జల్దారుపండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

జల్దారుపండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు జల్దారుపండును (అప్రికోట్) ఆసియాలో ఓ కమ్మని వేసవి పండుగా చెప్పవచ్చును .  ఇది చైనాలో ఉద్భవించిందని నమ్ముతారు. చిన్నగా ఉండి, తియ్యని రుచి కల్గిన ఈ పండు పీచుపదార్థాలు, విటమిన్లు మరియు ఖనిజాలకు ఒక అద్భుతమైన సమృద్ధ మూలం. అదనంగా, ఈ పండుకు బంగారు నారింజ రంగునివ్వడానికి కారణమైన బీటా-కెరోటిన్ యొక్క మంచి మూలం. వాస్తవానికి, మొదటిసారి జల్దారు పండు ఐరోపాకు చేరుకున్నప్పుడు గ్రీకు దేశస్థులు ఆ పండ్లను "సూర్యుని యొక్క బంగారు గుడ్లు" అని కూడా  వర్ణించారు.  

జల్దారుపండు సుమారుగా 4 నుండి 5 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.  35 గ్రాముల బరువు ఉంటుంది. జల్దారు పండ్లను కాచే చెట్లు పర్వత ప్రాంతపు వాలు నేలల్లో బాగా పెరుగుతాయి. సమశీతోష్ణ ప్రాంతాలు, ప్రత్యేకించి మధ్యధరా ప్రాంతాలు దాని సాగుకు అనువుగా ఉంటాయి. అప్రికాట్ యొక్క అతిపెద్ద ఉత్పాదక దేశం టర్కీ. ప్రపంచంలోని మొత్తం ఆప్రికాట్ల ఉత్పత్తిలో 27% వాటాను ఒక్క టర్కీనే పండిస్తుంది. భారతదేశంలో, జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలలో ప్రధానంగా ఈ  జల్దారు పండ్లను బాగా  సాగు చేస్తారు.

జల్దారు పండు  ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎండిన ఆప్రికాట్లు ఇనుము యొక్క గొప్ప మూలం. కాబట్టి, మీరు గనుక రక్తహీనతని కలిగి ఉంటే, ఎండిన ఆప్రికాట్లను తినడంవల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈజిప్షియన్లు ‘అమర్-అల్-దిన్’ అని పిలవబడే ఒక ప్రత్యేక పానీయం తయారు చేసేందుకు ఎండిన ఆప్రికాట్లను కూడా  ఉపయోగీస్తారు. జల్దారు పండు  నూనె చర్మం మరియు జుట్టుకు చాలా ఉపయోగకరంగా కూడా  ఉంటుంది.

జల్దారుపండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

జల్దారు పండు గురించిన కొన్ని వాస్తవాలు:


వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: పృనస్ అర్మేనియాక (Prunus armeniaca)
కుటుంబం: రోసేసియా
సాధారణ పేరు: ఇంగ్లీష్లో ‘అప్రికోట్’ , హిందీలో ‘ఖుబని’
సంస్కృత నామం: అంధిగ్రహ
ఉపయోగించే భాగాలు: పండు, గింజలు
స్థానిక మరియు భౌగోళిక విస్తీర్ణం: ఆప్రికాట్ యొక్క మూలం స్పష్టంగా తెలియరాలేదు. ఈ పండు యొక్క అసలు సాగుదార్లు చైనీయులేనని ఓ నమ్మకం. అయినప్పటికీ ఆర్మేనియా దేశం ఆప్రికాట్లను మొదటగా పండించిందని మరికొందరు నమ్ముతున్నారు. సమశీతోష్ణ (టెంపరేట్), ప్రాంతాలు, ప్రత్యేకించి మధ్యధరా ప్రాంతాలు, జల్దారు పండు  సాగుకు బాగా సరిపోతాయి. టర్కీ, ఇటలీ, రష్యా, స్పెయిన్, గ్రీస్, మరియు  USA ఫ్రాన్సులలో కూడా జల్దారు పండ్లను  బాగా సాగు చేస్తారు. 
 • జల్దారు పండు పోషక వాస్తవాలు 
 • జల్దారు పండు ఆరోగ్య ప్రయోజనాలు 
 • జల్దారు పండు ఉపయోగాలు
 • జల్దారు పండు దుష్ప్రభావాలు 
 • ఉపసంహారం 


