కొబ్బరి వలన కలిగే ఉపయోగాలు
కొబ్బరి ఒక ముఖ్యమైన పాము కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera) . కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం కొబ్బరి. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో కూడా వినియోగిస్తారు. కొబ్బరి చెట్ల నుండి వివిధ రకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో కూడా ఉపయోగపడుతున్నాయి.
కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ మరియు ఇసుక ప్రాంతాలలోను ఎక్కువగా పెరుగుతాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి సుమారు 100 సంవత్సరాల పాటు జీవించి వుంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు నెలనెలా చిగురిస్తూ, పూత పూస్తూ కూడా ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని కల్పవృక్షం - స్వర్గానికి చెందిన చెట్టు అని కూడా అంటారు. ఇది మనకు కావలసిన ఆహారాన్నీ, పానీయాన్నీ, తలదాచుకునే చోటునీ, జీవితానికి కావలసిన ఇతర నిత్యావసర వస్తువులనూ కూడా ప్రసాదిస్తుంది. ఉష్ణ ప్రాంతంలో నివసించేవారికి ఇదొక శుభకరమైన చెట్టు. పూజలలో, పెళ్ళిళ్ళలో మరియు ఇతర ఉత్సవాల సమయంలో దీనిని వాడడం జరుగుతుంది.
కొబ్బరికాయలో నీరు, కండ కలిగి ఉంటాయి. నీరు, కండ, గట్టి తనంగల నారతో కప్పబడి ఉంటుంది. కొబ్బరి బోండాలోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. దీనికి అనేక ఔషధగుణాలు కూడా ఉన్నాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్‌గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా కూడా వాడతారు. ఈ నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని కూడా ఇస్తాయి. ఇది దప్పికను కూడా తీరుస్తుంది. ఇందులో గ్లూకోజ్‌తో పాటు పొటాషియం, మరియు సోడియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ఆ కారణంగా దీన్ని నెల శిశువు కూడా ఇవ్వవచ్చును . ఇది సులభంగా జీర్ణం అవుతుంది.
కొబ్బరి - ఆరోగ్యం
ఇందులో ఎలెక్ట్రోలిటిక్ ఉన్నందువల్ల తక్కువ మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు, జలోదరానికీ, మూత్ర విసర్జన ధారాలంగా జరిగేందుకూ మరియు డయేరియా కారణంగా శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడూ, దిగ్భ్రాంతి కలిగినప్పుడూ, లేత కొబ్బరికాయ నీళ్ళను కూడా వాడవచ్చును . అతిసారం, చీము రక్తం భేదులు, శూల వల్ల కలిగే పేగుల మంటను చల్లార్చడానికి దీనిని కూడా వాడవచ్చును. హైపర్ అసిడిటి ఉన్నప్పుడు కూడా దీన్ని వాడవచ్చును. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని కూడా ఆపుచేస్తుంది. కలరా వ్యాధికి ఇది మంచి విరుగుడు. కారణం అతిసారం భేదుల వల్ల, వాంతుల వల్ల శరీరంలో తగ్గిపోయిన పొటాషియాన్ని శరీరానికి సరఫరా చేయగలగడమే. మూత్ర విసర్జనను ఎక్కువ చేయగలగడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్ధాలను బయటకు గెంటడం వల్ల అంటురోగాల వల్ల కలిగే జ్వరాలకు ఇది వాడబడుతుంది. లేత కొబ్బరికాయ కొంత ముదిరినప్పుడు అందులో ఉన్న నీరు జెల్లీలాగా కూడా తయారవుతుంది. దీనిని "స్పూన్ కోకోనట్" అని కూడా అంటారు. రుచికరంగా ఉంటూ ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో నూనె, పిండిపదార్ధాలు, మాంసకృత్తుల వల పేగులలో కుళ్ళిపోవడం అన్నది జరగదు. ఆ కారణంగా ఇది మెరుగైన మాంసకృత్తులతో కూడిన ఆహారంగా కూడా భావించబడుతోంది. అంతేకాదు ఇది శరీరంలో ఎలాంటి విషంతో కూడిన వస్తువును కూడా చేరనివ్వదు. ఇందులో ఉన్న మెత్తటి కండను గాయాలకు కూడా రాయవచ్చును. ఈ కండకు గాయాలను మాపే ఔషధ గుణం ఉంది.
బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది భేదిమందుగా, క్రిమినాశనిగా కూడా వాడబడుతుంది. నూనె కడుపులో ఉన్న యాసిడ్ల విసర్జనను కూడా అణిచిపెడుతుంది. కాబట్టి అసిడిటికి ఇది మంచి మందు. పొడిదగ్గు, ఎదనొప్పి నుండి ఇది మనిషికి ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. కొబ్బరిని తురిమి కూరలకూ, చట్నీలకూ, తీపిపదార్ధాల తయారీకీ కూడా వాడతారు. బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకాళ్ళ నొప్పులు కూడా రావు. కొలెస్టెరాల్ ఎక్కువై బాధపడుతున్న వారు కొబ్బరి తినకూడదు.
ప్రాచీన కాలం లో విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి . నేటి ఆధునిక మేధావి వర్గం కొబ్బరి అనేక ఆరోగ్య సమస్యలకి సమాదానమంటావుంది . సాంకేతికముగా కొబ్బరిని ''కోకోస్ న్యుసిఫేరా (CocosNeucifera)'' అని కూడా అంటారు . నుసిఫెర అంటే పొత్తుతో కూడుకున్నదని అర్ధము (Nutbearing) ప్రపంచము లో మూడవ వంతు జనాబా వాళ్ల ఆహారములోను ,ఆర్ధిక సంపత్తులోను, ప్రతి పూజా-పవిత్ర కార్యక్రమములోను చాల భాగము కొబ్బరితోనే ముడిపడి ఉన్నది . కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మన దేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ ,కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే . వారి ఆరోగ్యమూ ,సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి . కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాదారం చేసుకుని వుంటున్నారు . కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ కూడా వుంటుంది . ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంట. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్ ,ఫంగల్ ,బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో కూడా సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని ,పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది . కొబ్బరిచెట్టు లో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది . అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అని కూడా అంటారు . మీకు తెలుసా ? కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని .అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే)ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ రెండు రోజు న జరుపుతారు .
కొబ్బరి నీరు :
ఏ ఋతువులో అయిన తాగదగినవి కొబ్బరి నీరు . లేత కొబ్బరి నీటి లో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు ,చెక్కెర పరమితం గాను ఉండును . కొబ్బరి బొండం నీటి లో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . శరీరములో నీటి లేమిని (Dehydration) కరక్ట్ చేస్తుంది .
వైద్య పరంగా :
- జీర్ణకోశ బాధల తో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు చాలా మంచి ఆహారము .
- విరోచనాలు అయినపుడు (diarrhoea)ఓరల్ రి-హైద్రాషన్ గా కూడా ఉపయోగపడుతుంది ,(Oral re-hydration).
- పొటాసియం గుండె జబ్బులకు ఇది మంచిది.
- వేసవి కాలములో శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది.
- వేసవిలో చెమట కాయలు , వేడి కురుపులు , అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరినీతిని లేపనం గా కూడా వాడవచ్చ్చును .
- కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి.
- ముత్రసంభందమైన జబ్బులలోను మరియు , కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందు గా పనిచేస్తుంది .
- మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని కూడా క్లియర్ చేస్తుంది.
కొబ్బరి పాలు :
- పచ్చికోబ్బరిలో పోషక విలువలు చాలా అధికము .
- కొబ్బరి నీళ్లు , పాలు మంత్ర జలం లా కూడా పనిచేస్తాయి.
