి పరీక్షించగా శరీర బరువు తగ్గడం గమనించబడింది మరియు బేసల్ మెటబోలిక్ ఇండెక్స్ (BMI-అంటే మన శరీరం విశ్రాంతిగా ఉన్నపుడు ఎన్ని క్యాలరీలను ఖర్చు చేస్తుందన్నది)ను తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉందని తేలింది. అందువల్ల, బరువు కోల్పోవడానికి శిలాజిత్తు చాలా ప్రభావవంతమైనదని కూడా చెప్పవచ్చు.
మలబద్ధకానికి శిలాజిత్తు :
మలబద్ధకం వంటి జీర్ణకోశ లోపాలు ఈ రోజుల్లో మరింతగా పెరుగుతున్నాయి. మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా ఏదో అవరోధం కలుగుతోందన్న భావం కలిగి ఉంటారు. కొన్ని తీవ్ర సందర్భాలలో పురీషనాళపు మృదులాస్థిలో రక్తస్రావం కావడం కూడా గుర్తించబడింది. ఈ రోజుల్లో అందరికీ సామాన్యంగా కలిగే ఆరోగ్య సమస్యల్లో ఒకటి అయిన దీర్ఘకాలిక మలబద్ధకం కోసం ఆయుర్వేదలో ఒక అద్భుతమైన ఏజెంట్ గా శిలాజిత్తును సూచిస్తున్నారు.
ఈ సమస్యకు ఖచ్చితమైన కారణాలు ఇంకా సూచించబడలేదు. అయితే వ్యక్తి యొక్క శరీర ధర్మం మరియు వారి జీవనశైలిపై ఈ మలబద్దకం రావడమనేది ఎక్కువగా జరుగుతోంది. శిలాజిత్తు ఆరోగ్యాన్ని పెంచే ఓ మంచి టానిక్ గనుక పేగు గోడలని బలపరుస్తుందని, మరియు ప్రేగుల యొక్క పెర్సిస్టల్టిక్ (క్రమాంకుచక) కదలికలను నియంత్రిస్తుంది (ఈ ప్రేగు కదలికలు తమలోని ఆహారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సాయపడతాయి.) శిలాజిత్తు కాలేయం నుండి పిత్తాశయం యొక్క స్రావాణ్ని కూడా పెంచుతుంది. ఈ కాలేయ స్రావాలు ఆహారానికి తేమను జోడించి బాగా జీర్ణం కావటానికి సహాయపడతాయి.
కడుపు పూతలకు శిలాజిత్తు :
ప్రపంచంలో ఉదర-సంబంధమైన సమస్యలకు, పొట్ట అసౌకర్యానికి దారితీసే ప్రాధమిక కారణాల్లో “గ్యాస్ట్రిక్ అల్సర్స్” ఒకటి. నిరంతర ఒత్తిడికి గురైన లేదా కొన్ని సూచించిన ఔషధాల్ని సేవించే వ్యక్తులు ఈ సమస్యకు సులభంగా గురవుతారు. శిలాజిత్తు సేవనం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ ఆమ్ల స్రావం తగ్గిపోతుంది. ఇంకా, గ్యాస్ట్రిక్ ఆమ్ల స్రావం కారణంగా కడుపు గోడలు విచ్ఛిన్నం కాకుండా ఆ లోపలి పొరను గ్యాస్ట్రిక్ ఆమ్లము చేత కాల్చబడకుండా కాపాడటంలో శిలాజిత్తు ప్రముఖ పాత్ర వహిస్తుంది, అని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయినా దీన్ని ధృవీకరించే అధ్యయనాలు ఇప్పటికీ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి శిలాజిత్తును సేవించే ముందు మీ ఆయుర్వేద డాక్టర్‌తో మాట్లాడటం చాలా మంచిది.
