10 వ తరగతి తరువాత ఏ కోర్సు లో చేరాలి

10 వ తరగతి తరువాత ఏ కోర్సు లో చేరాలి Which course to join after 10th class?

1 సంవత్సర ఐ.టి.ఐ. కోర్సులు

కోర్సులు –  ఉద్యోగావకాశాలు

1.సెక్రటరీ ప్రాక్టీస్ :- ప్రైవేట్ కంపెనీలలో పర్సనల్ అసిస్టెంట్
2. కంప్యూటర్ ఆపరేటర్:- ప్రైవేట్ కంపెనీలలో ఫ్రంట్ రూమ్ అసిస్టెంట్
3. స్టెనోగ్రాఫ్ :- రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో స్టెనోగ్రాఫర్
4. డ్రాఫ్ట్ మెన్ (Civil) :- లైసెన్స్ సర్వేయర్
5. డీసెల్మెకానిక్ (Civil):- RTC లో టెక్నీషియన్స్
6. వెల్డర్ :- డాక్ యార్డ్ మరియు షిప్ యార్డ్ ప్రైవేట్ వర్క్ షాపు

వ్యవసాయ డిప్లొమా కోర్సులు

1. ఈ క్రింది వ్యవసాయ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్
సీడ్ టెక్నాలజీ
పశుగణాభివృద్ధి (వెటర్నరీ యూనివర్సిటీ ద్వారా ఎ.హెచ్. పాలిటెక్నిక్ నందు) ఫిషరీ (వెటర్నరీ యూనివర్సిటీ ద్వారా ఫిషరీ పాలిటెక్నిక్ నందు)
2. ఉద్యానవన పెంపకం (హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా హార్టికల్చర్ పాలిటెక్నిక్ నందు)
3. పై వాటిలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ 3 సంవత్సరాల ఇంగ్లీష్ మీడియం కోర్స్ మిగిలిన వన్నీ 2 సంవత్సరాల తెలుగు మీడియం కోర్సులు.
4.వ్యవసాయ రంగంలో ఆసక్తి గల వారికి పై కోర్సులు చాలా మంచివి. సీడ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ మరియు వ్యవసాయ పనిముట్లు కంపెనీలందు ఉద్యోగావకాశాలు ఉండును.
5. డిప్లొమా పూర్తయిన తరువాత AGRICET ద్వారా BSc అగ్రి / హార్టి / AH లేదా అగ్రి B. Tech ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం పొందవచ్చు

 

ఇంటర్ -మాథ్స్

1. ఇంటర్మీడియట్లో ఎక్కువ మంది మొగ్గుచూపే గ్రూప్ MPC (మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
2. భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదువగోరు విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఎంపిక చేసుకొనే గ్రూప్ MPC
3.MPC చదివిన విద్యార్థులుకు ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న విద్యాసంస్థలు – IIT (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) & NIT (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) IIT-JEE పరీక్షలో మంచి అర్హత సాధించటం ద్వారా పై సంస్థలలో ప్రవేశం పొందవచ్చు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందుటకు EAMCET లో అర్హత సాధించాలి.
4.MPC చదివి 70% మార్కులు సాధించిన విద్యార్థులు భారతీయ నావికాదళంలో 10+2 ఎంట్రీ స్కీమ్ మీద బీటెక్ ఇంజనీరింగ్ విద్యతో పాటు ఉద్యోగం కూడా పొందవచ్చు.
5. MPC చదివిన విద్యార్థులు నావిక్స్ (GD) గా భారతీయ నావికాదళంలో కోస్ట్ గార్డ్ విభాగంలో ఉద్యోగంలో చేరవచ్చు.
6. MPC చదివి 50% కంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు భారతీయ వైమానికాదళంలో AIRMEN గ్రూప్ – X (టెక్నికల్ గ్రేడ్) మరియు గ్రూప్ – Y (మిడ్ అసిస్టెంట్ గా ప్రవేశం పొందవచ్చు.
7.MPC చదివి 50% కంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు భారతీయ రైల్వేలో స్పెషల్ క్లాస్ అప్పరెంటిషిప్ (SCRA) క్రింద మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తో పాటుగా ఉద్యోగావకాశాన్ని కూడా అందిస్తున్నాయి.
8. MPC విద్యార్థులు BSc డిగ్రీ కోర్సులలో కూడా ప్రవేశం పొందవచ్చు.
=========03- 8===============

