వటపత్ర శాయి అనగా?

 వటపత్ర శాయి అనగా?

మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని. ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు. ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్య హొయలకు మార్కండేయుడు చలించలేదు. అది చలించని మార్కండేయుడికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అనగా ‘నీ మాయను చూడాలని ఉంది’ అని అడగుతాడు. మరి క్యాలు ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలీ, ధారపాత వర్షమూ విపరీతంగా వచ్చి సముద్రాలుపొంగాయి. నీటి తో సమస్తం మునిగిపోతుంది. ” * మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతన్న అతనికి ఓ చోట, ఉమర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి లో వేళ్ళతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు.
వటపత్ర శాయి అనగా?
అతడే వటపత్రశాయి. –
– మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటవత్రశాయి కడుపులోకెళ్ళి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమీ, ప్రాణి కోటి కనిపిస్తుంది.
మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు. శ్రీమహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను తెలుసుకుంటాడు.