గుండెకు శిలాజిత్తు :
ప్రయోగశాల అధ్యయనాల ప్రకారం శిలాజిత్తు రక్తపోటు మరియు హృదయ స్పందన (హార్ట్ బీట్) రేటుపై మోతాదు-ఆధారితమైన ప్రభావం చూపుతుంది. శిలాజిత్తును తక్కువ మోతాదులో తీసుకుంటే హృదయ స్పందన రేటును తగ్గిస్తుండగా, అధిక మోతాదుల్లో శిలాజిత్తును సేవిస్తే ప్రాణాంతకమైన స్థాయిలో హృదయ స్పందన రేటు గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈ విషయాన్ని నిరూపించటానికి మనుషులపై ఇంకా అధ్యయనాలు కూడా జరపబడలేదు. కాబట్టి, మీరు ఏదేని గుండె-సంబంధ సమస్యలతో బాధపడుతుంటే, శిలాజిత్తును ఏదైనా రూపంలో తీసుకునే ముందు మీ ఆయుర్వేద డాక్టర్‌తో మాట్లాడటం చాలా మంచిది.
రక్తహీనతకు శిలాజిత్తు :
రక్తంలో ఎర్ర రక్త కణాలు (RBC) మరియు హిమోగ్లోబిన్ తక్కువగావడమే “రక్తహీనత” లేదా అనీమియా స్థితికి కారణం. ఆయుర్వేదం వైద్యులు ప్రకారం, శిలాజిత్తు ఇనుమును దండిగా గల్గిన ఖనిజం, అందువల్ల ఇది శరీరంలో రక్తం ఏర్పడటానికి, వృద్ధి కావడానికి బాగా తోడ్పడుతుంది. జంతువుల పై జరిపిన అధ్యయనాల ప్రకారం, శిలాజిత్తును సాధారణంగా సేవిస్తే శరీరంలో హేమోగ్లోబిన్ స్థాయి మరియు ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుందని సూచిస్తున్నాయి.
అదనంగా, శిలాజిత్తు అనేది ఓ ఆయుర్వేద టానిక్ మరియు కోల్పోయిన బలాన్ని తిరిగి పెంపొందించుకునేందుకు తోడ్పడే “పునరుజ్జీవిని” లేదా రిజూవెవనేటర్. అందువల్ల, ఇది సాధారణంగా రక్తహీనతతో సంబంధం కలిగి ఉన్న అలసట మరియు బలహీనత వంటి సమస్యలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అయినప్పటికీ, శిలాజిత్తు పూర్తి ఉపయోగం గురించి మనుషులపై జరిపిన అధ్యయనాలు లేనందున, మీ ఆయుర్వేద డాక్టర్‌తో సంప్రదించిన తర్వాతే శిలాజిత్తును మందుగా సేవించడం సరైన మార్గం.
మొలలకు శిలాజిత్తు :
ప్రతి ఒక్కరికి వారి వారి పురీషనాళం (rectum) లో భాగంగా “హేమోరోయిడ్”కణజాలాన్ని కలిగి ఉంటారు. కానీ, ఎప్పుడైతే ఈ హేమోరోయిడ్ కణజాలాల్లో అసహనీయమైన మంట, నొప్పి కలుగుతుందో ఆ పరిస్థితినే మూలవ్యాధి/అర్శస్సు అని అంటారు. దీనిని “మొలలు,” (లేక పైల్స్/హెమోరాయిడ్స్) అనే పేరుతోనే ఎక్కువగా పిలవడం కూడా జరుగుతోంది. హేమోరోహైడల్ కణజాలంలో వాపు, మంట తరువాత అనారోగ్యం కూడా సంభవించవచ్చు. అటుపై హేమోరోయిడ్ కణజాలాల్లో విపరీతమైన దురద మరియు రక్తస్రావం వంటి లక్షణాలకు దారితీస్తుంది.
