టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు ఎర్రగా నిగ నిగలాడుతూ మెరిసే టొమేటో.  కంటబడితే చూడకుండా కళ్ళు తిప్పుకోవడం ఎవరికైనా అసాధ్యమే. టొమేటోను పలు విధాలుగా కూడా తింటాం.  జ్యూస్ రూపంలో కూడా తాగుతాం, పచ్చి టొమేటోను స్లైడ్లుగా కోసి సలాడ్లలో మిశ్రమంగా  కూడా వినియోగిస్తాం. ఇంకా సూప్‌లో కలుపుతాము, కమ్మని దాని రుచిని ఆస్వాదిస్తాం. పోషకాలకు చక్కటి మూలమైన టొమేటో ఓ గొప్ప ఆహారపదార్థమే (superfood), అందుకే దీన్ని అందరూ దాదాపు అన్ని వంటకాల తయారీలో చేర్చాలనుకుంటారు. మధురమైన రసాల (juices) నుండి, భోజనాలకు వండిన వంటకాల వరకు, సలాడ్లులోను టమోటాను దాని సహజమైన రంగు,  రుచి మరియు అనామ్లజనకాల కోసం విస్తృతంగా  కూడా ఉపయోగించబడుతుంది. నిజానికి, టొమాటో అమెరికా లోని న్యూ జెర్సీ రాష్ట్రం అధికారిక కూరగాయగా నియమించబడింది. చాలామంది తమ ప్రత్యేకమైన ఆహారాల్లో (special foods) టమోటాను ఒకటిగా కూడా  భావిస్తారు.

టమోటాల్ని పండించడం సులభం, అందుకేనేమో టమాటో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన పంటగా మారిందిపుడు. టొమాటో జన్మస్థలం మధ్య అమెరికా ప్రాంతంమైన పెరూ. బంగాళాదుంప, పొగాకు, మిరప, మరియు మిరియాల వంటి “నైట్ షేడ్” (nightshade) మొక్కల కుటుంబానికి చెందినదే టమాటో కూడా. క్రీస్తుశకం 1500 ల మధ్యలో, టమోటాలు మొదట ఐరోపా ఖండానికి  కూడా వచ్చాయి. తాజా కూరగాయల మార్కెట్లో నాలుగో స్థానంలో ఉన్న అతి ఎక్కువ డిమాండున్న కూరగాయ టమాటో.  బంగాళాదుంపలు, ఆకు కోసు (lettuce), మరియు ఉల్లిపాయలు మొదటి మూడు స్థానాల్లో అతి ఎక్కువగా డిమాండున్న కూరగాయలు. టొమాటోల్లో సుమారు 25,000 రకాలున్నట్లు ఊహించబడుతోంది. ఇది అద్భుతమైన ఔషధ లక్షణాలను కలిగి ఉంది. టమోటాలు వేర్వేరు పరిమాణాల్లో మరియు రంగులతో ఉంటాయి మరియు అనేక రకాలుగా తయారు చేసుకుని తినేయవచ్చును . చాలా మంచి రుచి, వాసనల్ని కల్గిన టొమేటో లేకుండా చాలా మంది భోజనాన్ని ఊహించలేరు అంటే అతిశయోక్తి  కాదు మరి.

ఆసక్తికరంగా, అమెరికన్లు ఇతర కూరగాయల నుండి కంటే టమోటా నుండీనే ఎక్కువ  విటమిన్లు పొందుతున్నారు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు దీని రంగు ఆకుపచ్చగా ఉంటుంది.  పండైనపుడు  ఎరుపు రంగులోకి మారి “టొమేటో పండు” అవుతుంది. టమోటా విత్తనాల్ని కలిగి,  పుష్పించే మొక్క నుండి పండుతుంది పెరుగుతుంది.  వృక్షశాస్త్రపరంగా టొమేటో ఒక కూరగాయగా కాకుండా ఒక పండు అని వర్గీకరించబడింది. వీటిని ఇటాలియన్ ఆహారంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు వారు చేసే ‘కెచప్’ కు అయితే టొమేటోలు  చాల తప్పనిసరి. అంతేకాకుండా, అనేక భారతీయ వంటకాలలో టొమాటోలు ఓ కీలకమైన కూరదినుసు. టొమాటోకు అంత ఆకర్షణీయమైన ఎర్ర రంగు ఎలా వచ్చింది అంటే దాన్లో ఉండే 'కరొటెనాయిడ్ల” నుండి వచ్చింది. కానీ టొమేటోలు కేవలం ఎరుపు రంగులో మాత్రమే కాదు.  పసుపు, గులాబీ, ఊదా, నలుపు మరియు తెలుపు రంగులలో కూడా టొమేటోల్ని మనం చూడొచ్చును .

