చెరకు రసం ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

చెరకు రసం ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలుచక్కెర ఉత్పత్తికి ఉపయోగించే చెరకు గడ్డిజాతికి చెందినది. చెరకు గడలు పొడవుగా ఉండి సంవత్సరం పొడుగునా  కూడా లభిస్తాయి.  మరోవైపు, “చెరకు రసం” అనేది చెరకు గడల్ని యంత్రాల సాయంతో (గానుగలో కావచ్చు) పిప్పిచేసి తీసే చిక్కని పానకం. చెక్కుతీసిన (peeled) లేక ముడి చెఱకు గడలపైన ఉండే పట్ట (hard ply on sugarcane)ను తొలగించిన చెరకు గడల్ని మిల్లులో పెట్టి పిప్పి చేసినపుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా ఆస్వాదించే రుచికరమైన ‘చెఱకు రసం’ పానీయం సృష్టించడం కూడా జరుగుతుంది.

దక్షిణ మరియు ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో చెరకు పుట్టింది.  ఇక చెరకు గడల నుండి చక్కెర ఉత్పత్తి మొదలైంది ఉత్తర భారతదేశంలోనే అని చెప్పబడుతోంది.  అనేక సంస్కృత మరియు పాళీ గ్రంథాల్లో చక్కెర ఉత్పత్తి గురించి కూడా సూచించాయి. సంస్కృత పదం ‘శర్కర’ (Sarkara), నుండి చెరకు శాస్త్రీయ పేరు ‘శాచ్చారం’ ను తీసుకున్నారని కూడా ఊహించబడుతోంది,  తెలుస్తోంది, అంతేగాక పురాతన భారతదేశం నుండి గ్రహించి ఉంటారన్న తిలివిడికి ఇది సాక్ష్యంలా నిలుస్తోంది.

మధ్యప్రాచ్య దేశాల  నుండి వ్యాపారులు చక్కెరను మధ్యధరా ప్రాంతానికి పరిచయం చేశారు.  అటుపైన ఇది స్పానిష్ మరియు పోర్చుగీసు రైతుల ద్వారా అమెరికాలోకి కూడా ప్రవేశించింది. కొలంబస్ తన రెండవ సముద్రయానంలో అమెరికాకు వెళ్ళినపుడు (కనుగొన్నపుడు) అక్కడి నుండి కరీబియన్ ద్వీపాలకు చెరకును కూడా  తీసుకొచ్చారు.  ఆ తర్వాత అది యూరప్కు రవాణా చేయబడినది. ఈ సమయంలో బానిసల వ్యాపారంలో చెరకు సాగు చాలా ముఖ్యమైనది.

దానిలో ఉన్న అనామ్లజనకాలు కారణంగా చెరకు రసం శరీరం మీద చాలా అద్భుతాలు చేస్తాయి. ఈ అనామ్లజనకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మరియు రోగనిరోధకతను పెంచడంలో కూడా సహాయపడతాయి. చెరకు ఇనుము, కాల్షియం, మెగ్నీషియం మరియు ఇతర ఎలెక్ట్రోలైట్స్ వంటి ఖనిజాలను కూడా సమృద్ధిగా కల్గి ఉంటుంది. , ఇది నిర్జలీకరణానికి ఓ గొప్ప నివారిణిగా పని చేస్తుంది.

చెరకులో కొన్ని పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రదేశాల్లో, చెరకు నుండి రసాన్ని తీసిన తర్వాత మిగిలివున్న చెరకు పిప్పిని కాగితంలా పరివర్తించబడుతోంది. చెట్ల నుంచి తయారైన కాగితం మాదిరిగా కాకుండా, ఈ చెరకు కాగితం పర్యావరణ అనుకూలమైనది మరియు పునర్వినియోగపరచదగినది (recyclable). కొన్ని సందర్భాల్లో, చెరకును జీవ ఇంధనం (biofuel) వలె కూడా ఉపయోగిస్తారు మరియు ఇథనాల్ ఉత్పత్తిలో కూడా ఉపయోగిస్తారు.

