తెలుగు పొడుపు కథలు
మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ? సమాధానం : లవంగ మొగ్గ
ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం? సమాధానం : తేనె పట్టు
రసం కాని రసం, ఏమి రసం? సమాధానం : నీరసం
చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? సమాధానం : ఉల్లిపాయ
జాన కాని జాన, ఏమి జాన? సమాధానం : ఖజాన
తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది? సమాధానం : వేరుశెనగ కాయ
లాగి విడిస్తేనే బ్రతుకు? సమాధానం : ఊపిరి
పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు? సమాధానం : పత్తి పువ్వు
పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే? సమాధానం : దీపం
పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు? సమాధానం :సూర్యుడు
మూత తెరిస్తే, ముత్యాల పేరు? సమాధానం : దంతాలు
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? సమాధానం :తేనె పట్టు
రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది? సమాధానం : ఉత్తరం
కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి? సమాధానం : సీతాకోక చిలుక
రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన? సమాధానం : తాటి చెట్టు
మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన? సమాధానం : పాలు, పెరుగు, నెయ్యి
మోదం కాని మోదం? సమాధానం : ఆమోదం
రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు? సమాధానం : మంగలి
రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది? సమాధానం : ఎండ, వాన, చలి
రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు? సమాధానం : తేలు
అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది. సమాధానం :దీపం వత్తి
కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు? సమాధానం : మురళి
ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు? సమాధానం :ఉల్లి
సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది? సమాధానం :శంఖం
చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ? సమాధానం : కజ్జికాయ
వాలం ఉంది కాని కోతిని కాదు, నామముంటుంది కాని పూజారిని కాదు? సమాధానం : ఉడత
రాణాలనే మించిన రణం, ఏమి రణం? సమాధానం :మరణం
రంగం కాని రంగం, ఏమి రంగం? సమాధానం : వీరంగం
మత్తు కాని మత్తు, ఏమి మత్తు? సమాధానం :గమ్మత్తు
అందరినీ పైకి తీసుకుకెళ్తుంది, కాని తాను మాత్రం పైకి వెళ్ళదు? సమాధానం :నిచ్చెన
ముడ్డి పిసికి, మూతి నాకుతారు? సమాధానం : మామిడి పండు
టూరు కాని టూరు, ఏమి టూరు? సమాధానం :గుంటూరు
డ్రస్ కాని డ్రస్, ఏమి డ్రస్? సమాధానం :అడ్రెస్
జాబు కాని జాబు, ఏమి జాబు? సమాధానం :పంజాబు
టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి?సమాధానం :గడియారం
తొడిమె లేని పండు! చాలా కాలం ఉండు!!?సమాధానం :విభూతి
తోక లేని పిట్ట 90 ఆమడలు పోతుంది?సమాధానం :పోస్ట్ కార్డు
జారు కాని జారు, ఏమి జారు? సమాధానం : బజారు
తిరిగే దీపము, గాలి-వానకు ఆగని దీపము, చమురులేని దీపము, పిట్టల దీపము?సమాధానం :మిణుగురు పురుగు
తాళము కాని తాళము, ఏమి తాళము?సమాధానం :ఆది తాళము
తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు?సమాధానం : గడియారం ముళ్ళు
తాళి గాని తాళి, ఏమి తాళి?సమాధానం :ఎగతాళి
తెలిసి కుడుతుంది, తెలియక చస్తుంది?సమాధానం :చీమ, దోమ
ఎర్రని ముక్కు, తెల్లని వొళ్ళు, పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది?సమాధానం :క్రొవ్వొత్తి
దానము కాని దానము, ఏమి దానము?సమాధానం :మైదానము
తోలు నలుపు! తింటే పులుపు!! ఏమిటది?సమాధానం :చింతపండు
ధనము కాని ధనము, ఏమి ధనము?సమాధానం :ఇంధనము
చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండ్లను తిన్నా దొంగ కాదు?సమాధానం :రామ చిలుక
నాలుగు కాళ్ళున్నాయి కాని జంతువుని కాను, శరీరమంతా రంధ్రాలున్నాయి కాని వలను కాను?
సమాధానం :మంచము
పాలు కాని పాలు, ఏమి పాలు?సమాధానం : లోపాలు
నీరు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది?సమాధానం :దూది
పురము కాని పురము, ఏమి పురము?సమాధానం :గోపురము
నీతో దెబ్బలు తిన్నాను, నిలువునా ఎండిపోయాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదనయ్యాను?సమాధానం :పిడక
ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు?సమాధానం :నీడ
నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను?సమాధానం :గుడి గంట
నారి కాని నారి, ఏమి నారి?సమాధానం :పిసినారి
నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వొస్తాను, సూర్యుడితో పోతాను?సమాధానం :నీడ
పేడ కాని పేడ, ఏమి పేడ?సమాధానం :దూద్ పేడ
నాది నాకు కనపడదు, నీది నీకు కనపడదు, ఏమిటది?సమాధానం :వీపు
సందు కాని సందు, ఏమి సందు?సమాధానం :పసందు
నీటి మీద తేలుతుంది కాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది కాని జీవి కాదు, మెరుస్తుంది కాని మెరుపు కాదు?సమాధానం :నీటి బుడగ
నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కాని మళ్ళీ నడవదు?సమాధానం :పెన్సిల్
పండ్లున్నా నోరు లేనిది, ఏమిటది?సమాధానం :రంపం
రాయి కాని రాయి, ఏమి రాయి?సమాధానం :పావురాయి
ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలుస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెపుతుంది?