జల్దారు పండు పోషక వాస్తవాలు 

చాలా తక్కువ దుష్ప్రభావాలు, విటమిన్లు మరియు ఖనిజాల్ని దండిగా కల్గిన పండు జల్దారు పండు లేక అప్రికాట్ పండు. పాలీఫెనోల్స్, కరోటినాయిడ్స్, మరియు ఆస్కార్బిక్ యాసిడ్లు అప్రికాట్లలో ఎక్కువ గా ఉంటాయి. ఇవి విటమిన్ ఎ , విటమిన్ సి , ఫోలేట్ యొక్క మంచి మూలం మరియు పొటాషియం- కాల్షియంలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆప్రికాట్లు పీచుపదార్థాలను కూడా పుష్కలంగా కల్గి ఉంటాయి.

యు.యస్.డి.ఏ (USDA) నేషనల్ న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రా అఫ్ప్రికోట్ పండులో క్రింది విలువలను కలిగి ఉంటుంది:

పోషకపదార్థాలు:100 గ్రాములకు

నీరు:86.35 గ్రా
శక్తి:48 కిలో కేలరీలు
ప్రోటీన్:1.40 గ్రా
మొత్తం లిపిడ్:0.39 గ్రా
యాష్:0.75 గ్రా
కార్బోహైడ్రేట్:11.12 గ్రా
ఫైబర్:2.0 గ్రా
చక్కెరలు:9.24 గ్రా
ఫ్రక్టోజ్:0.94 గ్రా

మినరల్స్:100గ్రాములకు

కాల్షియం:13 mg
ఐరన్:0.39 mg
మెగ్నీషియం:10 mg
ఫాస్ఫరస్ :23 mg
పొటాషియం:259 mg
సోడియం:1 mg
జింక్:0.20 mg
రాగి:0.078 mg
మాంగనీస్:0.077 mg
సెలీనియం:0.1 μg


విటమిన్లు:100 గ్రాములకు 

విటమిన్ ఎ:96 μg
విటమిన్ బి1:0.030 mg
విటమిన్ బి2:0.040 mg
విటమిన్ బి6:0.054 mg
విటమిన్ సి:10 mg
విటమిన్ ఇ:0.89 mg
విటమిన్ K:3.3 μg


కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు:100 గ్రాములకు

సాచ్యురేటెడ్:0.027 గ్రా
మోనోఅన్శాచ్యురేటెడ్:0.170 గ్రా
పాలీఅన్శాచ్యురేటెడ్ :0.077 గ్రా


జల్దారు పండు ఆరోగ్య ప్రయోజనాలు

 • జల్దారు పండుకి  గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  అది రక్త గ్లూకోస్ స్థాయిలను ఎక్కువగా పెంచదు. కాబట్టి  మధుమేహం ఉన్నవారికి  ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాక ఆప్రికాట్లు మధుమేహం ఉన్నవారిలో ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించవని కూడా ఒక అధ్యనం పేర్కొంది.

 • ఆప్రికాట్లలో (జల్దారు పండు) కేటకిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి.  వాటికీ యాంటీ ఇన్ఫలమేటరి  లక్షణాలు కూడా ఉంటాయి. జంతు ఆధారిత అధ్యయనాలు జల్దారు ఇన్ఫలమేటరి బౌల్ వ్యాధి లక్షణాలను తగ్గించాయని కూడా సూచించాయి. 
 • బీటా-కెరోటిన్ ఆప్రికాట్లలో అధికంగా ఉంటుంది.  ఇది కంటి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాక ఈ పళ్ళు వయసు సంబంధిత కంటి సమస్యలు తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి.
 • జల్దారుపళ్ళు క్రమముగా తీసుకుంటే అవి ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారిస్తాయని ఇన్ వివో అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాక్షిక హెపాటెక్టమీ తర్వాత ఎండు జల్దారుపళ్ళు కాలేయ పునరుత్పత్తికి సహాయ పడతాయని ఒక జంతు ఆధారిత ఆధ్యయనం సూచించింది. 
 • జల్దారుపళ్ళలో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తపోటును బాగా  నిర్వహిస్తుంది, తద్వారా అధిక రక్తపోటును లక్షణాలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాక వీటిలో పొటాషియం కూడా ఉంటుంది.  అది కూడా రక్తపోటు స్థాయిలను  బాగా నిర్వహిస్తుంది. 
 • మలబద్దకం ప్రతి తరం వారిలో సాధారణంగా మారుతుంది, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు  మలబద్దకాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి జల్దారుపళ్ళు కూడా మలబద్దకాన్ని తగ్గిస్తాయి. 
 • కడుపులో పుండ్లను కలిగించే హెలికోబాక్టర్.పైలోరి అనే బాక్టీరియా గ్యాస్ట్రైటిస్ కు ఒక ప్రధాన కారణం. జల్దారుపళ్ళు ఈ బాక్టీరియాను నివారిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తద్వారా అవి దీర్ఘకాలిక గ్యాస్ట్రైటిస్ లక్షణాలను తగ్గిస్తాయి.  

