అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు

 _*🚩అయ్యప్ప చరితం - 43 వ అధ్యాయం🚩*_


🕉☘🕉☘🕉☘🕉☘🕉☘🕉


పరశురాముని చేత అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ !

ఒక్కసారిగా మంగళవాద్యాల ఘోష వినవచ్చింది !

*‘‘భక్తులారా ! ఇది సూర్యుడు మకరరాశిలోకి సంక్రమణం చెందుతున్న పుణ్యకాలం. అత్యంత శుభప్రదమైనది ! గ్రహాలు , నక్షత్రాలు శుభప్రదంగా వున్న ఈ సమయంలో మణికంఠుడు భూలోకవాసులకోసం అయ్యప్పస్వామిగా అవతరించబోతున్నారు ! అందరూ చేతులు జోడించి ఆ స్వామిని ధ్యానించండి ! గంభీర స్వరంతో పలికి అగస్త్య మహర్షి ధ్యాన శ్లోకాలు పఠిస్తుంటే అందరూ శ్రద్ధగా వినసాగారు !

అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు*అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు*


1. ఓంకారమూలం జ్యోతి స్వరూపం ;

పంబా నదీ తీర శ్రీభూతనాధం శ్రీ దేవదేవం చతుర్వేదపాలం ;

శ్రీధర్మ శాస్తారం మనసా స్మరామి !!


2. వందే మహేశ హరిమోహిని భాగ్యపుత్రం

వందే మహోజ్వలకరం కమనీయ నేత్రం

వందే మహేంద్ర వరదం జగదేక మిత్రం

వందే మహోత్సవ నటనం

మణికంఠ సూత్రం !


3. భూయేత్ ఉమాపతిం

రమాపతి భాగ్యపుత్రం

నేత్రోజ్వలత్ కరతల

భాసిరామం

విశ్వైక వపుషం

మృగయా వినోదం

వాంఛానురూప ఫలదం వరభూతనాథం !


4. భూయేత్ అపార కరుణా కరుణాధివాసం

భస్మాంగ రాగ సుఘమం ప్రియభక్త వశ్యం

భూతాధిపం భువనవశ్యతరావతారం

భాగ్యోదయం హరిహరాత్మజం

ఆదిమూర్తిం !!


అంటూ శ్రావ్యంగా ధ్యానించి అందరివైపు ప్రసన్నంగా చూస్తూ *‘‘స్వామి అయ్యప్ప అవతరించే శుభ ఘడియలు దగ్గర పడుతున్నాయి !

ఆ స్వామి మూలమంత్రాన్ని పలుకుతున్నాను ! అందరూ ఆ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో గొంతెత్తి పలకండి ! ఆ స్వామిని శరణువేడండి !’’* అంటూ స్వామి మూలమంత్రాన్ని పలికారు అగస్త్య మహర్షి !


*స్వామి మూల మంత్రం*


*‘‘ఓం స్వామియే శరణం అయ్యప్ప !’’*

అందరూ భక్త్భిరిత హృదయాలతో  *‘‘ఓం స్వామియే శరణం అయ్యప్ప’’* అని గొంతెత్తి అంజలి ఘటించి పలుకుతుంటే శబరిగిరి ఆ శరణు ఘోషతో ప్రతిధ్వనించింది. దేదీప్యమానంగా దీపాలన్నీ వెలిగి కాంతులు వెదజల్లుతున్నాయి ! అందరికీ ఆ దీపాల కాంతిలో గర్భగుడి మధ్యలో స్వర్ణకాంతులు వెదజల్లుతున్న రత్న ఖచిత పీఠం కానవచ్చింది !

పరశురాములవారు పట్టువస్త్రాలతో కప్పబడ్డ విగ్రహాన్ని రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకుని వస్తుంటే ఆకాశంనుండి దేవదుందుభులు మ్రోగసాగాయి. 


ఆలయంలో అగస్త్య మహర్షి కబురందుకుని అక్కడకు చేరిన నారదాది మునులు , ఋషి గణాలు వేదాలు పఠిస్తున్నారు ! పుష్పవృష్టి కురుస్తున్నది

పరశురాముడు పీఠాన్ని చేరుకుని దానిపై విగ్రహాన్ని ప్రతిష్ఠించి వస్త్రాన్ని తొలగించాడు !

అద్భుతం ! పరమాద్భుతం ! ఆ విగ్రహాన్ని చూస్తూనే అందరి నోటినుండి *‘స్వామియే శరణం అయ్యప్ప !  శరణం అయ్యప్ప’*  అన్న మంత్రం వెలువడింది !

ఆ మంత్రాన్ని తన్మయత్వంతో పలుకుతూ చేతులు తడుతున్న అందరి కళ్లకు మరొక అద్భుత దృశ్యం కానవచ్చింది !

