మెంతి ఆకు కషాయం ఉపయోగాలు
మెంతి ఆకు ఏ కూర లో వేసిన గాని ఆ వంట రుచికరంగా మారుతుంది. ముఖ్యంగా మధుమేహ రోగాన్ని దూరంగా ఉంచాలంటే ఈ మెంతి ఆకుల కషాయమును రోజు త్రాగాలి. ప్రస్తుత పరిస్థితిలో Gall Bladder కు చాలా సమస్యలు కూడా వస్తున్నాయి.. ఇలా చేయడం వలన లివర్ కు అనేక సమస్యలు కూడా వస్తాయి. ఈ మెంతి ఆకుల కషాయాన్ని క్రమంగా వాడుతుంటే గాల్ బ్లాడర్ మరియు లివర్ సమస్యలను త్వరగా కూడా తగ్గించుకోవచ్చును .
ఆల్కహాల్ తీసుకోవడం వలన లివర్ కు అనేక రకాల సమస్యలు వస్తాయి. మెంతి ఆకుతో పాటు కానుగ ఆకు మరియు కొత్తిమీర ఆకు కషాయం తీసుకోవడం వలన కాలేయ సంబంధిత వ్యాధులను త్వరగా కూడా తగ్గించుకోవచ్చును . కొన్నిరకాల మూత్రపిండ సమస్యలకు కూడా ఈ మెంతి ఆకు కషాయం చాలా బాగా పనిచేస్తుంది. ఈ మెంతి ఆకును కూరలో తినడం కన్నా కషాయంగా తీసుకోవడం వలన చాలా ఔషధ గుణాలు మన శరీరానికి అందుతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ను పోగొట్టడంలో మెంతులు చాలా బాగా పనిచేస్తాయి.
మెంతి ఆకు కషాయం తయారు చేసే విధానం
మెంతి ఆకులను 10 నుండి 20 తీసుకొని మంచి నీటితో బాగా కడగాలి. రాగి లేదా స్టీల్ పాత్రలో ఒక గ్లాస్ మంచి నీటిని పోయాలి. ఈ మెంతి ఆకులను దానిలో వేసి మూడు లేదా నాలుగు నిమిషాలు బాగా వేడి చేయాలి. ఇలా వేడిచేసిన కషాయం ను గ్లాసులోకి వడపోసుకొని గోరువెచ్చగా కానీ, చల్లగా కాని తీసుకోవాలి. కషాయం వగరుగా ఉంటే తాటి బెల్లం కూడా కలుపుకొని త్రాగవచ్చును .
Post a Comment