వైద్యుల ప్రకారం, మూలవ్యాధికి ప్రధాన కారణం ప్రేగుల మరియు ఆసన (రెక్కుతుం) ప్రాంతంలో పెరిగిపోతున్న ఒత్తిడి. మొలల చికిత్సలో శిలాజిత్తు మందు వాడకాన్ని ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు. ఆయుర్వేదం శిలాజిత్తును ఒక టానిక్ గా పేర్కొంటోంది. శిలాజిత్తు యొక్క దిననిత్య సేవనం శరీరంలోని రక్త నాళాలకు బలాన్ని కూడా ఇస్తుంది. తద్వారా ధమనులు ఒత్తిడికి పగిలిపోకుండా నివారించవచ్చు. ఇంకా, కడుపులో ఒత్తిడిని ఉపశమింపచేసేందుకు శిలాజిత్తు సేవనం బాగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు సూచించారు. కానీ, మీరు మొలలచేత బాధపడుతుంటే, మీ శరీరతత్త్వం ప్రకారం శిలాజిత్తు సేవనం జరగాలి. శిలాజిత్తు యొక్క సరైన మోతాదు మరియు ఉపయోగించడం గురించి మీ ఆయుర్వేద డాక్టర్‌తో మాట్లాడటం చాలా మంచిది.
పురుషులకు శిలాజిత్తు ప్రయోజనాలు :
అల్పశుక్రాణుత లేదా ఒలిగోస్పెర్మియా (తక్కువైన వీర్యకణాలు) అనే రుగ్మతకు శిలాజిత్తును వాడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వీర్యకణాలు తక్కువవడం వల్ల వచ్చే సమస్యనే అల్పశుక్రాణుత. ఓ అధ్యయనంలో, 60 మంది వ్యక్తులకు శిలాజిత్తు యొక్క 100 గ్రాముల గుళికల్ని (capsules) 90 రోజుల వ్యవధిలో రోజుకు రెండు సార్లు ఇచ్చి సేవింపజేశారు. దీనివల్ల ఆ 60 మంది వ్యక్తుల్లో మొత్తం వీర్యకణాల సంఖ్య, పురుష లైంగిక అణువైన FSH ((follicle stimulating hormone)తో పాటు పెరిగినట్లు గుర్తించారు. FSH అనేది వీర్యకణ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ అధ్యయనంలో 60 మందికిచ్చిన శిలాజిత్తు మోతాదు వల్ల కాలేయ నష్టం ఏమాత్రం జరగలేదని సూచించబడింది. మరొక అధ్యయనంలో, శిలాజిత్తు “టెస్టోస్టెరోన్” (వృషణాల్లో వృద్ధి అయ్యే పురుష హార్మోన్లు) అనే పురుష హార్మోన్ల స్థాయిని పెంచుతుందని కూడా గుర్తించారు. అందువల్ల, పురుషుల లైంగిక సమస్యలకు శిలాజిత్తు ఓ మంచి సామర్ధ్యం కల్గిన పరిష్కారం.
