అయ్యప్పస్వామి యాత్రలో ఇరుముడి కట్టే విధానం

_*🚩అయ్యప్ప చరిత్ర - 52 వ అధ్యాయం🚩*_

🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️

ముందు అరలో ఆవు నేతితో నింపిన కురిడీ , విభూది , చందనం , పన్నీరు , ఊదివత్తులు , కర్పూరం , అమ్మవారికి సమర్పించడానికి వస్త్రం , పసుపు , కుంకుమలు , మిరియాలు , పటికబెల్లం , బియ్యం , పెసరపప్పు , దక్షిణగా సమర్పించడానికి నాణేలు పెట్టుకోవడానికి కావలసి ఉంటాయి.

వెనక భాగంలో మార్గంలో భుజించడానికి అవసరమైన పండ్లు , అటుకులు , ఇతర తినుబండారాలు పెట్టుకోవచ్చును.
అయ్యప్పస్వామి యాత్రలో ఇరుముడి కట్టే విధానం

*ఇరుముడి కట్టే విధానం:*

ఇరుముడి దేవాలయంలోని , గురుస్వామి ఇంటిలోగానీ కట్టడం జరుగుతుంది.
ముందుగా కొబ్బరి కురిడీ లేక ముద్రను సిద్ధం చేస్తారు !

*ముద్రను సిద్ధం చేసే విధానం:* 

శుభ్రమైన మంచి కొబ్బరికాయకు పీచు తీసి నున్నగా చేసిదాని కన్నులలో ఒక కన్నుకు రంధ్రం చేసి కాయలో వున్న నీటిని తీసివేయాలి ! ఆ కాయను కలశం మీద వుంచి దీక్ష పూర్తిచేసిన స్వామి చేత కొబ్బరికాయను ఆవు నేతితో నింపిస్తారు గురుస్వామి ! ఆ సమయంలో ఇద్దరూ మనస్సులో అయ్యప్పస్వామిని ధ్యానిస్తూ వుండాలి ! నింపిన తర్వాత గురుస్వామి రంధ్రాన్ని మూసివేయడం జరుగుతుంది ! కాబట్టి కొబ్బరికాయలోని నెయ్యి బయటకు రాకుండా జాగ్రత్తతీసుకుంటారు ! ఈ విధంగా నెయ్యితో నింపబడ్డ కొబ్బరికురిడీనే ముద్ర అంటారు .


ఈ ముద్రను ఒకవస్త్రంలో నాణాలతో కలిపి కట్టి దానిని ఇతర పూజా ద్రవ్యాలతో కలిపి సంచీ ముందుభాగంలో వుంచటం జరుగుతుంది. ఆ భాగాన్ని గట్టిగా కట్టివేసి , వెనక భాగంలో ఆహార పదార్థాలను వుంచి కట్టిన తర్వాత రెంటినీ కలిపి ఒకటిగా ముడివేస్తారు ! దీక్షాధారులు ఇరుముడిని తలమీద పెట్టుకుని ప్రయాణం చేయవలసి వుంటుంది !

*కొబ్బరి కురిడీ ముద్ర అంతరార్థం*

కొబ్బరికాయలకు మూడు కళ్లువుంటాయి ! వాటిలో రెండు కళ్లు గట్టిగా వుండి ఒకటి మెత్తగా వుంటుంది ! గట్టిగా వుండే రెండు కళ్ళు మనిషిలో పైకి కనిపించే రెండు కళ్లకు సంకేతాలు ! మెత్తని కన్ను మనిషి లోపలి జ్ఞాన నేత్రానికి సంకేతం ! జ్ఞాన నేత్రం మాత్రమే సాధనవల్ల భగవంతుని తనలోనే దర్శించగల సమర్థత కలిగివుంటుంది ! మెత్తని కన్నును తెరిచి నీరు తీసివేసి స్వచ్ఛమైన నేతితో నింపినట్లు జ్ఞాన నేత్రం అహంకారాన్ని వదిలి భక్తి భావంతో భగవంతుని దర్శించాలన్న సందేశం దాగి వుంది ముద్రను సిద్ధం చేయటంలో !

*ఇరుముడికి పూజ:*

కట్టడం పూర్తిచేసిన ఇరుముడిని భక్తితో పూజిస్తారు దీక్షాధారులు ! ఇరుముడి వల్ల కలిగే శక్తి యాత్రను సజావుగా శుభప్రదంగా సంపన్నం అయ్యేలాచేస్తుంది ! పూజ పూర్తయినాక ఇరుముడి కట్టించిన గురుస్వామికి నమస్కరించి , దక్షిణ సమర్పించి గురుస్వామి చేత మూటను  పెట్టించుకుని అయ్యప్పస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని యాత్రసఫలం కావించమని ప్రార్థించాలి ! ఇరుముడిని స్వామి ప్రక్కన వుంచి పూలమాల వేసి నమస్కరించాలి !
ఈ విధంగా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఇరుముడులకు హారతి చూపి , శరణుఘోష చేస్తూ దీక్షాధారలందరూ ప్రయాణం ప్రారంభించి శబరిగిరి వైపు సాగిపోతారు ! ఇతరులు మేళతాళాలతో ఊరి పొలిమేరల వరకు వారి వెంట వెళ్లి వీడ్కోలు చెప్పి జయప్రదంగా యాత్ర ముగించుకు రావాలని శుభకాంక్షలు తెలిపి వెనుదిరుగుతారు !

*ఇరుముడికి - జాగ్రత్తలు*

ఇరుముడి కట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇతరుల ఇండ్లకు వెళ్లగూడదు !
దేవాలయాలు , సత్రాలలో తప్ప ఇతరుల గృహాలలో బస చేయకూడదు !