ప్రపంచంలో టొమేటోను అతి ఎక్కువ ప్రమాణంలో పండించే దేశం చైనా. 2009 లో ప్రపంచ ఉత్పత్తిలో నాలుగో వంతు టొమేటోల్ని ఒక్క చైనాయే పండించింది. అమెరికా (యునైటెడ్ స్టేట్స్) మరియు ఇండియా వరుసగా రెండవ మరియు మూడవ అతిపెద్ద టొమేటో ఉత్పాదక దేశాలు.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, అమెరికా(USA) లోని ఓక్లహోమాకు చెందిన జి. గ్రాహం అనే ఆయన 1986లో అతి పెద్ద టొమాటోను పండించారు, దాని బరువు 3.51 కిలోలు! టొమాటోను క్యాన్సర్‌తో పోరాడటానికి, రక్తపోటును నిర్వహించడానికి మరియు మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించేందుకు ఎక్కువగా కూడా వాడతారు. రక్తం వడపోత జరిపేదిగా మరియు తొలగించే ఆహారంగా కూడా పని చేస్తుంది.

ఆరోగ్యానికి మాత్రమే కాక, టొమేటో చర్మరక్షణ కోసం చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఇది ఎండవేడిచేత కమిలిన గాయాల (సన్ బర్న్స్) క్కూడా రక్షణ కల్పిస్తుంది.

టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

టమాటా గురించిన ప్రాథమిక వాస్తవాలు


రాజ్యం (kingdom): ప్లాంట (Plantae)
కుటుంబం: సోలనాసియా
తరగతి: డికోటిలెడొనే (Dicotyledonae)
శాస్త్రీయనామం: సోలనమ్ లైకోపెర్శికం (Solanum lycopersicum)
మూలం (origin): సాహిత్య పరంగా, ఆంగ్ల పదం 'టొమేటో' అనే పేరు, స్పానిష్ భాషా పదం, 'టమేట్' నుంచి వచ్చింది, దీని అర్థం "ఊదిపోయే పండు" అని. వృక్షశాస్త్రపరంగా (బొటానికల్‌గా), టమోటా మొక్క ఉద్భవం మధ్య అమెరికాలో, పెరూ సమీపంలో ఎక్కడో ఉద్భవించింది. టొమేటోను మొట్టమొదట 700 AD లో అజ్టెక్లు (అమెరికా యొక్క పురాతన తెగలలో ఒకటి) పండించి వృద్ధి చేశారని నమ్ముతారు. 
గ్రూప్: డికోట్స్-Dicots
ఇతర సాధారణ పేర్లు: 'టొమేట్ (ఫ్రెంచ్), టమేటర్ (హిందీ), పోమోడోరో (ఇటాలియన్)
తమాషా వాస్తవం (ఫన్ ఫాక్ట్): ప్రతి సంవత్సరం స్పానిష్ పట్టణమైన బునాల్లో  ప్రపంచంలోనే అతిపెద్ద టమోటా పోరాటం జరుగుతుంది. ఈ పండుగను “లా టొమాటినా” అని పిలుస్తారు, దీనిలో సుమారు 40,000 మంది ప్రజలు సుమారు 1,50,000 టమోటలను ఒకరిపై విసురుకొని  కూడా ఆనందిస్తారు .

 • టమాటా యొక్క పోషక విలువలు 
 • టమాటా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు 
 • టమాటా యొక్క దుష్ప్రభావాలు 
 • ఉపసంహారం 


టమాటా యొక్క పోషక విలువలు 

టమోటాల్లో లైకోపీన్ అనే ఒక శక్తివంతమైన క్యాన్సర్‌తో పోరాడే పదార్ధం ఉంది. విటమిన్ సి కూడా టొమాటోలో సమృద్ధిగా ఉంటుంది. ఎముకలలో కాల్షియం మరియు ఇతర ఖనిజ సాంద్రతలను మెరుగుపరచడంలో కూడా టొమేటో సహాయపడుతుంది .  ఎముకల్ని బలంగా చేస్తుంది. విరిగిన ఎముకలను నయం చేయడంలో టొమేటో చాలా ప్రభావవంతమైనది. టమాటాల్లో నీటి పరిమాణం సుమారు 95% మరియు ఇతర కార్బోహైడ్రేట్లు మరియు పీచుపదార్థాలు 5% ఉంటుంది.   


