ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి (ఫుల్లర్స్ ఎర్త్) ప్రయోజనాలు

ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి (ఫుల్లర్స్ ఎర్త్) ప్రయోజనాలు 


ముల్తానీ మట్టి ఏమిటి?


ముల్తానీ మట్టి లేదా ఫుల్లర్స్ ఎర్త్ (fuller's earth) పాకిస్థాన్ లోని ముల్తాన్ నుండి వస్తుంది. భారతదేశంలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తునప్పటికీ, మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ముల్తానీ మట్టి నిజానికి బెంటోనైట్ క్లే (అగ్నిపర్వతం నుండి వచ్చే బూడిద నుండి ఏర్పడిన మట్టి), దీనిని కాల్షియం బెంటోనైట్ అని  అంటారు. ఇది చాలా ఖరీదైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఒక ముఖ్యమైన భాగం.


శాస్త్రీయంగా చెప్పాలంటే, ఫుల్లర్స్ ఎర్త్ అనేది అల్యూమినియం సిలికేట్‌తో తయారు చేయబడిన ఒక రకమైన మట్టి.  దీనిలో కాల్షియం, సోడియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అయినప్పటికీ, యూ.యస్ (U.S) డిపార్ట్మెంట్ అఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం, ముల్తానీ మట్టి యొక్క కణాలు బంకమట్టి కణాల కంటే చాలా చిన్నగా ఉంటాయి మరియు సరిగ్గా బంకమట్టిలా మెత్తగా ఉండవు. ముల్తానీ మట్టి వేరే ఇతర బంకమట్టిల కంటే ఎక్కువ నీరును నిలుపుకుంటుంది మరియు అందువలన అది హైడ్రేటింగ్ మరియు మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది.


పురాతన కాలం నుంచి ముల్తానీ మట్టి గురించి మరియు ముల్తానీ మట్టి యొక్క అద్భుత లక్షణాల గురించి మానవులకు తెలుసు. గ్రీస్ మరియు సైప్రస్ దేశస్తులు ఈ మట్టిని బట్టలు కోసం బ్లీచింగ్ ఏజెంట్‌గా వాడినట్లు మొట్టమొదటి రికార్డులు ఉన్నాయి.  ఇది ఇక్కడ సుమారుగా 5000 సంవత్సరాల క్రితం ఉపయోగించబడింది. "ఫుల్లర్స్" అనే పేరు లాటిన్ పదం "ఫులో" నుంచి వచ్చింది, అంటే "బట్టలు నుండి నూనె మరకలను తొలగించే పని చెయ్యడం" అని అర్ధం. పురాతన బాబిలోనియాలో పలు సౌందర్య మరియు వైద్య చికిత్సలతోని మందుల తయారీలో ఇది ఉపయోగించబడింది.


ఈ రోజు, ముల్తానీ మట్టి దాదాపు ప్రతి పరిశ్రమలో చోటును సంపాదించింది.  ఉదాహరణకు కాస్మెటిక్ పరిశ్రమ, కాగితపు  పరిశ్రమ, వ్యవసాయం, డ్రై క్లీనింగ్, డైయింగ్ (డైలు తయారు చేయడం), నీటి శుద్దీకరణ, కర్మాగారాలు లేదా ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అనేక  రకాలు .


మీకు తెలుసా?


ఫుల్లర్స్ ఎర్త్ ని బ్లీచింగ్ ఏజెంట్‌గా మాత్రమే కాకుండా, బంకమట్టి పాత్రలు (పింగాణీ) మరియు సౌందర్య సాధనాల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. దీనిని మట్టి స్నానం (mud bath) కొరకు కొంతమంది ఆదిమవాసులు కూడా వాడుతుంటారు.  ఇది ఒక డిటాక్స్ ఏజెంట్ లా మాత్రమే శరీరరీనికి ఉపశమనాన్ని కూడా చేసురుస్తుంది.


 • ముఖం మరియు చర్మం కోసం ముల్తానీ మట్టి ప్రయోజనాలు -
 • ముల్తానీ మట్టిని తీసుకోవడం 
 • ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ తయారీ
 • ముల్తానీ మట్టి దుష్ప్రభావాలు 


ముఖం మరియు చర్మం కోసం ముల్తానీ మట్టి ప్రయోజనాలు 

ముల్తానీ మట్టి వలన చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  ఇది చర్మం నుండి మురికి మరియు నూనెను తొలగించడమే కాక, చర్మానికి ఒక ప్రకాశవంతమైన మెరుపును కూడా అందిస్తుంది. .