చెరకు రసం ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు


చెరకు గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:


వృక్షశాస్త్ర నామం (బొటానికల్ పేరు): సకారమ్ ఆఫీషినరమ్ (Saccharum officinarum)
కుటుంబ పేరు: పోయేసియె (Poaceae)
సాధారణ పేరు: చెరకు, ఈఖ్ , కరిమ్బూ, గన్నా
ఉపయోగించే భాగాలు: చెఱకు మొక్క యొక్క కాండాన్ని చక్కెర ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు.
స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్టీర్ణం:   చెరకు బ్రెజిల్, భారతదేశం, చైనా, థాయిలాండ్, మరియు ఫ్లోరిడా, లూసియానా, టెక్సాస్ మరియు హవాయి వంటి యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రాంతీయ భాగాలలో  ఎక్కువగా సాగు చేస్తారు. పెరూ ప్రపంచంలోనే చెరకు ఉత్పత్తిలో అగ్రగణ్య దేశం.  దాని తరువాత జాంబియా అతిపెద్ద చెరకు ఉత్పత్తి చేసే దేశం.

ఆసక్తికరమైన వాస్తవం: గ్రీకు మరియు పర్షియన్ వ్యాపారులు తమ ప్రయాణంలో భారతదేశానికి వచ్చినపుడు మొట్టమొదట చెరకును చూచారు.  అపుడు వాళ్ళు  చెరకును ఒక విలాసవంతమైన మరియు ఖరీదైన మసాలాగా కూడా పరిగణించారు.
  • చెరకు రసం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు 
  • చెరకు రసం దుష్ప్రభావాలు 
  • ఉపసంహారం


చెరకు రసం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు 

చెరకురసం మూత్రవిసర్జనకారిగా, బరువును పెంచే కారకంగా, నిర్జలీకరణ నివారిణిగా, పచ్చకామెర్లకు  మందుగా, జీర్ణక్రియను పెంచేదిగా, క్యాన్సర్ నివారిణిగా కూడా పని చేయగలదని చెప్పబడుతోంది.

చెరకురసం మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది, తద్వారా మూత్రవిసర్జనకు తోడ్పడుతుంది. చెరకు రసాన్ని సంప్రదాయక మూత్రవిసర్జనకారిగా కూడా  ఉపయోగిస్తారు. అంతేకాక మూత్రపిండాలకు సంబంధించిన రుగ్మతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది .  

అవసరమైన ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను చెరకు రసం అందింస్తుంది.  అంతేకాక బరువు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు మరియు ఖనిజాలు కూడా చెరకు రసంలో  ఎక్కువగా  ఉంటాయి.

బరువు చాలా తగ్గిపోయినప్పుడు చెరకు రసం బరువును పెంచే దివ్యౌషధంలా కూడా  పని చేస్తుంది అలాగే బరువు పెరగాలనుకునే వారికి ఇది ఒక సమర్థవంతమైన బరువు పెంచే మందు. 

చెరకు రసంలో ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి.  ఇది అలసటకు లేదా నీరసానికి ఒక అద్భుతమైన ముందుగా కూడా పనిచేస్తుంది. బలహీనంగా ఉండేవాళ్లు లేదా ఒత్తిడికి గురైయ్యేవారు ఒక  గ్లాసెడు చెరకు రసాన్ని తరచుగా తాగాలని సిఫారసు చేయబడుతుంది.

చెరకు రసం కాలేయం ఆరోగ్యానికి చాలా మంచిది.  దీనిని కామెర్లకు ఒక అద్భుతమైన పరిషారంగా చెప్తారు. చెరుకు ఆల్కలీన్ ఆహార పదార్థం అయినందున, ఇది శరీరంలో ఆమ్ల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. తద్వారా చెరకురసం కాలేయ సమస్య తగ్గి వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది.

చెరకు రసం పొటాషియం యొక్క గొప్ప వనరు. ఇది కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్ల పై పోరాడటానికి కూడా సహాయపడుతుంది మరియు వాటి వలన కలిగే సమస్యల నుండి కూడా కాపాడుతుంది.  

పొటాషియంకు మంచి వనరుగా, చెరుకు రసం pH స్థాయిలను కూడా సమతుల్యంలో ఉంచడంలో  సహాయపడుతుంది.

చెరకులో యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి .  అందువల్ల ఇది యాంటీ-క్యాన్సర్ ఎజెంట్ గా పనిచేస్తుంది. చెరకు రసంలో ఉండే  అనేక సమ్మేళనాలు రాడికల్-స్కావెంజెన్ సామర్ధ్యం కలిగి ఉంటాయి.