ఆహార పీచుపదార్థాలు (ఫైబర్), పొటాషియం, ఫోలేట్ (folate) మరియు విటమిన్ సి లను టొమేటో సమృద్ధిగా కల్గి ఉంటుంది.  కాబట్టి టమోటా శరీరం మరియు మనస్సు రెండింటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది .  అనేక వ్యాధులను నిర్మూలించడంలో ఈ కూరగాయ సమర్థవంతమైనదిగా నిరూపించబడింది. టొమేటోలో అతితక్కువగా సంతృప్త కొవ్వులుంటాయి మరియు కొవ్వులు (కొలెస్ట్రాల్) ఏమాత్రం ఉండవు. విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు, పీచుపదార్థాలు (ఫైబర్) వంటి పోషకాలతో టొమేటో పుష్కలంగా ఉంటుంది మరియు తక్కువ కేలరీలను కల్గి కూడా  ఉంటుంది.

USDA నేషనల్ న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల టమోటా కింది పోషక విలువలను కలిగి ఉంటుంది:

పోషక విలువలు:ప్రతి 100 గ్రాలకు విలువ

నీరు:94.78 గ్రా
శక్తి:16 kCal
ప్రోటీన్:1.16 గ్రా
కొవ్వు(ఫాట్స్):0.19 గ్రా
కార్బోహైడ్రేట్:3.18 గ్రా
ఫైబర్:0.9 గ్రా

మినరల్స్

కాల్షియం:5 mg
ఐరన్:0.47 mg
మెగ్నీషియం:8 mg
భాస్వరం:29 mg
పొటాషియం:212 mg
సోడియం:42 mg
జింక్:0.14

విటమిన్

విటమిన్ B1:0.046 mg
విటమిన్ B2:0.034 mg
విటమిన్ B3:0.596 mg
విటమిన్ B6:0.060 mg
విటమిన్ B9:29 μg
విటమిన్ సి:16.0 mg
విటమిన్ ఎ:75 μg

కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు

 మొత్తం అసంతృప్తకొవ్వులు:0.025 గ్రా
మొత్తం మోనౌట్యురేటెడ్:0.028 గ్రా
మొత్తం బహుళఅసంతృప్తకాలు (polyunsaturated):0.076 గ్రా
టమాటా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యకరమైన చర్మం కోసం టమాటా: టమాటా లో ఉండే లైకోపీన్ చర్మ ఆరోగ్యానికి  కూడా సహాయపడుతుంది.  ఎండ వలన కమిలిన గాయాలను తగ్గిస్తుంది మరియు మృదువైన చర్మాన్ని  కూడా అందిస్తుంది.  

ఎముకల కోసం టమాటా: టమాటాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి . ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా కూడా  చేస్తాయి

చెక్కెర వ్యాధికి టమాటా: సహజంగా రక్తంలో చక్కెరను నియంత్రించడానికి టమాటాలు చాలా సహాయం చేస్తాయి. టమాటాలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. అందువల్ల ఇది మధుమేహ రోగులకు  చాల మంచి మందు.

క్యాన్సర్‌కు టమాటా: క్యాన్సర్ ప్రమాద కారకాల్ని తగ్గించడంలో సహాయపడే ఆహారాలలో టమాటా ఒకటి. కెరోటినాయిడ్ కుటుంబానికి చెందిన లైకోపీన్, టమోటాలలో సమృద్ధిగా ఉంటుంది. లైకోపీన్ ఒక శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని  కూడా భావింపబడుతుంది.

కంటి కోసం: టమాటాలో విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి అవి కంటి సమస్యలను నివారించడంలో  బాగా   సహాయపడతాయి.