చర్మం నుండి అదనపు జిడ్డును తొలగిస్తుంది: ముల్తానీ మట్టిని పారంపర్యంగా జిడ్డుగల చర్మం వలన కలిగే సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ఇది చర్మం మీద నూనె ఉత్పత్తిని తగ్గించకపోయినా, అదనపు నూనెను తొలగిస్తుంది తద్వారా మృదువైన మరియు నిర్మలమైన చర్మాన్ని కూడా  అందిస్తుంది.


మొటిమలను తగ్గిస్తుంది: ముల్తానీ మట్టి శక్తివంతమైన యాంటీబాక్టీరియాల్ లక్షణాలను చూపుతుందని నిరూపించబడింది.  ఇది మోటిమల వలన కలిగే నొప్పి మరియు మోటిమల చుట్టూ ఉండే వాపును తగ్గించడంలో ప్రభావవంతముగా కూడా  ఉంటుంది. చర్మం నుండి  అదనపు  నూనెను/జిడ్డును శోషించడం ద్వారా ఇది మొటిమలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.


ఒక సహజ ఎక్సఫోలీయేటర్: ముల్తానీ మిట్టి మృదువైన మట్టి కణాల నుంచి తయారవుతుంది, అవి దీనిని ఒక అద్భుతమైన ఎక్సఫోలీయేటింగ్ (చర్మం పై పొరల నుండి మూత్రకణాలను తొలగించడం) ఏజెంట్‌గా చేస్తాయి. ఇది చర్మం రంధ్రాలకి దగ్గరగా వెళ్లి మృత చర్మ కణాలను లోతుగా శుద్ది బాగా  చేస్తుంది.


ముడుతలను తొలగిస్తుంది: ముల్తానీ మట్టితో తయారు చేసిన ప్యాక్ ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేసి ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడం ద్వారా చర్మ కణాలలో వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది చర్మం మీద నలుపు మచ్చలను తగ్గిస్తుంది మరియు మీ చర్మం కింద రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది .  చర్మం యవ్వనంగా మరియు నిగారింపుతో కూడా కనిపిస్తుంది.


 • మెరిసే చర్మం కోసం ముల్తానీ మట్టి ప్యాక్ 
 • ముల్తానీ మట్టితో జిడ్డు చర్మాన్ని వదిలించుకోవచ్చుu
 • ముల్తానీ మట్టి మోటిమలు నుండి ఉపశమనం కలిగిస్తుంది 
 • ముల్తానీ మట్టితో మృత చర్మ కణాలను తొలగించవచ్చు 
 • ముడుతలు తొలగించడానికి ముల్తానీ మట్టి 

మెరిసే చర్మం కోసం ముల్తానీ మట్టి ప్యాక్ 

మీకు మెరిసే చర్మం కావాలా? అప్పుడు, ఒక ముల్తానీ మట్టి ప్యాక్ ఉపయోగించండి. ఇంట్లో మీరు సులభంగా తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది.


ముల్తానీ మట్టి ఒక అద్భుతమైన హైడ్రేటింగ్ ఏజెంట్. ఇది ప్యాక్ నుండి నీరును నిలుపుకుని మీ చర్మానికి అందిస్తుంది దీని ద్వారా సహజమైన మీకు మెరుపు లభిస్తుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే కాల్షియం మరియు కోబాల్ట్ వంటి ఖనిజాలు మీ చర్మానికి పోషణను అందించడంలో కూడా సహాయపడతాయి.


ఉత్తమ ప్రయోజనాలు కోసం, ముల్తానీ మట్టిలో కొంచెం రోజ్ వాటర్ మరియు కొద్దిగా నిమ్మరసం పిండవచ్చును , అప్పుడు అది డి-టానింగ్ పేస్ మాస్క్ గా పనిచేస్తుంది. ఎండ వలన ఏర్పడిన టెన్ ను కూడా తొలగిస్తుంది.