చెరకురసం ఊపిరితిత్తుల, మెలనోమా , పెద్దప్రేగు, ప్రోస్టేట్, అండాశయం మరియు మూత్రపిండాల క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ కణాలపై  వ్యతిరేక చర్యలను చూపినట్లు పరిశోధనలు ద్వారా కనుగొన్నాయి.

  • మూత్రవిసర్జనకారిగా చెరకు రసం
  • బరువును పెంచేందుకు చెరకు రసం
  • నిర్జలీకరణకు చెరకు రసం 
  • కామెర్లకు చెరకు రసం 
  • జీర్ణక్రియకు చెరకు రసం
  • క్యాన్సర్ కు చెరకు రసం 


మూత్రవిసర్జనకారిగా చెరకు రసం 

చెరకు రసాన్ని సంప్రదాయకంగా మూత్రవిసర్జనకారిగా కూడా ఉపయోగిస్తారు. చెరకు రసం మూత్రపిండాల సరైన పనితీరును కూడా నిర్ధారిస్తుంది. చెరకు రసాన్ని సాధారణంగా సేవిస్తుంటే మూత్రం యొక్క స్పష్టమైన మరియు వేగవంతమైన ప్రవాహానికి  తోడ్పడుతుంది అని అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి. శరీరం నుండి అదనపు విషాన్ని తొలగించడం ద్వారా, అధిక రక్తపోటు , మూత్ర నాళాల అంటువ్యాధులు మరియు ఇతర మూత్రపిండాల సంబంధిత వ్యాధులను నివారించడంలో చెరకురసం మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది.


బరువును పెంచేందుకు చెరకు రసం 

సంప్రదాయిక నమ్మకం ప్రకారం, చెరకు రసాన్ని నిరంతరంగా ఓ క్రమబద్ధమైన పద్ధతిలో సేవిస్తే బరువు పెరుగుటానికి కూడా తోడ్పడుతుంది. శరీరాన్ని మెరుగుపరచడంలో మరియు శరీరం యొక్క సరైన నిర్వహణ కోసం అవసరమైన కార్బోహైడ్రేట్ల ఆరోగ్యకరమైన రకాన్ని అందించడంలో సహాయపడే పోషకాలు మరియు ఖనిజాలను చెరకు రసం కలిగి ఉంది. అందువల్ల, వ్యక్తుల బరువు ప్రమాదకరమైన తక్కువ స్థాయికి పడిపోయినపుడు చెరకు రసం వారి బరువును పెంచే దివ్యౌషధంలా  కూడా  పని చేస్తుంది .  కొన్ని అదనపు కిలోల బరువు పెరగాలనుకునే వారికి ఇది ఓ సమర్థవంతమైన బరువు పెంచే మందుగా కూడా పనిచేస్తుంది.

నిర్జలీకరణకు చెరకు రసం 

చెరకు రసం ముఖ్యమైన ఖనిజాలను అధిక పరిమాణంలో కల్గి ఉంటుంది, ఇది అలసటకు లేదా నిశ్శక్తికి అద్భుతమైన చికిత్సగా కూడా పనిచేస్తుంది. బలహీనంగా ఉండేవాళ్లు లేదా ఒత్తిడికి గురైన వ్యక్తులు ఓ గ్లాసెడు చెరకు రసాన్ని తరచుగా తాగాలని ప్రోత్సహిస్తారు.  తద్వారా వారి దేహాలు చల్లబడి తిరిగి శక్తిని కూడా  పుంజుకుంటాయి. రోజులో కోల్పోయిన ఎలెక్ట్రోలైట్లు మరియు కార్బోహైడ్రేట్ ద్రవాన్ని (CHOs) శరీరానికి అందించి చెరకు రసం వ్యక్తి సేదదీరేట్లు  చేసి కొత్తశక్తిని పుంజుకునేలా సహాయపడుతుంది.

వ్యాయామం అనంతరం, సాదా నీరు బదులు చెరకు రసం సేవిస్తే, మన కండరాల్లోని శర్కరాజనకాల్ని(glucogens) పునఃసంయోజనం చేసే ‘రీహైడ్రేషన్ పానీయం’గా పనిచేసి శరీరంలో కోల్పోయిన జలాన్ని తిరిగి నింపుతుంది. అథ్లెట్లు మరియు భారీ వ్యాయామాలలో మునిగిపోయే వ్యక్తులకు చెరకురసాన్ని సిఫారసు చేయటానికి గల కారణాల్లో ఇది ఒకటి.