గుండెకు: హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిచడంలో టమాటాలో లైకోపీన్ ఉపయోగపడుతుంది. ఇది కణాలలో ఉండే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. టమాటా శరీరంలో చేడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను  కూడా పెంచుతుంది      

 • ఆరోగ్యకరమైన చర్మం కోసం టమాటా 
 • ఎముకల కోసం టమాటా 
 • కంటికి టమాటా 
 • జుట్టు నష్టం కోసం టమాటా 
 • చక్కెరవ్యాధికి టమాటా 
 • టమాటా క్యాన్సర్‌ను నిరోధిస్తుంది 
 • ఆరోగ్యకరమైన గుండెకు టమాటా 
 • రోగనిరోధకత కోసం టమాటా 
 • ఆస్త్మాకు (ఉబ్బసానికి) టమాటా 
 • టమాటా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది 


ఆరోగ్యకరమైన చర్మం కోసం టమాటా 

ఈ ఆధునిక కాలంలో, అందరూ తమ చర్మం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ శుభ్రమైన మరియు మృదువైన చర్మం కావాలని కోరుకుంటున్నారు. చర్మవ్యాధి నిపుణులు మరియు ఇతర నిపుణుల ప్రకారం చర్మం నాణ్యతపై  ఆహారపు అలవాట్లు పెద్దగా ప్రభావం చూపుతాయని చెపుతారు. తాజా కూరగాయలు మరియు పండ్లు తినడం ప్రధానంగా చర్మంపై ప్రభావం చూపవచ్చును . చర్మంపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉన్న కూరగాయలలో టొమేటోను ఒకటిగా పరిగణించవచ్చును . టొమేటో లైకోపీన్ మరియు ఇతర మొక్కల సమ్మేళనాల్ని పుష్కలంగా కల్గి ఉంది . ఇది ఎండవల్ల చర్మంపై కమిలిన గాయాలకు (సన్ బర్న్స్) రక్షణ  కూడా కల్పిస్తుంది.

లైకోపీన్ ఓ ప్రధాన కేరోటినాయిడ్ మరియు చాలా సమర్థవంతమైన సింగిల్ ఆక్సిజన్ స్కావెంజర్. లైకోపీన్ లేదా లైకోపీన్ పుష్కలంగా కల్గిన టమోటా-ఉత్పన్నమైన ఉత్పత్తిని తీసుకున్న తర్వాత, ఫోటోప్రొటెక్టివ్ ప్రభావాలు ప్రదర్శించబడ్డాయి. ఆహార కెరోటినాయిడ్లు హానికరమైన UV వికిరణం నుండి జీవితకాలపు రక్షణకు దోహదం చేస్తాయి. లైకోపీన్ యొక్క ఆహార వనరు యొక్క వినియోగం ద్వారా UV- కాంతి ప్రేరిత ఎరిథెమాకి వ్యతిరేకంగా రక్షణను సాధించటం సాధ్యమవుతుందని సూచన డేటా  కూడా సూచిస్తుంది.


ఎముకల కోసం టమాటా 

టమోటా ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల నిర్వహణలో ప్రయోజనకరంగా  కూడా ఉంటుంది. టమోటాలో అనామ్లజని లైకోపీన్ అధికంగా ఉంటుంది.  దానివల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిపోతుంది మరియు ఎముక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇది  కేరోటినాయిడ్లు నాలుగింటినీ కూడా కలిగి ఉంటుంది .  ఈ కారోటినాయిడ్స్ ఎముకలకు ఎంతో ప్రయోజనం కూడా కలిగిస్తాయి.


కంటికి టమాటా 

విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్లను సమృద్ధిగా కల్గి ఉన్న టమోటా.  మనిషి ఆరోగ్యానికి, చర్మానికి మాత్రమే మంచిది కాదు, దృష్టిని మెరుగుపరచడానికి కూడా దోహదపడుతుంది. రెటీనా సరిగ్గా పనిచేయడానికి మరియు తక్కువ కాంతిలో మరియు వర్ణమయ కాంతిలో  కళ్ళు పని చేయడానికి టమేటా మనకు చాల అవసరం. ఇది కళ్ళ అభివృద్ధిలో ప్రధాన పాత్ర కూడా పోషిస్తుంది.


జుట్టు నష్టం కోసం టమాటా 

ముఖ్యంగా మహిళల్లో జుట్టు నష్టం చాలా సాధారణ సమస్యలలో ఒకటి. సాధారణంగా, రుతువిరతి కాలంలో, హార్మోన్ల స్థితి మారుతుంది, దాని ఫలితంగానే జుట్టు నష్టం ఏర్పడుతుంది. అయితే, విటమిన్ ఎ ని  సమృద్ధిగా ఉన్న టమోటా జుట్టును మెరిసేలా, మృదువైనదిగా మరియు ఆరోగ్యకరంగా ఉంచడానికి బాగా పనిచేస్తుంది.