చక్కెరవ్యాధికి జల్దారు పండ్లు
వాపుకు జల్దారు పండ్లు
కళ్ళకు జల్దారు పండ్లు
జల్దారు పండ్లు కాలేయ హానిని నిరోధిస్తాయి
అధిక రక్తపోటుకు జల్దారు పండ్లు
గుండె ఆరోగ్యానికి జల్దారు పండ్లు
మలబద్ధకం కోసం జల్దారు పండు
కడుపులో పుండ్లకు జల్దారు పండ్లు
క్యాన్సర్ కోసం జల్దారు పండ్లు

చక్కెరవ్యాధికి జల్దారు పండ్లు 

గ్లైసెమిక్ సూచిక (గ్లైసెమిక్ ఇండెక్స్-జిఐ) లో జల్దారు పండ్ల స్థాయి తక్కువగా ఉంటుంది.  అనగా ఈ పండ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా పెంచవు. తక్కువ GI ఆహారాలు ముఖ్యంగా చక్కెరవ్యాధితో (డయాబెటిక్) ఉన్నవాళ్లకు బాగా సిఫార్సు చేస్తారు.  ఎందుకంటే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండాలి కాబట్టి. జల్దారుపండు యొక్క ఓ మోస్తరు సేవనంవల్ల గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరగదు. అంటియోసియాన్ మరియు కెరోటినాయిడ్స్ వంటి హైపోగ్లైసెమిక్ కాంపౌండ్లతో పాటు, జల్దారుపండ్ల యొక్క అనామ్లజనక (యాంటీ-ఆక్సిడెంట్) లక్షణాలు చక్కెరవ్యాధి  (మధుమేహం) ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. చక్కెరవ్యాధి (మధుమేహం) కలిగినవారు జల్దారు పండు సేవనంవల్ల ఎటువంటి స్పష్టమైన దుష్ప్రభావాలు లేవని స్పష్టీకరించబడింది.


వాపుకు జల్దారు పండ్లు 

జల్దారు పండ్లలో ‘కేటకిన్స్’ అని పిలువబడే ఓ ముఖ్యమైన సమ్మేళనం ఉంటుంది, ఇవి వాపు - మంటల్ని తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) లక్షణాలను కలిగి ఉంటాయి. ఒకే ఒక్క జల్దారు పండు ఓ మంచి మొత్తంలో కెటేచిన్లను బాగా అందిస్తుంది. జంతువులపై జరిపిన అధ్యయన ప్రయోగాల ప్రకారం, నికి కారణమయ్యే పేగుమంట వ్యాధి (ఇన్ప్లామేటరీ ప్రేగు వ్యాధి-IBS) యొక్క లక్షణాలను తగ్గించడంలో జల్దారు పండ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి . అయినప్పటికీ, కేట్చిన్ యొక్క ఆరోగ్య లాభాల గురించిన పరిశోధన చాలామటుకు  జంతువులపై జరిపిన ప్రయోగాల్లోనే జరుగుతోంది మరియు మానవులపై జల్దారుపండ్ల (ఆప్రికాట్) యొక్క మంట - వాపు నివారణా (యాంటీ ఇన్ఫ్లమేటరీ) సంభావ్యతను నిర్ధారించడానికి వైద్య అధ్యయనాలు ఇంకా జరగాల్సిన అవసరం ఉంది.