ఇంటర్ – సైన్స్

1. ఇంటర్ లో మరొక ముఖ్య విభాగం బయాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ BIPC). ఈ గ్రూప్ ఎంపిక చేసుకున్న విద్యార్ధులు భవిష్యత్ లో మెడిసిన్, పారా మెడికల్, నర్సింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి కోర్సులను
2.వైద్య రంగంలో ప్రపంచ పేరు గాంచిన భారతీయ విద్యా సంస్థ AIIMS (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), ఇందులో ప్రవేశం కొరకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉంటుంది.
3. మన రాష్ట్రంలో మెడిసిన్ మరియు అగ్రికల్చర్ కోర్సులు చదవాలనుకొనే వారు EAMCET మెడిసిన్ విభాగంలో మంచి అర్హత సాధించాలి.

4.BIPC చదివిన విద్యార్ధులు పాలిటెక్నిక్ కళాశాలల్లో 2 సంవత్సరాల ఫార్మసీ డిప్లొమా కోర్సులో, EAMCET లో అర్హత ద్వారా 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులలో చేరవచ్చు.
5.BIPC చదివిన విద్యార్ధులు 2 సంవత్సరాల పారామెడికల్ డిప్లొమా కోర్సులలో కూడా చేరవచ్చు. ఈ కోర్సు అమ్మాయిలకు అనువుగా ఉండే మంచి కోర్సు.
6.BIPC చదివిన విద్యార్థులు 2 సంవత్సరాల MPHW మరియు 3 సం|| GNM నర్సింగ్ కోర్సులు, 4 సంవత్సరాల BSc (నర్సింగ్) కోర్సులలో చేరవచ్చు. ఇవికూడా అమ్మాయిలకు అనువుగా ఉండే మంచి కోర్సులు.
7.BIPC పూర్తయిన తరువాత విద్యార్థులు డిగ్రీ BSc (Bachelor of science) లో కూడా చేరవచ్చు.

మెడిసిన్ కోర్సులు

1.బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS)
2.బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS)
3.బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (BVSC)
4.బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సైన్స్ (BAMS)
5.బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ మరియు సర్జరీ (BHMS)
6.బ్యాచిలర్ ఆఫ్ నాచురోపతిక్ మరియు యోగిక్ సైన్స్ (BNYS)
7.బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ మరియు సర్జరీ (BUMS)
8.బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT)

నర్సింగ్ కోర్సులు

1. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ)-MPHW ఇది 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు. ఇంటర్ చదివిన విద్యార్థులందరూ దీనికి అర్హులే. కానీ BIPC చదివి ఎక్కువ మార్కులు పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ కోర్సును అందిస్తున్న ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ HVT కళాశాల – విశాఖపట్టణం మరియు ప్రభుత్వ ట్రైబల్ కళాశాల – పాడేరు.
2.జనరల్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ నర్సింగ్ (GNM) – ఇది 3 సం॥ల నివాస (Residential) నర్సింగ్ కోర్సు. ఇంటర్లో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్ధులందరూ దీనికి అర్హులు కానీ BIPC విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. దీనిని అందిస్తున్న ప్రభుత్వ సంస్థ KGH – విశాఖపట్టణం
3.BSc (నర్సింగ్) – ఇది 4 సంవత్సరాల కోర్సు. ఇంటర్ BIPC చదివి ఎక్కువ మార్కులు పొందిన విద్యార్ధులు దీనికి అర్హులు దీనిని అందిస్తున్న ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల – విశాఖపట్టణం
4.పోస్ట్ బేసిక్ B.Sc (నర్సింగ్) – ఇది అమ్మాయిలకు మాత్రమే నిర్ధేశించబడ్డ 2 సంవత్సరాల నర్సింగ్ కోర్సు. GNM నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో అర్హత ద్వారా ఇందులో ప్రవేశం కల్పిస్తారు.