చక్కెరవ్యాధికి టమాటా 

సహజంగా రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఆహారంలో టమోటాల్ని చేర్చుకోవచ్చును . టమోటాస్ క్రోమియం అని పిలువబడే ఖనిజాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖనిజం  రక్తంలో చక్కెరను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. ఒక పరోక్ష-ప్రయోగాత్మక అధ్యయనంలో, 32 టైప్ 2 చక్కెరవ్యాధి రోగులచేత 8 వారాలపాటు రోజుకు 200 గ్రా.ల ముడి టమోటాని సేవింపజేశారు. అధ్యయనం చివరలో రక్తపోటులో గణనీయమైన తగ్గుదల కూడా  కన్పించింది. అందువల్ల, రోజువారీగా ముడి టమోటోల వినియోగం డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ప్రభావవంతంగా  కూడా ఉంటుంది. 


టమాటా క్యాన్సర్‌ను నిరోధిస్తుంది 

ప్రపంచంలో సంభవించే మరణాలకు క్యాన్సర్.  రెండవ అతి పెద్ద కారణం మరియు రాను రాను ఈ మారణాంతక వ్యాధి అతి  సాధారణ వ్యాధిగా మారుతోంది. అసాధారణమైన కణాలు అనియంత్రిత మార్గాల్లో విభజన అయినపుడు క్యాన్సర్ సంభవిస్తుంది. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, లింఫోమా, మొదలైనవి క్యాన్సర్ లో అనేక రకాలుగా ఉండవచ్చును  - సరైన ఆహారాన్ని తినడంవల్ల  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. టొమాటోలు క్యాన్సర్ ప్రమాద కారకాల్ని తగ్గించడంలో సహాయపడే ఆహారాలలో ఒకటి. లైకోపీన్ కెరోటినాయిడ్ కుటుంబానికి చెందినది.  ఇది టమోటాలలో సమృద్ధిగా ఉంటుంది. 

లైకోపీన్ ఒక బలమైన ప్రతిక్షకారిణి అని, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని నమ్మబడుతోంది. టమోటాలో ఉండే మొత్తం కెరోటినాయిడ్లలో దాదాపు 90% వరకు లైకోపీన్ ఒకటే ఉంటుంది. ఎలక్ట్రానిక్ శోధనలు MEDLINE, EMBASE, మరియు కంట్రోల్డ్ ట్రయల్స్ డేటాబేస్‌ల కోచ్రేన్ సెంట్రల్ రిజిస్టర్లో కూడా  నిర్వహించబడ్డాయి.

మహిళపై నిర్వహించిన ఓ క్లినికల్ అధ్యయనం ప్రకారం టొమాటోల్లో అధిక మోతాదులో కనిపించే కరోటినాయిడ్స్ యొక్క అధిక సాంద్రత రొమ్ము క్యాన్సర్ విరుద్ధంగా రక్షణ కూడా  కల్పిస్తుంది.


ఆరోగ్యకరమైన గుండెకు టమాటా 

గుండె కండరాలకు సంబంధించిన (కార్డియోవస్కులార్) వ్యాధుల్లో గుండెపోటు  మరియు స్ట్రోక్ లు ఉన్నాయి.  నేడు ఈ వ్యాధులకు సంబంధించిన వైద్యకేసులు పెరుగుతున్నాయి. ప్రజల ఆహారపు అలవాట్లు రోజువారీ మార్పులతో, గుండె వ్యాధులు  రావడానికి అవకాశాలు కూడా  పెరుగుతున్నాయి. సాధారణంగా, చాలామంది గుండెపోటుకు దారితీసే ధోరణిని కలిగి ఉన్న అధిక కేలరీల ఆహారాలు తినడానికే మొగ్గు చూపుతారు. 