సమాధానం :టెలిఫోన్
పైన చుస్తే పండు, తెరిచి చూస్తే బొచ్చు, ఏమిటది?సమాధానం :పత్తికాయ
పుట్టినపుడు ఉండవు, పోయే టప్పుడు ఉండవు, ఏమిటవి?సమాధానం :బట్టలు
పుట్టినపుడు లేకుండా తరువాత వచ్చి ఆ తరువాత పోయేవి?సమాధానం :దంతములు
చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగి పోతుంది?సమాధానం :ముగ్గు
సాయి కాని సాయి, ఏమి సాయి?సమాధానం :కసాయి
మంచి సువాసన ఉన్నా, పూజకు పనికి రానిది, ఏమిటది?సమాధానం :మొగిలి పువ్వు
పేరు కాని పేరు, ఏమి పేరు?సమాధానం :కాసుల పేరు
కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయినా నడుస్తుంది?సమాధానం :మేఘం
తల నుండి పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు, గొంతులో నిప్పులు దాచుకుంటుంది కానీ రాకాసి కాదు, పాకుతుంది కానీ పాము కాదు?సమాధానం :రైలు
తెలియకుండా పూవు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది?సమాధానం :అత్తి చెట్టు
జానెడు ఇంటిలో, మూరెడు బెత్తం?సమాధానం :కుండ, గరిట
గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది?సమాధానం :తాటి చెట్టు
కొప్పు ఉన్నా జుట్టు లేదు, కళ్ళు ఉన్నా చూడలేదు?సమాధానం :టెంకాయ
ఐదుగురిలో బుడ్డోడు! పెళ్ళికి మాత్రం పెద్దోడు!!?సమాధానం :చిటికెన వ్రేలు
ఒక ముండ ఎన్ని కోకోలైన విప్పుతుంది?సమాధానం :ఉల్లిపాయ
గారు కాని గారు, ఏమిగారు?సమాధానం :కంగారు
అది లేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు?సమాధానం :ఆకలి
అందరూ నన్ను పట్టుకుంటారు కాని నేనే ఎవరిని పట్టుకొను, అందరూ నాతో మాట్లాడతారు కాని నేనే ఎవరితో మాట్లాడను?సమాధానం :టెలిఫోన్
గీత కాని గీత, ఏమి గీత?సమాధానం :భగవద్గీత
గోళము కాని గోళము, ఏమి గోళము?సమాధానం :గందర గోళము
అన్నం పెడితే ఎగురదు, పెట్టకపోతే ఎగురుతుంది?సమాధానం :విస్తరాకు
అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకి?సమాధానం :తేనే పట్టు
అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురూ తిరుగుతారు, మానితే ముగ్గురూ మానుతారు?సమాధానం :ఫ్యాన్
అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే, పరుగెత్తలేక పది మంది చచ్చారు.సమాధానం :పిడుగు
ఆడవారికి ఉండనిది, మగవారికి ఉండేది?సమాధానం :మీసము
ఆడదానికి పుట్టినింట ఒకటి, మెట్టినింట ఒకటి?సమాధానం :ఇంటి పేరు
ఆడవారు తక్కువగా మాట్లాడే నెల?సమాధానం :ఫిబ్రవరి
ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంటుంది?సమాధానం :చీపురు
ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి?సమాధానం :మ్యాపులో
ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము?సమాధానం :పంచదార
ఇక్కడ వత్తు! అక్కడ వెలుగు!!?సమాధానం :స్విచ్, బల్బ్
అన్నదమ్ములు ఇద్దరు, ఒకరంటే మరొకరికి పడదు, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. వారి మధ్యకు ఎవరైనా వొస్తే పచ్చడి పచ్చడే?సమాధానం :ఇసుర్రాయి
ఇద్దరు అక్క చెల్లెల్లు, ప్రపంచం మొత్తం తిరిగి చూసినా, ఒకరినొకరు చూసుకోరు?సమాధానం :కళ్ళు
ఇల్లు మొత్తం వెలుగు, బల్ల కింద చీకటి?సమాధానం :దీపం
ఇవ్వకుండా తీసుకో లేనిది! తీసుకోకుండా ఇవ్వ లేనిది!!?సమాధానం :ముద్దు
అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు ఎంత దూరం పోతే రెండవ వారు అంతే దూరం పోతారు?సమాధానం :కాళ్ళు
ఈగ ముసరని పండు! ఇంటిలో నుండు!!? సమాధానం:నిప్పు
ఈత చెట్టుకు ఇద్దరు బిడ్డలు? సమాధానం :కల్లు కుండలు
ఊరంతా కదిలిన, ఊరగాయ కుండ కదలదు? సమాధానం : బావి
ఉరికంత ఒక్కటే దుప్పటి? సమాధానం : ఆకాశము
ఎర్రనిచెట్టు! నీళ్లు పోస్తే చస్తుంది!!? సమాధానం :అగ్ని
మాములు వేళలో మర్యాదగా ఉంటుంది, ఎండకు వానకు నెత్తినెక్కుతుంది? సమాధానం : గొడుగు
ఎర్రగా ఉంటాను కాని నేనెవరితో సరసాలాడను, నన్ను ముట్టుకుంటే ఊరుకోను. సమాధానం :నిప్పు
ఎగిరే పిట్ట, రెక్కలు లేని పిట్ట! ఆటలాడుకునే పిట్ట, పిల్లల పిట్ట!!? సమాధానం :గాలి పటము
ఎనమిది ఎముకలు! తట్టెడు ప్రేగులు!!? సమాధానం :మంచము
ఎముకలు లేని జీవము, ఏటికి పోయింది? సమాధానం :జలగ
ఏది పెడితే అరిగి పోతుంది?, ఏది పెడితే కలకాలం ఉంటుంది? సమాధానం :అన్నము, వాత
Post a Comment