ముల్తానీ మట్టితో జిడ్డు చర్మాన్ని వదిలించుకోవచ్చు 

చర్మం జిడ్డుగా మారడం అనేది చర్మంలో ఉండే నూనె/తైల గ్రంధుల అధిక చర్య కారణంగా ఏర్పడే ఒక సాధారణ సమస్య. ఇది సాధారణంగా హార్మోన్ల మార్పులతో ముడి పడి ఉంటుంది, కానీ జిడ్డు చర్మం యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. అనేక బ్రాండ్లు జిడ్డుగల చర్మం కోసం సౌందర్య చికిత్స విధానాలను ప్రారంభించాయి.  కానీ ఎటువంటి దుష్ప్రభావాలు లేని సహజ ఉత్పత్తి ఉండగా రసాయనాల ఆధారిత సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం ఎందుకు. ముల్తానీ మట్టి జిడ్డు చర్మం కోసం ఒక గృహ చిట్కాగా కూడా ఉపయోగించబడుతోంది. ఇది ఒక బైండింగ్ ఏజెంట్‌గా, చర్మపు రంధ్రాలలో ఉన్న అదనపు నూనెను కూడా  తొలగిస్తుంది.


జిడ్డు చర్మం కోసం ముల్తానీ మట్టిని ఉపయోగించటానికి, ఇంట్లోనే పాలు మరియు టమోటాతో ముల్తానీ మట్టీని కలిపి పేస్‌మాస్క్ తయారు చేసుకోవచ్చును . చర్మం మీద సమానంగా దానిని పూసి/రాసి మరియు అది ఆరిన తర్వాత కడిగివేయడం ద్వారా జిడ్డు చర్మ సమస్యను వదిలించుకోవచ్చును .


ముల్తానీ మట్టి మోటిమలు నుండి ఉపశమనం కలిగిస్తుంది 

మోటిమలు లేదా పింపుల్స్ 12 నుండి 30 ఏళ్ళ వయస్సులో ఉన్న వారికీ సంభవించే ఒక సాధారణ సమస్య. హార్మోన్ల అసమతౌల్యతతో బాధపడే కౌమార దశలోని వారిలో ఇవి ఎక్కువగా సంభవిస్తాయి. మొటిమల యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు; హార్మోన్ల మార్పులు, పి.యాక్నేస్ (P.acnes) అనే బాక్టీరియా మరియు జన్యుమార్పులు వంటివి మొటిమల సమస్యతో ముడిపడి ఉంటాయి. వైట్ హెడ్స్ (White-heads) మరియు బ్లాక్ హెడ్స్ (black-heads) కూడా మోటిమలలో ఒక సాధారణ రకం. మోటిమలతో బాధపడుతున్న వారికి ముల్తానీ మట్టి వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముందుగా, ఇది ఒక వాణిజ్యపరమైన మోటిమల చికిత్స వలె పనిచేస్తుంది మరియు చర్మం నుండి అదనపు నూనె (జిడ్డు) తొలగిస్తుంది, ఈ జిడ్డు వెంట్రుకల రంధ్రములో నిలిచిపోతుంది మరియు బాక్టీరియా పెరుగుదలకు ప్రధాన కారణమవుతుంది. అదనంగా, ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది, ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది, దీని వలన మోటిమలు నివారించబడతాయి.


కలబంద గుజ్జు , పసుపు, మరియు టమాటా గుజ్జు ముల్తానీ మట్టితో కలిపి ఇంట్లోనే ఒక సులభమైన మొటిమల కోసం ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చును . ఇది మొటిమల చుట్టూ ఉండే వాపును తొలగిస్తుంది, అలాగే ఒక స్వచ్ఛమైన మెరుపును ఇస్తుంది.


ముల్తానీ మట్టితో మృత చర్మ కణాలను తొలగించవచ్చు 

మన చర్మం పై పొర నిరంతరం యూవి (UV) కిరణాలు మరియు కాలుష్యం వంటి హానికరమైన పర్యావరణ కారకాలకు గురవుతూవుంటుంది. వాతావరణ పరిస్థితులు లేదా తేమలో మార్పుల వలన మన చర్మం సులభంగా ప్రభావితం అవుతుంది. చలికాలం సాధారణంగా చర్మానికి పొడిగా ఉంటుంది. అదృష్టవశాత్తూ, కాలానుగుణంగా మన చర్మం దాని బాహ్య కణాలను (outer cells) తొలగిస్తూ వాటి స్థానంలో కొత్త కణాలను ఏర్పరుస్తుంది/పునరుద్ధరిస్తుంది. అయితే అన్ని కణాలు ఒకేసారి షెడ్ కావు (రాలవు).

