పుదీనా ఆకుల పేస్ట్ తో ఉపయోగాలు
పుదీనా వాడకుండానే సువాసన వచ్చే అద్భుతమైన మొక్క . ఇది వంటకు మంచి ఫ్లేవర్ ఇవ్వడమే కాదు... ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అసలీ మొక్క మొత్తం ఔషధ గుణాలతో ఉన్నదే. అందుకే మన పూర్వీకుల నుంచీ ఇప్పటివరకూ పుదీనాను ఎన్నో ఆయుర్వేద ఇతర మందుల తయారీలో కూడా వాడుతున్నారు. అంతేకాదు... కాస్మొటిక్ కంపెనీలు, ఔషధ కంపెనీలు ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో సాగు చేయిస్తూ... ఈ ఆకుల రసాన్ని ఎన్నో క్రీములు, లోషన్లు, మందుల తయారీలో కూడా వాడుతున్నాయి. మన తెలుగువారు... ఎక్కువగా బిర్యానీ, ఇతర వంటల్లో పుదీనా ఆకుల్ని ఉపయోగిస్తారు. ఐతే... పుదీనాతో కలిగే ఎన్నో ప్రయోజనాలు తెలుసుకుంటే... ఈ మొక్కల్ని కూడా ఇళ్లలో పెంచుకోవడం ఖాయం.
ప్రాచీన సంస్కృతిలో పుదీనాను వంటకాలలోనూ, ఔషధ పరంగాను విస్తృతంగా బాగా వినియోగించేవారు. పుదీనాకు మంచి వాసనే కాకుండా రుచి, ఔషధ శక్తి కూడా ఉన్నాయని గుర్తించారు. సలాడ్లు, పానీయాల్లో పుదినాను విస్తృతంగా ఉపయోగించవచ్చును . పుదీనాతో చేసిన టీతో అనేక ప్రయోజనాలున్నాయి.
చూయింగ్ గమ్, టూత్ పేస్ట్, మరెన్నో మందుల్లో ఎలా వాడినా పుదీనా తాజాదనాన్ని చక్కగా అందిస్తుంది. ఇంకా మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తాయి. పీచు, ఫోలేట్ ఐరన్, మేగ్నీషియం క్యాల్షియం మరియు విటమిన్ బి2, ఒమెగా-3 ఫ్యాటి యాసిడ్స్, పొటాషియం, కాపర్ కూడా లభిస్తాయి.
పుదీనా ఆకులు, నూనె, విత్తనాలు, ఇతర భాగాలు అనేక రకాల వ్యాధులకు నివారిణిగా కూడా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్య సలహాను అనుసరించి మాత్రమే పుదీనాను ఆయా వ్యాధుల నివారణకై వాడాలి .
కడుపులో నొప్పిగా ఉంటే... పుదీనా ఆకుల రసం, తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది.- కడుపులో తిప్పుతూ ఉంటే... ఓ కప్పు నీటిలో.. పుదీనా ఆకుల రసం, నిమ్మ రసం కలిపి తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
కలరా సమస్య ఉంటే... నిమ్మరసం, మామిడి రసం, తేనె కలిపి తాగితే... ఫలితం ఉంటుంది.
తలనొప్పి: పుదీనా ఆకులు ముద్దగా చేసి నుదిటిపై వేయాలి. ఆకులు నలిపి వాసన కూడా చూడాలి.
జుట్టు ఊడటం, పేలు: పుదీనా ఆకులు పేస్ట్‌ను తయారు చేసి రాత్రి తలకు పట్టించాలి. పొద్దుటే తలస్నానం చెయ్యాలి.
దగ్గు జలుబు: పుదీనా కషాయం రోజు 2 సార్లు తాగాలి.
గొంతునొప్పి: పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఎండిన ఆకుల పొడుముతో పళ్లు బాగా తోముకోవాలి.
దంతవ్యాధులు: పుదీనాతో చేసిన మెంథాల్ దంత వ్యాధులపై మంచి ప్రభావం కూడా చూపిస్తుంది. ప్రతి రోజు ఆకులు బాగా ఎక్కువసేపు నమిలి తినాలి.
పిప్పి పళ్ళు: పిప్పరమెంట్ నూనెతో లవంగ నూనె కలపాలి. ఆ మిశ్రమంలో దూదిని తడిపి పెడితే పిప్పి పళ్ళు నొప్పి నుండి ఉపశమనం బాగా కలుగుతుంది.
ముఖంపై మొటిమలు: పుదీనా నూనె మొటిమల పైన రాసినట్లయితే అవి తొందరగా తగ్గిపోతాయి. స్వరపేటిక ఆరోగ్యానికి పుదీనా రసం తాగాలి.
ఆహారంతోపాటూ... పుదీనా ఆకులు, మిరియాల పొడి, నల్ల ద్రాక్ష, జీలకర్ర, సింధు, గసగసాలు... వీటన్నింటినీ కలిపి తీసుకుంటే... జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది.
టైఫాయిడ్ నుంచీ ఉపశమనం పొందాలంటే... పుదీనా ఆకులు, తులసి ఆకుల రసం కలిపి తాగాలి.
Post a Comment