- దీనిలో విటమిన్ ఎ,బి , సి, రైబోఫ్లెవిన్ , ఐరన్ మరియు కాలసియం , ఫాస్పరస్ , కార్బోహైడ్రేట్లు ,కొవ్వు ,ప్రోటీన్లు సమృద్ధి గా లభిస్తాయి.
- కొబ్బరి కాయ ముదిరిపోయక లోపల పువ్వు కూడా వస్తుంది.
- అది గర్భాశాయానికి చాలా మేలు చేస్తుంది .
- బాలింతలము అధిక రక్తస్రావము ఇబ్బందింది పెడుతుంటే కొబ్బరి పువ్వు జ్యూస్ ను తీసుకుంటే సత్వర ఉపశమనం కూడా దొరుకుతుంది .
- నిత్యం కొబ్బరి నీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు.
- శరీరానికి చల్లదనం లభిస్తుంది. గొంతు మంట , నొప్పిగా ఉన్నప్పుడు కొబ్బరిపాలు తాగితే తగ్గుతుంది .
కొబ్బరి నూనె :
కొబ్బరి నూనెలో యాబై శరము లారిక్ ఆసిడ్ ఉంటుంది ...దీన్ని వంటల్లో అధికము గా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమము గా జరుగుతుంది .
కొవ్వు శాతము కూడా పెరగదు ,
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది .
కొబ్బరి నూనే లో విటమిన్ 'ఇ ' అధికము... ఇది చర్మాన్ని కొమలముగా తాయారు చేస్తుంది.
రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్తకు చాలా మంచిది . . థైరాయిడ్ సమస్యలూ ఉండవు .
అందానికి : పొడి చర్మము ఉన్నవారు పచ్చికొబ్బరి తీసుకుంటే శరీరానికి సరిపడా తేమ కూడా అందుతుంది ,
కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకనాలు ,మరియు మురికి తొలగిపోతాయి . మేని ప్రకాశవంతము గా బాగా మెరుస్తుంది ... ఇది జుట్టుకు మేలు చేస్తుంది ... కొబ్బరి పాలు తలకు పట్టిస్తే .. . కేశాలు కాంతి వంతము గా తాయారు చేస్తుంది .
కొబ్బరినూనెతో కళ
సహజ సిద్ధమైన కొబ్బరినూనె చర్మానికీ మరియు జుట్టుకీ ఎంతో మేలు చేస్తుంది. అది మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. మేకప్ రిమూవర్‌గానూ ఉపయోగించుకోవచ్చును . రోజూ శరీరానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలూ మరియు గీతలూ కొంతకాలానికి తగ్గుముఖం పడతాయి. స్నానానికి ముందు శరీరానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే మంచిది. ఒంట్లోని తేమ బయటికి పోకుండా ఉంటుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెని తలకి మసాజ్ చేసుకుంటే జుట్టు మృదువుగా, కాంతిమంతంగా కూడా తయారవుతుంది. జుట్టు నుంచి ప్రోటీన్లు బయటికి పోవడం చాలా తగ్గుతుంది. ఇది జుట్టుకి మంచి కండిషనర్‌గా బాగా పనిచేస్తుంది. కాలిన గాయాలూ, ఎండ వేడికి కమిలిన చర్మంపై కొబ్బరినూనె రాస్తే త్వరగా తగ్గుతాయి. కనురెప్పలకి రాసే మస్కారా, కాటుక వంటి మేకప్ కొబ్బరినూనెలో ముంచిన దూదితో తుడిస్తే సులువుగా కూడా పోతాయి.
విద్యుత్ లైటింగ్ ఆవిష్కరించడానికి ముందు, కొబ్బరి నూనె ప్రధాన చమురు. భారతదేశంలో ప్రకాశం కోసం కూడా ఉపయోగిస్తారు. నూనె కొచ్చిన్ ఎగుమతి అయింది.
