పండ్లను పోలిన పండ్లు

పండ్లను పోలిన పండ్లుఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చును  ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


విభిన్న జాతులకు చెందిన పండ్లు రూపంలో ఒకేలా ఉండటం విశేషం .  రూపం అదే... రుచే వేరు. మామిడిపండులానే ఉంటుంది. కానీ మామిడి కాదు. కొబ్బరిబోండాన్నే తలపించినా మరుగుజ్జు రూపం. సీతాఫలంలా కనువిందు చేసినా ఆ రుచి దానికెక్కడ? ఆయా పండ్ల రూపురేఖల్ని పుణికి పుచ్చుకున్న ఈ డూప్లికేట్‌ పండ్ల కథేంటో చూద్దాం! పండుని పోలిన పండ్లూ ఉన్నాయి. 

మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆయా పండ్ల జాతులు వేరు కావడమే ఇందుకు కారణం.

కాక్విటో నట్స్‌-బుల్లి కొబ్బరి.

 • ఓ రకం పామ్‌ చెట్టుకి కాసే ఈ కాయల్నే కాక్విటో నట్స్‌  అని కూడా అంటారు. వీటినే మరుగుజ్జు కొబ్బరికాయలనీ మంకీస్‌ కోకోనట్స్‌ అనీ పిలుస్తారు. చిలీ వీటి స్వస్థలం. 
 • ఈ చెట్ల నుంచి కారే పాలలాంటి ద్రవాన్ని తేనె, వైన్‌ తయారీలో కూడా వాడతారు. 
 • అందంకోసం ఎక్కువగా పెంచే ఈ చెట్ల కాయలు అచ్చం మినీ కొబ్బరికాయల్నే తలపిస్తాయి. రుచి కూడా దాదాపు కొబ్బరిదే. 
 • వీటిని పచ్చిగా గానీ ఉడికించి కానీ తింటుంటారు. 
 • కొబ్బరి మాదిరిగానే దీని గుజ్జుని కూడా అన్నిరకాల వంటల్లోనూకూడా  వాడతారు.


ప్లమ్‌ మ్యాంగో-చిన్ని మామిడి పండ్లు

 • మాప్రాంగ్‌, ప్లమ్‌ మ్యాంగో అని పిలిచే ఈ పండ్లు చూడ్డానికి చిన్నసైజు మామిడిలానే ఉంటాయి. ఆకులు కూడా అలాగే కనిపిస్తాయి. 
 • తీపీ పులుపూ కలగలిసిన ఒకలాంటి రుచితో ఉంటాయి. 
 • కాస్తో కూస్తో మామిడినే తలపించే ఈ చెట్లు ఎక్కువగా ఇండొనేషియా మరియు మలేషియాల్లో బాగా పెరుగుతాయి.


పెర్సిమన్‌ పండ్లు -తియ్యని టొమాటో.

 • చూడ్డానికి అచ్చం టొమాటో పండ్లలా కనిపించినా ఈ పెర్సిమన్‌ పండ్ల రుచి మాత్రం సూపర్‌. వీటిల్లో గ్లూకోజ్‌ శాతం చాలా ఎక్కువ. 
 • ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ పండుని నేచురల్‌ స్వీట్‌ అని కూడా  పిలుస్తారు.
 • విటమిన్‌-సి, కాల్షియం, ఐరన్‌, పొటాషియంలతో పాటు మరెన్నో విటమిన్లూ ఖనిజాలూ సమృద్ధిగా ఉండే ఈ పండులో ప్రాంతాన్ని బట్టి చాలా రకాలే ఉన్నాయి.


మౌస్‌ మెలన్-పుచ్చదోస.

 • దీన్ని మెక్సికన్‌ సోర్‌ జెర్కిన్‌ లేదా మౌస్‌ మెలన్‌, సందీతా(స్పానిష్‌లో బుల్లి పుచ్చకాయ అని అర్థం) అనీ కూడా పిలుస్తారు. 
 • ఒకటిన్నర అంగుళాలు మాత్రమే ఉండి చూడ్డానికి మినీ పుచ్చకాయల్ని తలపించే ఈ కాయలు కొరికితింటే మాత్రం అచ్చం కీరా దోసలా కాస్త పులుపుతో కూడిన వగరుతో ఉంటాయి. 
 • బరువు తగ్గాలనుకునేవాళ్లు వీటిని ఎక్కువగా తింటారు. 
 • తీగకు కాసే ఈ కాయల్ని సలాడ్లలో కూడా వాడతారు. వీటితో పెట్టిన నిల్వపచ్చడి చాలా రుచిగా ఉంటుందట.


మాతా కుచింగ్‌-రుచిలో ద్రాక్ష... రూపంలో సీతాఫలం.

 • లేత పసుపురంగులో ఉండే చిన్న సైజు సీతాఫలంలా కనిపిస్తుంది. 
 • కానీ అస్సలు కాదు. 
 • మాతా కుచింగ్‌గా పిలిచే ఈ పండు వాసన డ్రాగన్‌ ఐ ఫ్రూట్‌ని తలపిస్తే, రుచి మాత్రం ద్రాక్షపండుని పోలి ఉంటుంది. 
 • తెరిచి చూస్తే ఒకే ఒక కన్ను ఉంటుంది. 
 • అందుకేనేమో దీన్ని క్యాట్స్‌ ఐ ఫ్రూట్‌ అంటారు. 
 • మాతా కుచింగ్‌ అంటే పిల్లి కన్ను అని అర్థమట.


మలక్కా ఆపిల్-జీడిలేని జీడిపండు.