కాలక్రమేణా మరియు వయస్సుతో పాటు, చర్మానికి గల ఈ సహజ లక్షణం తగ్గిపోతుంది, ఇది మృత చర్మ కణాలు చర్మం మీద పోగుపడడానికి కూడా దారితీస్తుంది. మృత చర్మం తరచుగా పొడిబారి మరియు పొరలాగా కనిపిస్తుంది తద్వారా చర్మానికి ఉండే మెరుపుని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా, ఎక్సఫోలియేటింగ్ ఫేస్ మాస్కులు మరియు స్క్రబ్బులను ముఖం మీద నుండి మృత  చర్మ కణాల తొలగించడానికి ఉపయోగిస్తారు. ముల్తానీ మట్టి చాలా చిన్న మట్టి కణాలతో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఎక్సఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అలాగే, చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మం పొడిబారడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.


ముల్తాని మట్టిలో నిమ్మకాయ తొక్కలు మరియు తేనెతో కలిపితే, చర్మం కోసం ఒక ఎక్సఫోలియేటింగ్ ఫేస్ మాస్క్ / స్క్రబ్ తయారు అవుతుంది.


ముడుతలు తొలగించడానికి ముల్తానీ మట్టి 

వయసు పెరిగే కొద్దీ (వృద్ధాప్యం వచ్చే కొద్దీ), చర్మం ఎలాస్టిసిటీకీ (elasticity) బాధ్యత వహించే కొల్లాజెన్ మరియు ముఖ్యమైన ప్రోటీన్లను కోల్పోవడం మొదలవుతుంది. ఇది చర్మంపై గీతలు మరియు ముడుతల అభివృద్ధి కూడా దారితీస్తుంది. ఒత్తిడి మరియు ధూమపానం వంటి జీవనశైలి కారకాలు అకాల వృద్ధాప్య లక్షణాలను కలిగిస్తాయి. అనేక యాంటీ-ఏజింగ్  క్రీములు దుష్ప్రభావాలు కలిగిస్తాయి కాబట్టి, ముల్తానీ మట్టి లేదా ఫుల్లర్స్ ఎర్త్ ఆ క్రీములకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చెయ్యడమే కాక చర్మ కణాల క్రింద రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా చేయబడిన కణజాలానికి పోషకాలు మరియు ఆక్సిజన్ కూడా బాగా సరఫరా అవుతుంది చర్మం మరింత యవ్వనంగా  కూడా  కనిపిస్తుంది.

అదనంగా, ఫుల్లర్స్ ఎర్త్ సెలీనియం వంటి కొన్ని ఖనిజాలను కలిగి ఉంటుంది, ఇది సహజంగా శరీరం యొక్క యాంటీయాక్సిడెంట్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది. ఇది ఇబ్బందికరమైన పెద్ద వయసు  సంకేతాలను కూడా  తొలగిస్తుంది. ఇది ముదురు మచ్చలు, గీతలు మరియు వంటి పెద్ద వయసుతో ముడిపడి ఉండే ఇతర చర్మ సమస్యలకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది.

ముల్తానీ మట్టిలో తేనె, గంధపు పొడి, మరియు పాలు కలిపి ఇంటిలోనే యాంటీ-ఏజింగ్  ప్యాక్‌ను తయారుచేయవచ్చు

ఆసక్తికరంగా, కొందరు యాంటిఆక్సిడెంట్ ప్రయోజనాల కోసం  ఫుల్లర్స్ ఎర్త్ ఓరల్ గా తీసుకుంటారు (తింటారు).


జుట్టు కోసం ముల్తానీ మట్టి ప్రయోజనాలు

ముల్తానీ మట్టి యొక్క హైడ్రేటింగ్ మరియు శుద్ది ప్రయోజనాలు నెత్తి (స్కాల్ప్) మరియు జుట్టుకు కూడా విస్తరించాయి. మీ జుట్టుకు మెరుపును ఇవ్వడమే కాక, మీకు ఆరోగ్యకరమైన నెత్తి (స్కాల్ప్) ని కూడా అందిస్తుంది.