Sabarimala Ayyappa Swamy

  అయ్యప్ప అంటే ఎవరు?    
 అయ్యప్పస్వామి మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు 
శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి సoక్షిప్తoగా
శబరిమల యాత్ర విశేషాలు
🕉️శబరిమల అయ్యప్ప స్వామి వారి మండల కాల దీక్ష నియమాలు🕉️
అయ్యప్ప స్వామి మండల కాల దీక్ష🚩🕉️
అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి ?
అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు
అయ్యప్ప స్వామి 18 మెట్ల కథ
అయ్యప్పస్వామి అభిషేకాలు - వాటి ఫలితాలు
అయ్యప్పస్వామి దీక్ష లొ వ్రత నియమాలు గురు ప్రార్థన
శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళి
  అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం  
అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు
శబరిమల‌ అయ్యప్పస్వామి ఇరుముడి ప్రాశస్త్యం ఇరుముడి వివరణ
అయ్యప్పస్వామి యాత్రలో ఇరుముడి కట్టే విధానం
అయ్యప్పస్వామి యాత్రలో శీరంగుత్తి వివరాలు
అయ్యప్పస్వామి యాత్రలో ఆర్యన్‌గావ్ | అచ్చన్ కోవిల్ | ఎరుమేలి | శబరిమల
అయ్యప్పస్వామి యాత్రలో కాళైకట్టె వివరాలు
అయ్యప్పస్వామి యాత్రలో పంబానదీ - విడిది వివరాలు
మాలికాపురత్తమ్మ ఆలయం శబరిమలై పూర్తి వివరాలు
శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం
అయ్యప్ప దీక్ష విరమణ
కార్తీక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి
  అయ్యప్ప అంటే ఎవరు? దీక్షా సంబంధమైన ఇతర ధర్మ సందేహాలకు ఇక్కడ క్లుప్తంగా వివరణ  
గాయత్రీ మంత్రం రహస్యం
కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?
కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు

స్వామివారికి

అర్పించే పూజాద్రవ్యాలు , ముద్ర వున్న భాగం శిరస్సు ముందుభాగంలో వుండేలాగా , జారిపోకుండా జాగ్రత్త వహించాలి .


యాత్రాకాలంలో కూడా రోజూ ఉదయం , సాయంత్రం ఇరుముడికి హారతి ఇచ్చి భజనలు చేయాలి !
పద్దెనిమిది మెట్లు ఎక్కి వెళ్లి స్వామి సన్నిధానాన్ని చేరేవరకు ఇరుముడిని పవిత్రంగా చూసుకోవాలి !
మొదటిసారి వెళుతున్న దీక్షాధారులు (కన్నిస్వాములు) తాము స్వయంగా ఇరుముడిని తలపై నుండి దింపటం తిరిగి ఎత్తుకోవడం చేయకూడదు ! ఆరు సార్లు వెళ్లి వచ్చినవాళ్ల సహాయంతో ఆ పని చేయాలి ! ఇరుముడిని అయ్యప్ప స్వామిగా భావిస్తూ పూజిస్తూ శబరిగిరి చేరుకోవాలి.శబరిగిరి యాత్రకు తీసుకువెళ్లవలసిన ఆయుధాలు

1. మొదటి సంవత్సరం యాత్రకు వెళ్ళేవారు తమ వెంట ఒక బాణాన్ని తీసుకువెళ్లి శరణుగుచ్చిలో అర్పించాలి ! మొదటిసారిగా దీక్ష స్వీకరించే ఈ స్వాములను కన్నిస్వాములంటారు !

2. రెండవ సంవత్సరం వెళుతున్న దీక్షధారులు కత్తిని సమర్పించాలి !

3. మూడవ సంవత్సరం గంటను తీసుకువెళ్లి అర్పించాలి.

4. నాలుగవ సంవత్సరం గదను

5. ఐదవ సంవత్సరం విల్లును

6. ఆరవ సంవత్సరం దీపాన్ని వెలిగించి అర్పించాలి!

7. ఏడవ సంవత్సరం సూర్యప్రతిమను (సూర్యుని రాగి రేకు)

8. ఎనిమిదవ సంవత్సరం చంద్రప్రతిమను (చంద్రుని రాగిరేకు)

9. తొమ్మిదవ సంవత్సరం త్రిశూలాన్ని

10. పదవ
సంవత్సరం విష్ణుచక్రాన్ని

11.పదకొండవ సంవత్సరం
శంఖాన్ని

12. పన్నెండవ సంవత్సరం నాగాభరణాన్ని

13. పదమూడవ సంవత్సరం వేణువును

14. పధ్నాల్గవ సంవత్సరం తామర పువ్వును

15. పదిహేనవ సంవత్సరం శూలంని (కుమారస్వామి ఆయుధం)

16. పదహారవ సంవత్సరం రాయిని

17. పదిహేడవ సంవత్సరం ఓంకారంగల రాగిరేకును

18. పద్ధెనిమిదవ సంవత్సరం కొబ్బరిమొక్కను తీసుకువెళ్లి సమర్పించాలి !

ఈ విధంగా పద్ధెనిమిది సంవత్సరాలు మండల దీక్షను స్వీకరించి పద్ధెనిమిదిమెట్లు ఎక్కివెళ్లి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆయుధాన్ని స్వామికి సమర్పించేవారికి అయ్యప్పస్వామి సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది ! వారి జన్మ ధన్యమై ఇహంలో సర్వాభీష్టాలు నెరవేరి చివరకు ముక్తిని పొందుతాడు .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

0/Post a Comment/Comments

Previous Post Next Post