శిలాజిత్తు అనామ్లజని లక్షణాలు :
శుద్ధి చేయబడిన శిలాజిత్తు ఒక అద్భుతమైన అనామ్లజని. శుద్ధి చేయబడిన శిలాజిత్తు అనేది శుద్ధి చేయబడని ముడి శిలాజిత్తు కంటే మెరుగైన అనామ్లజని అని రసాయన అధ్యయనాలు సూచిస్తున్నాయి. శిలాజిత్తు యొక్క ఫుల్విక్ యాసిడ్ మరియు పోషకాహార సమ్మేళన పదార్థాలు శిలాజిత్తు యొక్క ప్రాధమిక అనామ్లజనకాలుగా పరిగణించబడుతున్నాయి. శిలాజిత్తులోని ఈ సమ్మేళన పదార్థాలు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని కల్గించే (హానికారక) స్వేచ్ఛా రాశుల్నితొలగించేస్తాయి. తద్వారా, ఆక్సిడేటివ్ ఒత్తిడి శరీరంలో తగ్గుతుంది. ఈ స్వేచ్ఛా రాశులు అంటే ఏమిటి అని అనుకుంటున్నారా? స్వేచ్ఛా రాశులు అనేవి ఆక్సిజన్ జాతుల రకం, అవి తమ స్వంత జీవక్రియ విధులు ద్వారా శరీరంలో ఏర్పడతాయి. ఒత్తిడి మరియు జీవనశైలికి సంబంధించిన కారకాలు ఈ స్వేచ్చారాశుల నిర్మాణానికి తోడవుతాయి. ఈ స్వేచ్ఛా రాశులు శరీరంలో ఎక్కువగా ఉండడం వలన శరీర కార్యకలాపాలకు హానికరంగా ఉంటుంది. అనామ్లజనని (యాంటి-ఆక్సిడెంట్) అయిన శిలాజిత్తు దాదాపు అన్ని ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పని చేసేటట్టుగా ఉపకరిస్తుంది. అంతేకాక, శరీరంలో తక్కువ కాబడిన ఆమ్లజని (ఆక్సిడెటివ్) ఒత్తిడి చర్మం ముడుతలను కూడా తొలగిస్తుంది, అకాల వృద్ధాప్యసంకేతాలను తగ్గిస్తుంది. మరి చిన్నవయసులోనే వృద్ధాప్యాన్ని ఎవరు కోరుకుంటున్నారు?
ఎత్తుప్రదేశాల్లో వచ్చే రోగాలకు శిలాజిత్తు :
చాలా ఎత్తుకల్గిన ప్రదేశాల్లో, అంటే పర్వతప్రాంతాల్లో, నివసించేవారికి సామాన్యంగా వచ్చే అనారోగ్య సమస్యలు-శ్వాస సమస్యలు, వికారం, వాంతులు, అతిసారం, కడుపు సమస్యలు, ఆకలి లేకపోవడం, దగ్గు, బద్ధకం, మైకము మరియు అలసట వంటివి. ఎత్తైన ప్రాంతవాసుల్లో ఈ లక్షణాలు ఉంటాయని, పేర్కొన్న సమస్యలు వస్తుంటాయని గుర్తించబడింది. మీరు ఎప్పుడైనా కొండపై నుండే నివాసప్రాంతాలకు వెళ్ళి ఉన్నట్లయితే కొన్ని సామాన్య వాతావరణ లక్షణాల్ని గమనించే ఉంటారు. ఉదాహరణకు, మీకు చెవుల్లో ఝంకారము కలగడం లేక ఝుం మనడము జరిగే ఉంటుంది. అలాగే కొందరికి ఎత్తు ప్రాంతాలకెళ్ళినపుడు శ్వాస తీసుకోవడం కొంచెం కష్టంగా ఉండడం వంటి కొన్ని సాధారణ విషయాలను మీరు గమనించి ఉండవచ్చు. ఈ మార్పులు అధిక ఎత్తుల్లో ఉండే పీడనం మరియు పర్యావరణ పరిస్థితుల వ్యత్యాసం కారణంగా ఏర్పడతాయి. వయసు పైబడిన వాళ్ళు మరియు జబ్బుపడినవారిలో “పర్వత అనారోగ్యం” (mountain sickness) కారణంగా కొన్ని తీవ్రమైన పరిస్థితులైన ఆకలి మందగించడం, కడుపు నొప్పి, కండరాల తిమ్మిరి మొదలైన తీవ్రమైన లక్షణాలు గోచరిస్తుంటాయి.