 • మలక్కా ఆపిల్‌, వాటర్‌ ఆపిల్‌, రోజ్‌ ఆపిల్‌, లిలీపిలీ అనీ పిలిచే ఈ పండ్లు అచ్చం మనదగ్గర కాసే జీడిమామిడి పండ్లను తలపిస్తాయి. 
 • దక్షిణాసియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
 •  జామ్‌లూ జెల్లీలతోబాటు తాజాగానూ వీటిని ఎక్కువగా తింటుంటారు.


ఇవి మాత్రమేనా... టొమాటోలా కనిపించే పేషన్‌పండ్లూ అకాకర లాంటి గాక్‌ పండ్లూ పనస లాంటి డురియన్‌లూ అరటిపండులాంటి ట్యాక్సోలూ... ఇలా మనకు తెలిసినవీ తెలియనవీ ఇంకెన్నో... అయినా భిన్న జాతులకు చెందిన పండ్లు రూపంలో ఒకేలా ఉండటం విశేషమే.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

శనగ పప్పు యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఆర్గాన్ నూనె యొక్క ప్రయోజనాలు
కుసుమ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
విటమిన్ కె ప్రయోజనాలు వనరులు మరియు దుష్ప్రభావాలు
కాపెరిన్ యొక్క ప్రయోజనాలు
ఆలివ్ ఆకు యొక్క ప్రయోజనాలు 
బచ్చలికూర యొక్క ప్రయోజనాలు
ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలు
పామాయిల్ యొక్క ప్రయోజనాలు
బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు 
కరివేపాకు మసాలా వల్ల కలిగే ప్రయోజనాలు
మందార టీ వల్ల కలిగే ప్రయోజనాలు 
వెన్న యొక్క ప్రయోజనాలు
అవోకాడో ఆయిల్ యొక్క ప్రయోజనాలు
బఠానీల వల్ల కలిగే ప్రయోజనాలు 
చెరకు వల్ల కలిగే ప్రయోజనాలు
పర్స్లేన్ యొక్క ప్రయోజనాలు 
వేరుశెనగ యొక్క ప్రయోజనాలు
మార్జోరాం యొక్క ప్రయోజనాలు 
వనిల్లా యొక్క ప్రయోజనాలు
రంబుటాన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు
కాలీఫ్లవర్ యొక్క ప్రయోజనాలు
గార్డెనియా ప్లాంట్ యొక్క ప్రయోజనాలు
చందనం నూనె యొక్క ప్రయోజనాలు
అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు
పెపినో యొక్క ప్రయోజనాలు
కనోలా నూనె యొక్క ప్రయోజనాలు
జింక్ యొక్క ప్రయోజనాలు
వైన్ ఆకుల యొక్క  ప్రయోజనాలు
రోవాన్ పండు యొక్క ప్రయోజనాలు
లావెండర్ టీ యొక్క ప్రయోజనాలు
మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు
కర్బూజ వలన కలిగే ప్రయోజనాలు  ఉపయోగాలు
పొన్నగంటి కూర ఉపయోగాలు
వెలగపండు ఉపయోగాలు
బీరకాయల్లోని  ఆరోగ్య ప్రయోజనాలు
డార్క్‌ సర్కిల్స్‌ నివారణకు  చిట్కాలు
నిద్రలేమి అంటే ఏమిటి? సంకేతాలు, లక్షణాలు మరియు చికిత్స
చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు
చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ A యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నాజూకైన నడుమును పొందడమెలా
శిలాజిత్తు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
జిన్సెంగ్ యొక్క ప్రయోజనాలు
గర్భంతో ఉన్నపుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు
గోంగూర వలన కలిగే ఉపయోగాలు
డ్రాగన్ ఫ్రూట్  యొక్క ప్రయోజనాలు
దురియన్ పండు యొక్క ప్రయోజనాలు
పండ్లను పోలిన పండ్లు
ఆవాలు వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు
సెలెరీ వల్ల కలిగే ప్రయోజనాలు 
పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు
వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
కొర్రలు యొక్క ఉపయోగాలు 
Home Made హెర్బల్ షాంపూ
పనసపండు ప్రయోజనాలు, పోషణ - దుష్ప్రభావాలు
త్రిఫల యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నేరేడు పళ్ళు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
కాల్షియం అధికంగా ఉండే భారతీయ ఆహారాలు
పుదీనా ఆకుల పేస్ట్‌ తో ఉపయోగాలు
ఉల్లికాడలు వలన కలిగే ఉపయోగాలు
పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం
క్యారెట్ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
జాస్మిన్ ఆయిల్ ఉపయోగాలు / ప్రయోజనాలు
ఉదయాన్నే చేయవల్సిన పనులు
బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలు దుష్ప్రభావాలు
తులసి ఆరోగ్య రహస్యాలు
చలిని తగ్గించే ఆహారం
ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే ఉపయోగాలు
కాకరకాయ వలన కలిగే ఉపయోగాలు
అలోవెరా (కలబంద) యొక్క ఉపయోగాలు -దుష్ప్రభావాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం
అవిసె గింజలు ప్రయోజనాలు, ఉపయోగాలు, -దుష్ప్రభావాలు
గోధుమ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
పెసలు వలన కలిగే ప్రయోజనాలు
పుచ్చకాయ వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
అలసటను దూరము చేసే ఆహారము
మార్నింగ్ వాక్‌తో ప్రయోజనాలు
బియ్యం కడిగిన నీటితో ఉపయోగాలు
జలుబు,దగ్గును దూరం చేసే చిట్కాలు
ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు
కరివేపాకు కషాయం ఉపయోగాలు
మెంతి ఆకు కషాయం ఉపయోగాలు
జామ ఆకు కషాయం ఉపయోగాలు
సదాపాకు కషాయం ఉపయోగాలు
తమలపాకు కషాయం ఉపయోగాలు
రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు - దుష్ప్రభావాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post