ఫార్మసీ కోర్సులు :-

1.డిప్లొమా ఇన్ ఫార్మసీ (D Pharm) – ఇది 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు.. ఇంటర్ BIPC మరియు MPC లో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు ఇందులో ప్రవేశం పొందుటకు అర్హులు. ఈ కోర్సు వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో అందుబాటులో ఉంది.
2. బ్యాచలర్ ఆఫ్ ఫార్మసీ (B Pharm) – ఇది 4 సంవత్సరాల ఫార్మసీ కోర్సు. EAMCET లో మంచి ర్యాంక్ పొందిన BIPC చదివిన విద్యార్ధులు ఇందులో
ప్రవేశానికి అర్హులు.

కొన్ని పారామెడికల్ డిప్లొమా కోర్సులు

1.డిప్లొమా ఇన్ మెడికల్ లాబ్ టెక్నాలజీ (DMLT)
2. డిప్లొమా ఇన్ మెడికల్ ఇమాజింగ్ టెక్నాలజీ (DMIT)
4.డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (Male) (DMHA-M) .
5.డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్ (DANS)
6.డిప్లొమా ఇన్ ఆడియో మెట్రీ టెక్నీషియన్ (DAM)
7. డిప్లొమా ఇన్ ECG టెక్నీషియన్ (DECG)
8.డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్ (DCARDIO)
9.డిప్లొమా ఇన్ అస్లామిక్ టెక్నీషియన్ (DOA)
10.డిప్లొమా ఇన్ అప్టోమెట్రీ టెక్నీషియన్ (DOM)
11.డిప్లొమా ఇన్ కాత్ లాబ్ టెక్నీషియన్ (DCLT)

వ్యవసాయ డిగ్రీ కోర్సులు

*BIPC విద్యార్ధులు EAMCET లో ర్యాంక్ సాధించటం ద్వారా, అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థులు AGRICET లో ర్యాంక్ సాధించటం ద్వారా ఈ క్రింది వ్యవసాయ కోర్సులలో ప్రవేశం పొందే అవకాశం ఉంది.
*BSc (అగ్రి) – అగ్రికల్చర్ BSc, EAMCET లో ర్యాంక్ సాధించటం ద్వారా ప్రవేశం పొందవచ్చు.

*BSc (CA & BM) – BSc ఇన్ కమర్షియల్ అగ్రికల్చర్ & బిజినెస్ మేనేజ్మెంట్
*B.Sc ఇన్ హార్టికల్చర్ . ఇది ఒక సంవత్సర ప్రాక్టికల్ ట్రైనింగ్ తో YSR హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా అందించబడుతున్న 4 సంవత్సరాల కోర్సు.
*B.F.Sc (బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్). ఇది వెటర్నరీ యూనివర్సిటీ ద్వారా అందించబడుతున్న 4 సంవత్సరాల కాల పరిమితి గల కోర్సు.
*B.Tech ఇన్ డైరీ టెక్నాలజీ, ఇది కూడా వెటర్నరీ యూనివర్సిటీ ద్వారా అందించబడుతున్న 4 సంవత్సరాల కోర్సు..
* BSc ఇన్ డైరీ ఫార్మింగ్.