భారతదేశంలో జరిపిన ఒక పరిశోధన ప్రకారం, అధిక ఎత్తుప్రదేశాలలో నివసించేవారికొచ్చే ఈ సమస్యలన్నింటికీ శిలాజిత్తు ఒకే ఒక్క పరిష్కారం. ఫుల్విక్ యాసిడ్ (ఒక రకమైన రసాయన సమ్మేళనం) మరియు ఇతర ఖనిజాల్లో శిలాజిత్తు ఉంటుంది. కనుక శిలాజిత్తు సేవనం హైపోక్సియా (లేదా hypoxamia-అంటే శరీరంలోని రక్తంలో ఆక్సిజన్ తగ్గి వచ్చే సమస్య) జలుబు వంటి రోగ లక్షణాలను ఉపశమింపచేయటానికి సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, శిలాజిత్తు శరీరానికి బలాన్ని చేకూర్చే టానిక్ లా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా శరీర ప్రధాన అవయవాల పనితీరును శిలాజిత్తు మెరుగుపరుస్తుంది. అదనంగా, ఎత్తైన ప్రదేశాల్లో నివసించేవారిలో కలిగే ఒత్తిడి మరియు ఆందోళన వంటి సమస్యలకు శిలాజిత్తు ఉపశమనం కలుగచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చివరగా, శిలాజిత్తు మూత్రావర్ధక మందు కాబట్టి, దీని సేవనం ఊపిరితిత్తులలో చేరే అదనపు ద్రవం వల్ల వచ్చే సమస్యను కూడా తొలగిస్తుంది, అంటే ఆ అదనపు ద్రవాన్ని ఊపిరితిత్తులనుండి తొలగిస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల వాపు (ఊపిరితిత్తులలో ద్రవాలు చేరడం) వ్యాధికి శిలాజిత్తు ఉపశమనకారిగా పనిచేస్తుంది.
మతిపరుపు (అల్జీమర్స్) వ్యాధికి శిలాజిత్తు :
మతిమరుపువ్యాధి లేక అల్జీమర్స్ (జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోవడం) అనేది నరాలవ్యాధి. ఇది చిత్తవైకల్యం (జ్ఞాపకశక్తి నశించడం) మరియు జ్ఞాన నష్టం వంటి పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ఆయుర్వేదంలో, శిలాజిత్తును కొన్ని ఇతర మూలికలతో పాటు రోగికి సేవింపజేసి ఆందోళన, మానసిక కల్లోలం, చిరాకు, కుంగుబాటు మొదలైన లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఉదహరించిన లక్షణాలు అల్జీమర్స తో సాధారణంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇటీవలి అధ్యయనాలు అల్జీమర్స్ యొక్క కొన్ని లక్షణాలను తగ్గించడంలో మరియు ఈ వ్యాధి యొక్క పురోగతిని మందగించడంలో శిలాజిత్తు ప్రభావవంతంగా పనిచేస్తుందని సూచిస్తున్నాయి.
శిలాజిత్తులోని ఫుల్విక్ యాసిడ్ మెదడులో ఉన్న ఒక సహజ ప్రోటీన్ అయిన “టౌ ప్రోటీన్” పొగవడాన్ని ఆపివేస్తుందని అధ్యయనకారులు సూచించారు. అదే టౌ ప్రోటీన్ మెదడులో ఇబ్బడి ముబ్బడిగా పోగై విపరీతంగా పెరిగిపోయినపుడు నరాలలకు సంబంధించిన రుగ్మతలకి దారితీస్తుంది. అయినప్పటికీ, మనుషులకు దాపురించే అల్జీమర్స్ కేసులలో శిలాజిత్తు యొక్క ఖచ్చితమైన సామర్థ్య-ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ అధ్యయనాలు జరగాల్సి ఉన్నాయి. కాబట్టి, శిలాజిత్తు సేవనంతో ఈ నరాలకు సంబంధించిన రుగ్మతల్ని నయం చేసుకోవాలని మీరు తలంచినట్లైతే ముందు మీ వైద్యునితో సంప్రదించి సలహా తీసుకోవడం చాలా మంచిది.