పొడి స్కాల్ప్ సమస్యలను  తగ్గిస్తుంది: హైడ్రేటింగ్ ఏజెంట్ కావడంతో, ముల్తానీ మట్టి నెత్తికి  తేమను అందించి, స్కాల్ప్ పొడిబారడాన్ని మరియు పొలుసులుగా మారడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

చుండ్రును నిరోధిస్తుంది: ముల్తానీ మట్టి  ప్యాక్‌ను క్రమమంగా తలకు వేసుకుంటే దాని యొక్క యాంటీ బాక్టీరియల్ మరియు హైడ్రేటింగ్ ప్రభావాలు చుండ్రుని తగ్గించి మరియు  నిరోధిస్తాయి. ఇది మీ స్కాల్ప్‌లో రక్త ప్రసరణను  బాగా  మెరుగుపరుస్తుంది, తద్వారా నెత్తి మీదకు ఎక్కువ యాంటీబాడీలు చేరేలా చేస్తుంది, ఇవి డెర్మటోఫైట్స్ (తల మీద వ్యాపించే ఒక మూడు రకాల ఫంగస్) యొక్క పెరుగుదలను అడ్డుకుంటాయి.

జిడ్డుగా ఉండే స్కాల్ప్ కోసం ప్రయోజనాలు: ముల్తానీ మట్టీ స్కాల్ప్ మీద నుండి అదనపు నూనెను/జిడ్డును గ్రహిస్తుంది మరియు తద్వారా జుట్టుకు అవసరమైన హైడ్రేషన్ మరియు పోషకాలను అందిస్తుంది. ఇది మీ తలపై బ్యాక్టీరియల్ లోడ్/సంఖ్యను కూడా తగ్గిస్తుంది.

 • డ్రై (పొడిబారిన) స్కాల్ప్ కోసం ముల్తానీ మట్టి 
 • జిడ్డుగల జుట్టు కోసం ముల్తానీ మట్టి 
 • ముల్తానీ మట్టి చుండ్రుని తగ్గిస్తుంది 

డ్రై (పొడిబారిన) స్కాల్ప్ కోసం ముల్తానీ మట్టి 

కాలుష్యం మరియు వాతావరణం వంటి కారకాలు వలన నెత్తి (స్కాల్ప్) పొడిబారడం మరియు పొరలుగా మారడం అనేది సహజమైన చర్మ పరిస్థితి. స్కాల్ప్ పొడిబారేలా ప్రేరేపించడంలో ఈ కారకాలు కూడా కారణం కావచ్చు. ఇంకా, కొన్ని షాంపూలు కూడా స్కాల్ప్ పొడిబారేలా పరిస్థితులతో ముడి పడి ఉంటాయి.

పారంపరంగా,  ముల్తానీ మట్టి వివిధ జుట్టు సంరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ముల్తానీ మట్టి యొక్క హైడ్రేటింగ్ లక్షణాలు నెత్తి మరియు జుట్టుకు తేమను అందించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది స్కాల్ప్‌కు తగినంత రక్త ప్రసరణ లభించేలా కూడా చేస్తుంది, దీని వలన మరిన్నీ పోషకాలను పొందవచ్చు మరియు జుట్టు యొక్క సహజ మెరుపును తిరిగి పొందవచ్చు.

మీకు తిన్నగా ఒంపులు లేని (straight) జుట్టును ఇష్టమైతే, ముల్తానీ మట్టిలో పెరుగు, గుడ్డు తెల్ల సొన మరియు కొన్ని చుక్కల నిమ్మ రసం కలిపి జుట్టుకి ప్యాక్ తయారు చేయవచ్చు. మీరు గుడ్డు ఉపయోగించకూడదనుకుంటే తేనె మరియు పిండి వాడవచ్చు.


జిడ్డుగల జుట్టు కోసం ముల్తానీ మట్టి 

డ్రై స్కాల్ప్ సమస్యను తగ్గించడంలో సహాయంచేయ్యడమే కాక, ముల్తానీ మట్టి జిడ్డుగల జుట్టుకు కూడా మంచిది. దీనిని సరిగ్గా ఉపయోగించినప్పుడు, ఇది వెంట్రుకల ఫోలికల్స్ నుండి అదనపు నూనెను తొలగించి మరియు మీ స్కాల్ప్ కు అవసరం అయిన హైడ్రేషన్‌ను అందిస్తుంది. ఇది మీ జుట్టు మీద అదనంగా ఉండే జిడ్డును తగ్గిస్తుంది.