కళ్ళకు జల్దారు పండ్లు 

కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండే β-కెరోటిన్లు జల్దారుపండ్లలో పుష్కలంగా ఉంటాయి. వయసు-సంబంధిత కంటి వ్యాధులను నివారించడంలో బీటా-కెరోటిన్ పాత్రను అర్థం చేసుకోవడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఒక వైద్య అధ్యయనం ప్రకారం, β- కరోటిన్లను పుష్కలంగా కల్గిన జల్దారుపండ్లు మరియు ఇతర పండ్లు మరియు కూరగాయలు వయసు-సంబంధిత కళ్ళ (మాకులర్) వ్యాధుల (AMD) ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. జంతువుల నమూనాలపై చేసిన మరొక అధ్యయనం జల్దారుపండు గుజ్జును (ఆప్రికాట్ కెర్నెల్) కళ్లపై మసాజ్ చేయడంవల్ల పొడి కంటి వ్యాధుల (dry eye diseases) ను నివారించగలదని పేర్కొంది.

వయసు-సంబంధిత కంటి సమస్యలు బాగా పెరుగుతున్నాయి మరియు కంటికి  ప్రయోజనకరంగా ఉండే పోషకాలలో అధికంగా ఉన్న ఆహారాలను తినడం వలన వయసుకు సంబంధించిన కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నమ్ముతారు.


జల్దారు పండ్లు కాలేయ హానిని నిరోధిస్తాయి 

మానవ శరీరంలోని అతిపెద్ద అంతర్గత అవయవం మరియు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి కాలేయం. శరీరంలోని ఇతర భాగాలకు రక్తం సరఫరా అయ్యే ముందు జీర్ణవ్యవస్థ నుండి వచ్చే రక్తాన్ని శుద్ధి చేయడం దీని ప్రధాన పాత్ర. ఇది కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్ల జీవక్రియకు కూడా బాధ్యత వహిస్తుంది. పరిశోధనల ప్రకారం     జల్దారుపండు ఒక అద్భుతమైన కాలేయాన్ని కాపాడే ఆహారపదార్థం (హెపాటోప్రొటెక్టివ్).

వివో అధ్యయనాల్లో తేలిన విషయమేమంటే జల్దారు పండు యొక్క సాధారణ సేవనం ఫ్యాటీ లివర్ వ్యాధిని కూడా నిరోధిస్తుంది, ఈ వ్యాధిలో కాలేయంలో అవాంఛిత కొవ్వులు పేరుకుపోయి రోగి బాధపడతారు.

కాలేయం అనేది పునరుత్పత్తి చేయడానికి ప్రత్యేకమైన సామర్ధ్యం కలిగిన శరీర అవయవాలలో ఒకటి. పాక్షిక కాలేయ తొలగింపు (పార్షియల్ హెపాటెక్టోమీ) తర్వాత కాలేయ పునరుత్పత్తిలో జల్దారుపండ్లు ఎలా సహాయపడతాయో అంచనా వేయడానికి జంతు నమూనాలపై ఒక అధ్యయనం నిర్వహించబడింది. పాక్షిక హెపాటెక్టోమి చికిత్సలో వ్యాధి యొక్క వ్యాప్తిని శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా తగ్గించటానికి కాలేయము నుండి క్యాన్సర్ కణాల తొలగింపు ఉంటుంది. పైన పేర్కొన్న అధ్యయనంలో కేవలం 21 రోజులు మాత్రమే జల్దారుపండ్లను ఉపయోగించిన తర్వాత కాలేయం పునరుత్పత్తిలో సానుకూల ఫలితాలను బాగా చూపించాయి.


అధిక రక్తపోటుకు జల్దారు పండ్లు 

అధిక రక్తపోటు అనేది వయోజనుల్లో రక్తపీడనం సాధారణ స్థాయి-20 / 80 mmHg కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఇది ప్రధానంగా ఒత్తిడివల్ల, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు మరియు ఇతర జీవనశైలి కారకాల కారణంగా సంభవిస్తుంది. అధిక రక్తపోటు స్ట్రోక్, గుండె వైఫల్యం, చిత్తవైకల్యం మొదలైన కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది, అధిక రక్తపోటు కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చును . పరిశోధన ప్రకారం, జల్దారుపండ్లలోని పీచుపదార్థాలు (ఫైబర్ కంటెంట్) రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా రక్తపోటును నివారించవచ్చు. అదనంగా, జల్దారు పండ్ల (apricots) లో పొటాషియం మరియు సోడియం తక్కువగా ఉంటాయి, ఇది రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటుందని నివేదించబడింది.