కామెర్లకు చెరకు రసం 

కామెర్ల వ్యాధిలో కాలేయం పనిచేయకుండా పోతుంది .  పిత్తాశయం పైత్యరస వర్ణద్రవాన్ని(bilirubin)ఎక్కువగా ఉత్పత్తి చేయడం కూడా మొదలుపెడుతుంది.  ఈ ‘పైత్యరసం వర్ణద్రవం’ అనేది పైత్యరసంలోని పసుపు భాగాన్ని తయారుచేసే రసాయనం. దీని ఫలితంగా, ఈ రుగ్మత ప్రభావిత వ్యక్తి చర్మం మరియు గోర్లు పసుపు రంగులోకి పాలిపోవడం వంటి లక్షణాలను కూడా చూపుతారు.

సంప్రదాయకంగా, చెరకు రసం కాలేయం ఆరోగ్యానికి చాలా మంచిది.   అది కామెర్లు వ్యాధికి ఒక అద్భుతమైన పరిహారం అని కూడా  భావిస్తారు. చెరుకు ఆల్కలీన్ ఆహార పదార్థం అయినందున, ఇది శరీరంలో ఆమ్ల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. తద్వారా చెరకురసం కాలేయరుగ్మత మాని వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి  కూడా సహాయపడుతుంది.

అంతేకాక, చెరకులో ఉండే పోషకాలు కాలేయం కోలుకోవటానికే కాక శరీరాన్నిబలంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.  మరియు కాలేయం వ్యాధులకు ప్రయోజనకరమైన మందుగా లేదా సహాయక నివారిణిగా కూడా పని చేస్తుంది.

జీర్ణక్రియకు చెరకు రసం 

చెరకు రసం పొటాషియం యొక్క గొప్ప వనరుగా చెప్పబడుతుంది.  ఇది జీర్ణ రసాల సమతుల్య స్రావాన్ని  కూడా ప్రోత్సహిస్తుంది. ఇది కూడా కడుపులో వచ్చే అంటువ్యాధులపై పోరాడటానికి మరియు అవి హానికరమైన వ్యాధులుగా అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. పొటాషియం మూలంగా , చెరుకు రసం కూడా పిహెచ్ (pH) స్థాయిలను సమతుల్య స్థితిలో ఉంచడంలో కూడా సహాయం చేస్తుంది.  తద్వారా ఆరోగ్యవంతమైన కడుపు పనితీరుకు దోహదం చేస్తుంది.

చెరకు రసంలో ప్రధాన భాగం నీరు కావడం వల్ల, ఇది మలాన్ని మృదువుగా అయ్యేట్లు సహాయపడుతుంది, ఆరకంగా ఇది మలబద్ధకానికి మందుగా కూడా పనిచేస్తుంది. .

క్యాన్సర్ కు చెరకు రసం

చెరకు అనామ్లజనకాలు పుష్కలంగా ఉంటాయి.  మరియు అందువల్ల ఆంటిక్యాన్సర్ ఎజెంట్కు ఒక సంభావ్య మూలం. చెరకు రసంలో ఉన్న అనేక సమ్మేళనాలు ప్రామాణిక ఔషధాల కంటే ఎక్కువ రాడికల్-స్కావెంజెన్ సామర్ధ్యం చూపాయి. అంతేకాకుండా, చెరకు, ఊపిరితిత్తుల, మెలనోమా , పెద్దప్రేగు, ప్రోస్టేట్, అండాశయం మరియు మూత్రపిండాల క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా చెరకు నిరోధక చర్యను కూడా పరిశోధనలు కనుగొన్నాయి .

చెరకు రసం దుష్ప్రభావాలు 

తేనె తర్వాత, చెరకు సహజ చక్కెర యొక్క ఉత్తమ వనరులలో ఒకటిగా చెప్పబడుతుంది. మరియు మరెన్నో ఇతర సహజ ఆహార వస్తువుల మాదిరిగా, ఇది చాలా ఆరోగ్య సమస్యలకు ఒక పరిహారం వలె కూడా పనిచేస్తుంది.  శరీరాన్ని ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అయినప్పటికీ, చెరకు వినియోగదారులకు హానికరం అని రుజువైన సందర్భాలు ఉన్నాయి.  ఇదొక అద్భుతమైన గడ్డిజాతి పంటే కానీ,ఇది కొన్ని దుష్ప్రభావాలను కూడా కల్గించవచ్చును .