కొబ్బరి నూనె, సబ్బు తయారీలో ముఖ్యమైన ముడి పదార్ధం. కొబ్బరి నూనెతో చేసిన సబ్బు ఇతర నూనెలతో చేసిన సబ్బు కంటే ఎక్కువ నీరు నిలుపుకుంటుంది. అందువలన తయారీదారు దిగుబడి కూడా పెరుగుతుంది. అయితే, కష్టం ఉంటుంది. ఇది కఠిన జలం (క్షార జలం) లో మరింత సులభంగా నురుగు ఇస్తూ ఇతర సబ్బుల కంటే ఉప్పు నీటిలో మరింత కరుగుతుంది.
ఆహారపదార్ధం
కొబ్బరి కాయలోని తెల్లని గుజురు మంచి ఆహారం. దీని కోరు నుండి కొబ్బరి పాలు కూడా తీస్తారు. దీనిలో 17 శాతం కొవ్వు పదార్ధాలు ఉంటాయి. పాలు తీయగా మిగిలిన దానిని పశువుల దాణాగా కూడా వాడతారు.- లేత కొబ్బరి బొండం పానీయం.
- కొబ్బరి నీరు మంచి పానీయం. ముదురు కొబ్బరిలో కంటే లేత కొబ్బరి బొండంలో ఎక్కువగా నీరు ఉంటాయి. దీనిలోని లవణాలు వేసవికాలంగా చల్లగా దాహం కూడా తీరుస్తాయి.
- కొబ్బరి పుష్పవిన్యాసాల చివరి భాగాన్ని కాబేజీ లాగా వంటలలో కూడా ఉపయోగిస్తారు. వీటి మూలం నుండి కల్లు కూడా తీస్తారు.
- ఇతరమైనవి
- కొబ్బరి పీచుతో తాళ్ళు, చాపలు మరియు పరుపులు తయారుచేస్తారు. ఇది వంటచెరకుగా కూడా ఉపయోగిస్తారు.
- కొబ్బరి కురిడి నుండి కొబ్బరి నూనె కూడా తయారుచేస్తారు.
- కొబ్బరి ఆకులు చాపలు, బుట్టలు అల్లడానికి మరియు పందిరి, ఇంటిపైకప్పులపైన వేస్తారు. కొబ్బరి ఈనెలను కట్టలు కట్టి చీపురుగా కూడా ఉపయోగిస్తారు.
- కొబ్బరి చెట్టు కాండం కలపగా ఇల్లు కట్టుకోవడంలో దూలాలు, స్తంభాలు క్రింద వాడతారు. ఇవి వంతెనలుగా పిల్ల కాలువల మీద ఉపయోగించవచ్చును.
వ్యక్తిగత ఉపయోగాలు
కొబ్బరి నూనె పొడి చర్మంతో సహాయం, ఒక చర్మం మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగిస్తారు. జుట్టు వాడినప్పుడు ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడానికి ఒక అధ్యయనంలో చూపబడింది.విద్యుత్ లైటింగ్ ఆవిష్కరించడానికి ముందు, కొబ్బరి నూనె ప్రధాన చమురు. భారతదేశంలో ప్రకాశం కోసం కూడా ఉపయోగిస్తారు. నూనె కొచ్చిన్ ఎగుమతి అయింది.
కొబ్బరి నూనె, సబ్బు తయారీలో ముఖ్యమైన ముడి పదార్ధం. కొబ్బరి నూనెతో చేసిన సబ్బు ఇతర నూనెలతో చేసిన సబ్బు కంటే ఎక్కువ నీరు నిలుపుకుంటుంది. అందువలన తయారీదారు దిగుబడి కూడా పెరుగుతుంది. అయితే, కష్టం ఉంటుంది. ఇది కఠిన జలం (క్షార జలం) లో మరింత సులభంగా నురుగు ఇస్తూ ఇతర సబ్బుల కంటే ఉప్పు నీటిలో మరింత కరుగుతుంది.
Post a Comment