గుండె ఆరోగ్యానికి జల్దారు పండ్లు

పని-జీవితం అసమతుల్యత, ఒత్తిడి, ఉద్రిక్తత, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం మొదలైనవి గుండె సమస్యలకు ప్రధాన కారణాలు. మయోకార్డియల్ ఇస్కీమియా-రెఫెర్ఫ్యూషన్ (MI) మీద జల్దారుపండు సేవనం యొక్క సానుకూల ప్రభావాన్ని పరిశోధించడానికి జంతు నమూనాలపై ఒక అధ్యయనం జరిగింది. ఆక్సిజన్ కోల్పోయిన రక్తం కణజాలంలోకి తిరిగి (return) వచ్చినపుడు MI ఏర్పడుతుంది. MI చేత హృదయ నష్టం తగ్గించడంలో జల్దారు పండులో ఉన్న అనామ్లజనకాలు పాత్రను పోషిస్తాయని ఈ అధ్యయనం సూచిస్తుంది. మరొక అధ్యయనంలో పాలీఫెనోల్స్, కరోటినాయిడ్స్ మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్లు వంటి వివిధ గుండెను రక్షించే పదార్థాలు లేక కార్డియో-ప్రొటెక్టివ్ కాంపౌండ్లు జల్దారుపండులో  పుష్కలంగా ఉంటాయి. జల్దారుపండు యొక్క ఈ గుణాలన్నీ కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి గుండె వ్యాధులపై ప్రభావవంతంగా కూడా పని చేస్తాయి.


మలబద్ధకం కోసం జల్దారు పండు

ప్రతి తరానికి మలబద్ధకం అనేది చాలా సాధారణ సమస్య. చికిత్స చేయకపోతే, ఇది పొట్టలో క్యాన్సర్ (కొలొరెక్టల్ క్యాన్సర్)కు దారితీయవచ్చు. పరిశోధన ప్రకారం పీచుపదార్థాలు (ఫైబర్) అధికంగా ఉండే ఆహారాలు మలబద్ధకం నిరోధించడంలో బాగా సహాయపడతాయి. అలాంటి పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారసేవనంవల్ల పేగుల్లోని ఆహారానికి గాత్రాన్ని అందించి, తద్వారా ప్రేగు కదలికలను కూడా ప్రోత్సహిస్తాయి. అదనంగా, కరిగే పీచుపదార్థాలు ప్రేగులలో మంచి బ్యాక్టీరియాని నిర్వహించడంలో కూడా  సహాయపడతాయి. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కడుపులో పుండ్లకు జల్దారు పండ్లు 

‘గ్యాస్ట్రైటిస్’ అనబడే రుగ్మత కడుపు లోపలి పొట్ట గోడల్లో కలిగే మంటను లేదా పుండ్లను  సూచిస్తుంది. పొట్టలో పుండ్లకు అనేక కారణాలున్నాయి. కొన్ని సాధారణ కారణాలేవంటే మద్యం దుర్వినియోగం, ఒత్తిడి మరియు కడుపుగోడల్ని దెబ్బతీసే మందుల యొక్క సాధారణ వాడకం. ‘హెలికోబాక్టర్ పైలోరీ’ (Helicobacter pylori) అనబడే పొట్టలో పుండును కలిగించే బ్యాక్టీరియా కూడా పొట్టలో సంభవించే పుండ్ల యొక్క కారణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం, జల్దారుపండ్లు దీర్ఘకాలికంగా బాధిస్తున్న పొట్టలోని పుండ్లను నివారించగలవు. ప్రతి రోజు కేవలం మూడు జల్దారు పండ్లు తింటే హెలికోబ్యాక్టర్ పైరోలి కల్గించే కడుపు మంట లేక కడుపులో పుండ్లను తగ్గించవచ్చు లేక నిరోధించవచ్చును . గతంలో చేపట్టిన అధ్యయనం ప్రకారం, హెలికోబాక్టర్ పైలోరీ యొక్క చలనశీలతను జల్దారుపండ్లు తగ్గించవచ్చని చెప్పబడింది, తద్వారా, ఆ సూక్ష్మజీవి  కడుపులో అంటురోగాన్ని కల్గించకుండా నిరోధిస్తుంది.