శిలాజిత్తును ఎలా ఉపయోగించాలి
శిలాజిత్తును సాధారణంగా లక్క (రెసిన్) లేదా పొడి రూపంలో ఉపయోగిస్తారు. కానీ ఇది క్యాప్సూల్స్, మాత్రలు, నూనె, క్రీములు మరియు సౌందర్య సాధనాల రూపంలో కూడా అందుబాటులో ఉంది. వాణిజ్యపరంగా, శిలాజిత్తు ద్రవరూపంలోను, సిరప్ గాను మార్కెట్లో అందుబాటులో ఉంది.
శిలాజిత్తు మోతాదు
శిలాజిత్తును 300-500 mg మోతాదులో ప్రతినిత్యం సేవించవచ్చును . దీనివల్ల సామాన్యంగా ఎటువంటి ముఖ్యమైన దుష్ప్రభావాలు ఉండవు. ఆయుర్వేదిక్ వైద్యుల ప్రకారం ద్రవరూప శిలాజిత్తును 1-3 డ్రాప్స్ మోతాదులో నిత్యం పాలతో కలిపి తీసుకొంటే మంచి ఆరోగ్యం సమకూరుతుంది.
శిలాజిత్తు యొక్క మోతాదు, అట్లాగే దీన్ని ఎంతకాలం తీసుకోవాలి వంటి విషయాలు ఒకరి నుండి ఒకరికి వ్యత్యాసం ఉంటుంది. దీని మోతాదు మరియు వ్యవధి ఆ వ్యక్తి యొక్క వయస్సు మరియు శారీరక స్థితిని బట్టి మారుతుంది. కాబట్టి, మీరు శిలాజిత్తును ఏ ప్రమాణంలో తీసుకోవాలో తెలుసునేందుకు ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించడమే చాలా మంచిది.
శిలాజిత్తు దుష్ప్రభావాలు
శిలాజిత్తు కొన్ని ఖనిజాల్ని చాలా దండిగా కల్గి ఉంటుంది. కాబట్టి ముడి శిలాజిత్తును సేవించరాదు, ఎందుకంటే అలా తీసుకోవడం ప్రమాదం. ఇంకా, ముడి శిలాజిత్తు బూజు (fungi or aspergillus) పట్టి కలుషితమై ఉంటుంది. గనుక దీన్ని అలాగే సేవించకూడదు. శిలాజిత్తును కొనేటప్పుడు శుద్ధి చేసిన శిలాజిత్తునే కొనాలి.
వైద్యుల ప్రకారం, తలసీమియా (రక్తంలో హెమోగ్లోబిన్ తగ్గిపోవడం) వ్యాధితో బాధపడే రోగులు శిలాజిత్తును సేవించకూడదు. ఎందుకంటే శిలాజిత్తులో ఇనుము ఎక్కువగా ఉంటుంది.
మీరు ఇప్పటికే మీ వైద్యుడు సూచించిన ఇతర ఔషధాల్ని సేవిస్తూ ఉన్నట్లైనచో, వాటితోపాటు శిలాజిత్తును కూడా సేవించాలని మీకనిపిస్తే ముందు మీ ఆయుర్వేద డాక్టర్‌తో మాట్లాడడం చాలా మంచిది.
గర్భవతులకు శిలాజిత్తు సేవనం వల్ల గర్భస్రావం అవుతుందేమోనన్న భయాందోళన గనుక ఉంటే, అలాంటి గర్భిణీ స్త్రీలు శిలాజిత్తును తీసుకునే ముందు తమ వైద్యుడిని సంప్రదించి తీసుకోవడం చాలా సురక్షితం.
ఆయుర్వేదం వైద్యులు చెప్పిన ప్రకారం, మీరు రక్తగతవాతం/కీళ్ళవాతము (gout) వ్యాధివల్ల బాధపడుతుంటే మీరు శిలాజిత్తును సేవించరాదు. ఎందుకంటే, శరీరంలోని “యూరిక్ యాసిడ్” స్థాయిలను శిలాజిత్తు పెంచే ప్రమాదముంది కాబట్టి దీన్ని తీసుకోరాదు.
Post a Comment