టమోటాల్లో లైకోపీన్ ఉనికి గుండె వ్యాధుల అవకాశాలను తగ్గిస్తుంది. లైకోపీన్ కణాంతరాల్లోని మొత్తం కొవ్వుల్ని (కొలెస్ట్రాల్‌ను) తగ్గించడంలో కూడా  సహాయపడుతుంది. లైకోపీన్ మరియు టమోటా లతో తయారు చేయబడ్డ ఆహార ఉత్పత్తులు ప్లాస్మా మొత్తం కొలెస్ట్రాల్‌ను (plasma total cholestero6), LDL (చెడు కొలెస్ట్రాల్)ను  తగ్గిస్తాయి.  అధిక ప్రోటీన్ లిపోప్రొటీన్లను (మంచి కొలెస్ట్రాల్) పెంచుతాయి. ప్రయోగాత్మక ఫలితం ప్రకారం, లైకోపీన్ మరియు ఇతర టమోటా ఉత్పత్తులతో కూడిన ఆహారపు భర్తీల ( dietary supplementation)ను సేవింపజేసే సమయం మరియు మోతాదు ఆధారంగా  ప్లాస్మా LDL ను  కూడా తగ్గిస్తాయి


రోగనిరోధకత కోసం టమాటా 

టొమాటోలు శరీరం శక్తివంతంగా మరియు ఆరోగ్యకరంగా ఉండడానికి సహాయపడతాయి. టమోటా రసం తాగడంవల్ల జలుబు మరియు ఫ్లూ (జ్వరం) కు వ్యతిరేకంగా  కూడా పనిచేస్తుంది.  మన శరీరంలో ఒక రక్షణ వలయాన్ని నిర్మిస్తుంది. ఈ సాధారణ అనారోగ్యాలు కారోటెనోయిడ్ల లోపం మరియు లైకోపీన్ మరియు బీటా-కెరోటిన్ తక్కువగా ఉండటం వల్ల సంభవిస్తుంటాయని నమ్ముతారు.  టమోటాల్ని తినడం ద్వారా ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చును .


ఆస్త్మాకు (ఉబ్బసానికి) టమాటా 

ఆస్పత్రి నుండి విడుదలైన ఆస్త్మా రోగికి టమోటా ఓ తాజా సూపర్‌ఫుడ్ గా పనిచేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, టమోటాల నుండి లభించే అనామ్లజనకాలు వ్యక్తి సాధారణ జలుబు కారక సూక్ష్మజీవికి గురైనప్పుడు మన శరీరం చాలా బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను  కలిగివుండటానికి కూడా  సహాయపడతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం సేవించడమంటే ఆస్త్మాప్రాబల్యతను తగ్గించుకోవడమే నన్నమాట. తక్కువ యాంటీఆక్సిడెంట్ ఆహారం సేవించడంవల్ల ప్లాస్మా కెరోటినాయిడ్ సాంద్రతలు క్షీణించడం వలన ఆస్తమా పెరగడ్డానికి  కూడా కారణమవుతుంది.


టమాటా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

టమోటాలో 95% నీరు మరియు మిగిలిన 5% ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్లను కల్గి ఉంటుంది. అందువలన, టమోటా నీరు మరియు ఫైబర్ యొక్క గొప్ప ఒనరు. ఈ రెండు పోషకాలు జీర్ణశక్తిని మెరుగుపర్చడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆహార పీచుపదార్థాలు (ఫైబర్) మలం సమూహాన్ని మరియు దాని రవాణా సమయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మలబద్ధకం సమస్య పెద్దలలో చాలా సాధారణంగా ఉంటుంది .  యువకులు కూడా ఈ రోజుల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కేవలం ఒక టమోటా తినడంతోనే మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. పరిశోధనలో తేలిందేమంటే ఆహారపీచుపదార్థాల కారణంగా కూరలు, ఇతర వంటకాదుల్లో టమోటా వాడకంవల్ల మనిషి ఆరోగ్యం  కూడా మెరుగుపడుతుంది.


టమాటా యొక్క దుష్ప్రభావాలు 

టొమాటోలు స్వభావంలో అత్యంత ఆమ్ల తత్వాన్నికల్గిఉంటాయి.  ఇవి గుండెల్లో మంటలను కలిగిస్తాయి. సిట్రిక్ యాసిడ్ ను సమృద్ధంగా కల్గిన టమోటాలు అధిక గ్యాస్ట్రిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. పచ్చి టమోటాలే కాదు ఉడికించిన టమోటాలు కూడా గుండెల్లో మంటలు కల్గించడానికి దారి తీయవచ్చు. 