క్యాన్సర్ కోసం జల్దారు పండ్లు 

ప్రపంచవ్యాప్త మరణాల యొక్క ప్రధాన కారణాల్లో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి యొక్క ఖచ్చితమైన కారణం తెలియకపోయినా, స్వేచ్ఛా రాశులు శరీరంలో జమవడాన్ని క్యాన్సర్ రావడడానికి కారణంగా చెప్పబడుతోంది. జల్దారు పండు క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా తగ్గించవచ్చని పరిశోధన చెబుతోంది, ఎందుకంటే ఇది యాంటీఆక్సిడెంట్లతో నింపబడిన ఈ పండు స్వేచ్ఛా రాశులుల్ని సమర్థవంతంగా తటస్థీకరిస్తుంది. జల్దారుపండు గుజ్జు లేక కొబ్బరిలో ఉండే అమిగ్డాలిన్ అనబడే మొక్క-సంబంధ పదార్థాన్ని క్యాన్సర్ వ్యతిరేక ఏజెంట్గా భావిస్తారు. జల్దారుపండు శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ధిని  బాగా తగ్గిస్తుంది, ఎలాగంటే క్యాన్సర్ కణాలలోనే ఉండే కణాల సహజమరణానికి దోహదపడే అపోప్టోసిస్ ను ప్రేరేపించి క్యాన్సర్ కణాల్ని నిర్మూలిస్తుంది. అందువల్ల, జల్దారుపడు క్యాన్సర్ చికిత్సలో ప్రభావ  సంభావ్యతను కలిగి ఉండవచ్చు .

వివిధ రకాల కేరోటినాయిడ్లను కూడా జల్దారుపండ్లు కలిగి ఉంటాయి. ఈ పండు  ముఖ్యమైన ప్రతిక్షకారిణి చర్యలను ప్రదర్శిస్తుంది. 37 రకాల జల్దారుపండ్లపై చేసిన అధ్యయనం ఈ పండ్లు విస్తారమైన కెరోటినాయిడ్లను కల్గి ఉన్నాయని తేలింది. కరోటెనాయిడ్లను అధికంగా కల్గిఉన్న ఆహారాలు తీసుకోవడంవల్ల వివిధ రకాలైన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.


జల్దారు పండు ఉపయోగాలు 

జల్దారు (అప్రికాట్) పండ్లను ముడిగాను లేదా వాటిని వంట వండుకుని కూడా తినొచ్చును . తాజా జల్దారు పండ్లను తినడం ఉత్తమం, అయితే ఎండలో ఎండబెట్టి కూడా వీటిని తినవచ్చును . ఎండిన పండ్ల (డ్రై -ఫ్రూట్స్)లో ఎండిన జల్దారుపండ్లు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఈ జల్దారు పండ్లతో జామ్, జెల్లీలు, రసాలను తయారుచేస్తారు.  పానీయాలకు రుచి-సువాసనల్ని కల్పించేందుకు, ముఖ్యంగా మద్యసంబంధ పానీయాలకు, జల్దారు పండ్లను బాగా వాడతారు. జల్దారు అప్పడాలు కూడా ఈ పండ్లను ఉపయోగించి కూడా తయారు చేస్తారు.


జల్దారు పండు దుష్ప్రభావాలు 

జల్దారు పండ్లు లో ఉన్న అమైగ్డలిన్ అనబడే ఒక మొక్క పదార్ధం మానవులలో సైనైడ్ పోయిజనింగ్ దారి తీయవచ్చును . ఇలా అమైగ్డలిన్, సైనైడ్ గా మారిన సంఘటనల రెండు  వైద్య కేసులు నివేదించబడ్డాయి. జ్వరం, తలనొప్పి మరియు తీవ్రమైన ఉదర తిమ్మిరి (కడుపునొప్పి) వంటి లక్షణాలు ఆ ఇద్దరిలోని ఒక రోగిలో గుర్తించబడ్డాయి.
జల్దారు పండు  వినియోగం కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యకు దారి తీయవచ్చును . ఆప్రికాట్లలో ప్రధాన అలెర్జీ కారకం లిపిడ్ బదిలీ ప్రోటీన్ (lipid transfer protein - LTP) అని ఒక అధ్యయనంలో గమనించబడింది.

ఉపసంహారం
జల్దారు (అప్రికోట్) పండులో అనేక పోషకాలు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఎండిన ఆప్రికాట్లులో కూడా  తాజా ఆప్రికాట్లులో ఉండే దాదాపు అన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఆప్రికాట్లను తినడంవల్ల చాలా తక్కువ దుష్ప్రభావాలుంటాయి. కాబట్టి ఆప్రికాట్లను మీ రోజువారీ ఆహారంలో ఓ మంచి రకం ఆహార రకంగా చేర్చుకోవచ్చు.

0/Post a Comment/Comments

Previous Post Next Post