అంతేకాక, ఇది ఒక ఎక్సఫోలియన్ట్ మరియు యాంటీ బాక్టీరియల్ గా, జుట్టు నుండి ధూళి/మురికి మరియు బ్యాక్టీరియాను తొలగిస్తుంది, తద్వారా మీరు తేలిక భావనను కలిగిస్తుంది.


జిడ్డుగల జుట్టు సమస్య కోసం ముల్తానీ మట్టి  యొక్క ప్రయోజనాలను పొందేందుకు, పెరుగు, గుడ్డు తెల్ల సొన, మరియు కలబంద గుజ్జుతో ముల్తానీ మట్టిని కలపవచ్చును . ఇది జుట్టు నుండి అదనపు నూనెను తీసివేయడంలో సహాయపడుతుంది మరియు జుట్టు మరింత నునుపుగా కనిపించేలా కూడా చేస్తుంది.


ముల్తానీ మట్టి చుండ్రుని తగ్గిస్తుంది 

చుండ్రు అనేది నెత్తి మీద చిన్న చిన్న పొలుసులను కలిగించే ఒక సాధారణ సమస్య. ఇప్పటివరకు చుండ్రు యొక్క ఖచ్చితమైన కారణాల గురించి ఎటువంటి ఆధారాలు లేవు, కాని కొన్ని అధ్యయనాలు ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా చుండ్రు సంభవించవచ్చని సూచిస్తున్నాయి. ముల్తానీ మట్టిని జుట్టుకు పట్టించడం వలన నెత్తి మీద రక్త ప్రసరణ పెంచి ఎక్కువ యాంటీబాడీలను స్కాల్ప్ దగ్గరకు తీసుకురావడంలోబాగా  సహాయపడుతుంది. కాబట్టి ఇది ఫంగస్ వలన ఏర్పడిన చుండ్రును తగ్గించడం సహాయపడవచ్చు.

ఉసిరి, గ్రీన్ టీ మరియు పిప్పరమింట్ వంటి యాంటిమైక్రోబయాల్ పదార్థాలు ముల్తానీ మట్టిలో కలిపి దాని చుండ్రును నివారించే ప్రయోజనాలను పెంచవచ్చు.

ముల్తానీ మట్టిని తీసుకోవడం 

సహజ బంకమట్టిని శరీరానికి అది కలిగించే ప్రయోజనాలు కోసం సేవిస్తారనేది ఒక తెలిసిన ఉంది. ఇది ఒక శక్తివంతమైన డిటాక్సిఫయింగ్ ఏజెంట్‌గా, ఒక యాంటీ- డైయేరియాల్ ఏజెంట్‌గా నివేదించబడింది మరియు దీనిని మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు. అయినప్పటికీ, చాలా పరిశోధనలు కాల్షియం బెంటోనైట్ యొక్క వివిధ భౌగోళిక మూలం పరంగా సూచించబడ్డాయి.

అఫ్లాటాక్సిన్స్ (Aflatoxins) అనేవి ఒక రకమైన ఫంగల్ టాక్సిన్స్ కలుషితమైన ఆహారం ద్వారా ఇవి మన శరీరంలోకి చేరి కాలేయ నష్టం మరియు క్యాన్సర్ ను కూడా కలిగించవచ్చు. ఇవి (అఫ్లాటాక్సిన్స్) అనేక ఆహారపదార్ధాల నుండి వ్యాపించే ఫంగస్ల నుండి ఉత్పత్తి అవుతాయి, కాని ఆస్పర్జిల్లస్(Aspergillus) అనేది మానవులు మరియు జంతువులలో అఫ్లాటాక్సిన్స్ పోయిజనింగ్కు అత్యంత సాధారణ కారణం.


కాల్షియం బెంటోనైట్ లేదా ముల్తానీ మట్టి ప్రేగులు అఫ్లాటాక్సిన్‌ను గ్రహించడాన్ని నివారిస్తుంది, తద్వారా అఫ్లాటాక్సిన్ పోయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇటీవలి మానవ విచారణ (హ్యూమన్ ట్రయిల్) ప్రకారం, కాల్షియం బెంటోనైట్ పిల్లలకు రోజుకు 1.5 గ్రాముల మోతాదులో 2 వారాలపాటు క్రమం తప్పకుండా ఇస్తే మంచిదని తెలిసింది. అంతేకాక పిల్లలలో బెంటోనైట్ క్లే యొక్క వినియోగం అఫ్లాటాక్సిన్-సంబంధిత పెరుగుదల లోపానికి (aflatoxin-associated growth stunting) వ్యతిరేకంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నివేదించబడింది.