సలాడ్లలో ముడి టమోటాలు ఎల్లప్పుడూ చేర్చబడతాయి మరియు టమాటాలు రోజువారీ వినియోగంలో తప్పనిసరిగా ఉండడంవల్ల యాసిడ్ పరిమాణాన్ని కూడా  పెంచుతుంది, ఇది జీరో-ఓసోఫాగల్ రిఫ్లక్స్‌గా పిలిచే ఒక పరిస్థితిని ఏర్పరుస్తుంది. అయితే, ఇది చాలా సాధారణ దృగ్విషయం కాదు.
టమోటాలు విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలలో పుష్కలంగా ఉంటాయి.  అయితే  చర్మంపై అలెర్జీలు , దద్దుర్లు మరియు దద్దుర్లకు కారణం కావచ్చును  . టమోటోలో హిస్టమైన్ అనే సమ్మేళనం ఉంటుంది.  అది అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. దురద , వాపు, కనుబొమ్మలు మరియు కనురెప్పల చుట్టూ ఎరుపు మచ్చల వంటి అలెర్జీ ప్రతిచర్యలు టమోటో దుష్ప్రభావాలకు లోనైనవారిలో కలిగే సాధారణ సంఘటనలు. కొన్నిసార్లు మెరిసే చర్మం పొందడానికి, టమోటాల్ని నేరుగా చర్మంపై రాయడం, రుద్దడం జరుగుతుంది. కానీ అలా చేయడానికి ఉపయోగించినవి చెడు టమోటాలు అయితే అవి పేర్కొన్నఅలెర్జీ ప్రతిచర్యలకు దారి తీయవచ్చును .   
మూత్రపిండాలు రక్తం వడపోత మరియు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో మనకు సహాయం చేస్తాయి. ఏదైనా ఒకటి లేదా రెండు మూత్రపిండాలలూ తగినంతగా రక్తం నుండి వ్యర్థాన్ని ఫిల్టర్ చేయగల సామర్థ్యాన్ని కోల్పోతే, కిడ్నీ సమస్యలు సంభవిస్తాయి. ఆరోగ్యం మరియు మానవ సేవల శాఖ, USA ప్రకారం, ఒక వ్యక్తి ఇప్పటికే మూత్రపిండ రుగ్మతతో బాధపడుతున్నట్లయితే, అలాంటివారు టమోటాలను సేవించడాన్ని పరిమితం చేయవలసి ఉంటుంది.  


ఎందుకంటే టమాటో మూత్రపిండాల్లో రాళ్ళు (కాల్షియం ఆక్సాలెట్ రాళ్ళు) ఏర్పడేదానికి  కారణమయ్యే ఆక్సిలేట్ని ఎక్కువగా కలిగి ఉంటుంది . టమోటాతో తయారైన ఏ రకమైన ఉత్పత్తిని అయినా సరే మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి  కూడా తినకూడదు.


టమోటాలో ఉన్న హిస్టామైన్ అనే సమ్మేళనం శరీర కణజాలంలోకి విడుదల చేయబడినప్పుడు, అది కీళ్ళ నొప్పికి కూడా  దారితీస్తుంది. టొమాటోల్లో సోలానిన్ అని పిలువబడే ఆల్కలాయిడ్లు కూడా ఉన్నాయి.  ఇవి కండర కణజాలంలో కాల్షియంను  నిర్మించి మంటను కలిగిస్థాయి అందువలన, ఇది కొంతమందిలో కీళ్ళనొప్పులు -వంటి పరిస్థితులను కూడా కలిగిస్తుంది .

ఉపసంహారం 

టమోటాలు విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం మొదలైన వాటికి ఓ గొప్ప ఒనరుగా ఉన్నాయని మనకిపుడు తెలుసు. తినడానికి సులభమైనవి మరియు ఆరోగ్యకరమైన కూరగాయలలో టొమేటోను ఒకటిగా వర్గీకరించవచ్చు. ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్గి ఉంది. టమోటాలో  ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ, అది మన శరీరానికి అవసరమైన ప్రతిదీ అందించలేదు. ప్రతి పండు దానికే సొంతమైన ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఉన్నట్లే టొమేటోకూ ఉన్నాయి. అయినప్పటికీ, మీరు మీ ఆహారంలో టొమేటోని చేర్చడానికి సంకోచించకూడదు.

0/Post a Comment/Comments

Previous Post Next Post