చెరకు రసం ఎక్కువసేపు గాలికి గురైనప్పుడు అది ఆక్సీకరణం లేక ఆక్సిడైజ్ పొందడం వలన దాన్ని తాగే ఎవరికైనా ప్రాణాంతకంగా మారుతుంది. మీరు సరైన నిల్వ పద్ధతులను అనుసరించని పక్షంలో లేదా వీధి వైపు అమ్మకందారుల నుండి చెరకు రసం కొనుగోలు చేస్తే ఇది అపరిశుభ్రంగా ఉన్నయెడల అపాయకరంగా భావించవచ్చును .

చెరకు కార్బొహైడ్రేట్ల యొక్క గొప్ప మూలం. ఇది కేలరీలలో కూడా గొప్పది. దీని అర్థం చెరకు రసం యొక్క అధిక వినియోగం శరీరానికి హాని కలిగించగలదు మరియు బరువు పెరుగుటకు దారి తీయవచ్చును .

చక్కెర చెరకు రసం వినియోగం దంత క్షయాల అవకాశాలను పెంచుతుందని స్టడీస్ సూచిస్తున్నాయి .

చెరకు చక్కెరవ్యాధి (డయాబెటిక్) రోగులకు మంచిది అని ఇప్పటికే తేలింది. అయినప్పటికీ, చెరకురసం సహజ చక్కెర అయినా, దాన్ని ఎక్కువగా సేవించడం హానికరమైనదిగా ఉంటుంది.   అందువల్ల, చెరకురసం సేవనాన్ని నియంత్రించేందుకు తగు జాగ్రత్త తీసుకోవాలి.
చెరుకు రసం పరిశుభ్రమైన పరిస్థితులలో ఉత్పత్తి చేయకపోతే లేదా చెరకు గడలు సరిగా శుభ్రపరచకుండా ఉండకపోతే, అది వ్యాధికారక సూక్ష్మజీవులను కల్గి ఉండవచ్చును.   అందువల్ల దీన్నుండి మనకు వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా, చెరకు గడల పైన పిచికారీ చేసిన రసాయనిక పురుగుమందుల ఉనికి ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది.

సుదీర్ఘకాలం నుండి చెరకును జానపద ఔషధంగా వాడుతున్నారు మరియు ఇది అనేక రుగ్మతలకు చికిత్సగా కూడా ఉపయోగపడుతుంది. ఏమైనప్పటికీ, విషకారక భారీ ఖనిజాలను (ఉదా. కాడ్మియం, లెడ్ లేక సీసం) సూక్ష్మపోషకాలు (ఉదా. కాపర్, జింక్, మాంగనీస్) శరీరంలోకి వ్యాపింపచేయగల  సామర్థ్యం దీనికున్న కారణంగా చెరకు సేవనం మనుషులలో విష ప్రభావాలను కూడా  ప్రేరేపిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, వృత్తిపర ద్రావకాలకు గురైన చెరకు రైతుల నోటి కుహరంలో ఫారింక్స్ క్యాన్సర్ లేక ఓరల్క్యావిటీ ప్రమాదం కనిపించింది.


ఉపసంహారం

చెరకు రసం అనేది భారతీయ కుటుంబాలల్లో, మరీ ముఖ్యంగా వారి వంటగదుల్లో, ప్రముఖ పాత్రను పోషించే ముఖ్యమైన పానీయం. చెఱకు గడ చక్కెరకు సహజ వనరుగా ఉండడమే కాకుండా, దీని రసం దప్పికను, అలసటను తీర్చే ఓ గొప్ప వేసవి పానీయం లక్షణాల్ని కూడా కల్గి ఉంది. చెరకు యొక్క ఆరోగ్య లక్షణాలు ప్రాచీన భారతదేశ (భాషల) లిపిలో కూడా ప్రస్తావించబడ్డాయనే వాస్తవం మానవులకు చెరకు ఎంత ప్రయోజనకరమో మరియు ఇది శరీర ఆరోగ్యాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహించగలదోనన్న విషయాన్ని చెపుతోంది. అయినప్పటికీ, చెరకు రసం తాగేటపుడు జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే అధిక ప్రమాణంలో ఈ తియ్యని రసాన్నితాగితే మంచి కన్నా ఎక్కువ హాని కలిగే అవకాశం ఉంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post