మణికంఠుని శక్తి

విగ్రహంలో లీనం చెందుట

పంబల రాజకుమారుడుగా అందరి మనస్సులలో ముద్రించుకుపోయిన రూపం మణికంఠస్వామి సుందర బాలరూపం ! పన్నెండు సంవత్సరాల బాలుడుగా ప్రజలెరిగిన ఆ రూపంలో చేతుల్లో విల్లంబులు ధరించి మెట్లలాగా పడుకున్న పద్ధెనిమిది మంది దేవతల మీదుగా నడిచి ఎక్కి వచ్చి ఆ విగ్రహంలో విలీనమైపోవటం చూసి భక్తి పారవశ్యంతో *‘మణికంఠస్వామికి జయము ! అయ్యప్పస్వామికి జయము !’’* అంటూ నినాదాలు చేశారు అందరూ !


*‘‘మహిషిని మర్దించి లోకాలకు శాంతిని ప్రసాదించిన హరిహర పుత్రుడు మణికంఠుడు తన శక్తిని ఈ విగ్రహంలో ప్రతిష్ఠ చేసి మహిమాన్వితంగా , దివ్య శక్తి సమన్వితం కావించాడు ! ఆ స్వామి ఎక్కడానికి మెట్లుగా అమరిన పద్ధెనిమిది మంది దేవతలు తమ శక్తులను మెట్లలో లీనం కావించటంతో మీకు కనిపిస్తున్న ఈ మెట్లు కూడా ఎంతో మహిమాన్వితమైనాయి ! ఇక స్వామికి శాస్త్రోక్తంగా అభిషేకం , పూజార్చనలు జరుపబడతాయి !’’*  అని ప్రకటించారు అగస్త్య మహర్షి !

పంచామృతాలతో అభిషేకం , పూజా కార్యక్రమం అగస్త్య మహర్షి , మునిగణాలు పరశురాముని ఆధ్వర్యంలో నిర్వర్తించారు ! పట్టు పీతాంబరంలో , దివ్యమైన ఆభరణాలమధ్య స్వామి మణిహారం వింత వెలుగులు వెదజల్లుతుండగా భువన మోహనంగా కానవచ్చింది స్వామి విగ్రహం !


*🌹అయ్యప్పస్వామి విగ్రహ వర్ణన - అంతరార్థం !🌹*


స్వామి విగ్రహంవైపు తన్మయత్వంతో చూస్తున్న అందరివైపు ప్రసన్నంగా చూస్తూ గంభీరంగా ఆ విగ్రహంలోని అంతరార్థాన్ని వివరించారు పరశురాములవారు !

Sabarimala Ayyappa Swamy

  అయ్యప్ప అంటే ఎవరు?    
 అయ్యప్పస్వామి మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు 
శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి సoక్షిప్తoగా
శబరిమల యాత్ర విశేషాలు
🕉️శబరిమల అయ్యప్ప స్వామి వారి మండల కాల దీక్ష నియమాలు🕉️
అయ్యప్ప స్వామి మండల కాల దీక్ష🚩🕉️
అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి ?
అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు
అయ్యప్ప స్వామి 18 మెట్ల కథ
అయ్యప్పస్వామి అభిషేకాలు - వాటి ఫలితాలు
అయ్యప్పస్వామి దీక్ష లొ వ్రత నియమాలు గురు ప్రార్థన
శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళి
  అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం  
అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు
శబరిమల‌ అయ్యప్పస్వామి ఇరుముడి ప్రాశస్త్యం ఇరుముడి వివరణ
అయ్యప్పస్వామి యాత్రలో ఇరుముడి కట్టే విధానం
అయ్యప్పస్వామి యాత్రలో శీరంగుత్తి వివరాలు
అయ్యప్పస్వామి యాత్రలో ఆర్యన్‌గావ్ | అచ్చన్ కోవిల్ | ఎరుమేలి | శబరిమల
అయ్యప్పస్వామి యాత్రలో కాళైకట్టె వివరాలు
అయ్యప్పస్వామి యాత్రలో పంబానదీ - విడిది వివరాలు
మాలికాపురత్తమ్మ ఆలయం శబరిమలై పూర్తి వివరాలు
శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం
అయ్యప్ప దీక్ష విరమణ
కార్తీక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి
  అయ్యప్ప అంటే ఎవరు? దీక్షా సంబంధమైన ఇతర ధర్మ సందేహాలకు ఇక్కడ క్లుప్తంగా వివరణ  
గాయత్రీ మంత్రం రహస్యం
కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?
కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

0/Post a Comment/Comments

Previous Post Next Post