పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
ప్రపంచంలో ప్రమాదకరమైన పంట నిర్మూలించదగిన పంట ఏదైనా ఉందంటే అది కేవలం పొగాకు పంట మాత్రమే అనడంలో ఎటువంటి అనుమానం లేదు. గణాంకాధికారుల ప్రకారం ఏటా మూడు మిల్లియన్ల మంది ప్రజలు పొగాకు వాడకం వలన తమ ప్రాణాలను కోల్పోతున్నారు రాబోవు రోజులలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం చాలా ఉంది. నికోటియానా అనే జాతికి చెందిన ఈ పొగాకును మొదటిసారి గా కొలంబస్ కనుగొని యూరోప్ నగరానికి తీసుకొచ్చాడని గత చరిత్ర చెబుతోంది. హృద్రోగ సమస్యలతో పాటు అనేక రోగాలను తెచ్చిపెట్టే ఈ పొగాకు వలన కొన్ని లాభాలు ఉన్నాయట. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజమన్నారు కొద్ది మంది నిపుణులు. ఆ లాభాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం .
గమనిక : మా యొక్క ఉద్దేశ్యం పొగాకు సంబంధిచిన సమగ్ర సమాచారం అందివ్వడమే తప్ప దీనిని ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. ఈ వ్యాసం పొగాకు వాడకాన్ని సమర్ధించదని తెలియ జేస్తున్నాము.
పొగాకు వలన ఉపయోగాలు
పండ్ల పొడి తయారుకి :
చాలా మందికి తెలియనిది ఏమంటే పొగాకు పొడిని చాలా కంపినిలు తమ టూత్ పేస్ట్ తయారీలో వినియోగిస్తారనేది.
కొంత మంది నిపుణుల ప్రకారం పొగాకుకు పళ్ళపై పేరుకు పోయిన పాచిని తొలగించే గుణం ఉంది. అంతే కాకుండా పంటి నొప్పి, పళ్ళ మధ్య జిగట కారడం వంటి రోగాలకు కూడా పొగాకు పొడి బాగా ఉపయోగపడుతుందట .
అందుకనే మన పెద్దలు పొగాకును పంటి కేసి రుధీ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇది మోతాదు మించి వాడితే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట .
చెవి సమస్యలకు :
కొంత మంది నాటు వైద్యుల ప్రకారం తాజా పొగాకు ఆకుల రసం ను రెండు మూడు చుక్కలు చెవిలో వేస్తె ఎటువంటి చెవి రోగాలైనా నిర్మూలించ బడతాయని సమాచారం.
జుట్టు సమస్యలకు :
ఆయుర్వేద రంగంలో, మంచి నాణ్యమైన పొగాకు ఆకులను వివిధ నూనెలను తయారు కి వినియోగిస్తారు. వీటి వలన మాడుపై పేరుకుపోయిన బాక్టీరియా, ఫంగస్ చుండ్రు నుండి ఉపశమనం లభిస్తుంది.
చర్మ సమస్యలకు :
కొంతమంది పరిశోధకుల అనుసారం అమెరికా లోని పూర్వీకులు పాము కాటుకు పొగాకును వినియోగిస్తారట.
పొగాకును గుజ్జుగా చేసి కాటు వేసిన చోట రాయడమే కాకా నీటిలో కలిపి సేవించేందుకు కూడా ఇస్తారట, తద్వారా వాంతితో పాటు విషం కూడా కక్కబడుతుందని అభిప్రాయం. కొన్ని సంఘటనలలో ఇది నిరూపితం కూడా అయింది.
ఇక కొన్ని పురుగు కాటు వాపులను , కాలిన గాయాలకు పొగాకును వాడటం సాధారనం . పొగాకులో ఉండే ప్రత్యేక గుణాలు ఆయా నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
అంతే కాకుండా పొగాకును నమలడం వలన శరీరంలో విటమిన్ సి చేరి ఆరోగ్యమైన చర్మాన్ని ఇస్తుందని కొంత మంది ఆరోగ్య సంరక్షకులు చెప్పారు
చెదలు మరియు పురుగుల నివారిణి:
పొగాకులో ఉండే నికోటిన్ ఇతర రసాయనిక పదార్ధాలు చెట్లపై మరియు ఇంటిలో ఉండే వివిధ చెద పురుగులను నిర్మూలించేందుకు ఉపయోగపడతాయి.
పొగాకు వలన ప్రమదాలు
మన లోని అన్ని భాగాలను నాశనం చేసే గుణం పొగాకు కు మాత్రమే అధికం. దీనిని కాల్చినప్పుడు దాదాపు 8000 విషపూరితమైన రసాయనాలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు అన్నారు.
దీని వలన నోటి క్యాన్సర్ మరియు ఛాతీ క్యాన్సర్ మరియు కాలేయ క్యాన్సర్, గుండె సంబంధిత రోగాలు ఒకటేమిటి చాలానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇక గర్భం దాల్చిన ఆడవారు దీనిని సేవిస్తే బిడ్డ పుట్టకముందు నుంచే పరిస్థితి విషమించి అనేక ఒడిదుడుకులకు దారి తీస్తుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వాడకం ద్వారా వచ్చే ఛాతీ క్యాన్సర్ వలనే ఏటా ఎన్నో మిల్లియన్ల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
పొగాకు సేవనం మెదడు పనితీరుపై ప్రభావం చూపడంతో పాటు రుచి వాసన గ్రహించే శక్తిని హరించి వేస్తుంది.
అంతే కాకుండా దీని వలన పంటి నొప్పి, చర్మ రోగాలతో పాటు వీర్య కణాల సంఖ్య తగ్గి పోవడం కూడా జరుగుతుంది.
Post a Comment