అయినప్పటికీ, కాల్షియం బెంటోనైట్ను ఓరల్ సప్లిమెంట్‌గా  ఉపయోగించడం యొక్క భద్రతను నిర్ధారించడానికి ఇంకా ఎక్కువ పరిశోధన అవసరమవుతుంది.


ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ తయారీ 

చర్మం మరియు జుట్టు కోసం ముల్తానీ మట్టి యొక్క ఈ ప్రయోజనాలను పరిగణించి, ఈ మట్టి నుండి అత్యధిక ప్రయోజనాలను పొందేందుకు అనేక ప్యాక్‌ల తయారీ విధానాలు పరీక్షించబడ్డాయి. "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ ఫార్మసీ" లో ప్రచురితమైన ఒక తయారీ విధానం ఈ క్రింద పేర్కొనబడింది.


దీనికి ఏమి కావాలి:

 • ముల్తానీ మట్టి 30 గ్రా
 • కలబంద గుజ్జు  15 గ్రా
 • పసుపు 5 గ్రా
 • జాజికాయ 5 గ్రా
 • వేపాకు 8 గ్రా
 • కమలా తొక్క 12 గ్రా
 • గంధపు చెక్క 25 గ్రా

సూచనలను

 • ఒక గిన్నెలో పొడి పదార్థాలు (జాజికాయ, వేప, మల్టినీ మట్టి మరియు పసుపు) తీసుకోండి.
 • కమలా/నారింజ పై తొక్కను నూరి మరియు దానిని పొడి పదార్ధాలకు చేర్చండి.
 • కలబంద గుజ్జు మరియు రోజ్ వాటర్‌ను వాటికీ కలపండి.
 • పేస్ట్ లా  మారే వరకు దానిని బాగా కలపండి.
 • చర్మంపై ఆ పేస్ట్ ను రాసి/పూసి మరియు దానిని సుమారు ఒక 20 నిముషాల పాటు ఉంచండి.
 • చల్లని నీటితో మీ ముఖం కడగండి
 • పదార్థాల యొక్క మిశ్రమం పరిశోధన ప్రకారం పేర్కొనబడింది, అయితే, అవి చర్మ రకం మరియు ఇతర వ్యక్తిగత కారకాలపై ఆధారపడి మారవచ్చు.


ముల్తానీ మట్టి దుష్ప్రభావాలు 

ముల్తానీ మట్టి మన చర్మం మరియు జుట్టు సంబంధిత పలు సమస్యలకు సహజమైన పరిష్కారం. దీనికి సాధారణంగా ఎటువంటి ముఖ్యమైన దుష్ప్రభావాలు ఉండవు, కానీ ఈ అద్భుత సౌందర్య సాధనాన్ని ఉపయోగించినప్పుడు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి.


ముల్తానీ మట్టికి శరీరం మీద చలువ ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది, కనుక జలుబు లేదా దగ్గుతో బాధపడుతున్నట్లయితే, ముల్తానీ మట్టిని కూడా   ఉపయోగించరాదు.

ముల్తానీ మట్టీని కొంతమంది తింటారు, కానీ మీ వైద్యుణ్ణి సంప్రదించకుండా దానిని తీసుకోవడం ఉత్తమం కాదు.

ఒక అధ్యయనంలో, బెంటోనైట్ సప్లీమెంట్ల వినియోగం అతిసారం, వికారం మరియు వాంతులు కలిగించిందని కనుగొనబడింది.

ఏదైనా అధిక ఉపయోగం ప్రతికూల దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. కాబట్టి దానిని  అధికంగా ఉపయోగించడానికి ప్రయత్నించరాదు.

ఒక పరిశోధన ప్రకారం, ఫుల్లర్ ఎర్త్ కు సుదీర్ఘంగా మరియు అధికంగా బహిర్గతం కావడం వలన అది ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతుందని తేలింది, అది దగ్గు మరియు ఊపిరితిత్తుల వాపు వంటి లక్షణాలను కూడా కలిగిస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post