ఇంటర్ సైన్స్ & మాథ్స్ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు

ప్రవేశ పరీక్ష = కోర్సులు

1.IIT-JEE :- 4 years B Tech in IITS & NITS
2.EAMCET ఇంజనీరింగ్ :- 4 Years B Tech రాష్ట్ర యూనివర్సిటీలు & కళాశాలలు
3. ECET :- 4 years B Tech రాష్ట్ర యూనివర్సిటీలు & కళాశాలలు
4 EAMCET- మెడిసిన్ :- 5 years MBBS & 3-4 years BSc, Bpharm etc.
5. AFMC :- ఆర్మీ మెడికల్ కళాశాలలో MBBS
6. AIPMT :- MBBS in AIIMS & కేంద్ర యూనివర్సిటీలు
7. NDA & NAE :- BTech for Army, Airforce & Navy
8. IMUCET :- డిప్లొమా & BSc in నాటికల్ సైన్స్ అగ్రికల్చర్ కోర్సులు
19. CAR JEE :- అగ్రికల్చర్ కోర్సులు

ఇంటర్ == కామర్స్

1.ఇంటర్మీడియట్ లో కామర్స్ కలిగిన గ్రూప్లు CEC (కామర్స్, ఎకనామిక్స్ & సివిక్స్ మరియు MEC (మాథ్స్, ఎకనామిక్స్ & సివిక్స్)
2.ఫైనాన్స్ మరియు బిజినెస్ రంగాలలో ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఇది ఒక మంచి
3.బ్యాంకింగ్. అకౌంటింగ్. టాక్సేషన్, ఇన్స్యూరెన్స్ & షేర్ మార్కెటింగ్ వంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలలో ఉద్యోగావకాశాలు ఉంటాయి.
4.టాక్సేషన్ మరియు అకౌంటింగ్, CA (చార్టెడ్ అకౌంటన్సీ), ICWA (కాస్ట్ అకౌంటింగ్) వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి MEDHA, UIZ వంటి సంస్థలు కోచింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి.
5.బాంక్స్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ భీమా సంస్థల యందు ఉద్యోగావకాశాలు ఉంటాయి.
6.కంప్యూటర్ మరియు టాలీ (అకౌంటింగ్ ప్రొగ్రామ్) నాలెడ్జ్ ఉద్యోగ సంపాదనలో ఉపయోగపడుతుంది.
7. డిగ్రీలో BCom (బ్యాచిలర్ ఆఫ్ కామర్స్), BBM (బ్యాచిలర్ ఆఫ్ మానేజిమెంట్) BC ల ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్) వంటి కోర్సులు కలవు.

ఇంటర్ విద్యార్ధులకు గల ప్రవేశ పరీక్షలు

ప్రవేశ పరీక్ష :-కోర్స్

1.DIETCET:- TTC (టీచర్ ట్రైనింగ్ కోర్సు)
2. CLAT, AILET:-5 Years BL (బ్యాచిలర్ ఆఫ్ లా) కేంద్ర యూనివర్శిటీలలో
3. NCHM JEE :- 3 years BSc ఇన్ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మానేజ్మెంట్
4. AIEED, NIFT :- 4 years B, Design (ఇండస్ట్రియల్, కమ్యూనికేషన్, లైఫ్ స్టయిల్)
5. TISSBAT, ITMHSEE :- సోషల్ వర్క్ లో గ్రాడ్యుయేషన్, డెవలప్మెంట్ స్టడీస్
6. CUCET, BHUUET :- కేంద్ర యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్
7. TEAFL, JNUAEE :- లాంగ్వేజస్ అండ్ ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్
8. APRDC TSRDC :- ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల
9. PECET :- 2 years UGDPED

10వ తరగతి తరువాతఉద్యోగ అవకాశాలు

Organizations (సంస్థలు) ———-Positions (ఉద్యోగం)

1.ఆర్మీ (సైనిక దళం) :- సోల్జర్ (GD), కుక్స్, మ్యుజిషియన్స్
2. నావీ :- సైలర్స్, స్టీవార్డ్స్, కుక్స్, మ్యుజిషియన్స్
3. వైమానిక దళం :- మ్యుజిషియన్స్
4. కోస్ట్ గార్డ్ :- నావిక్స్ (GD)
5. కోర్టులు & ప్రభుత్వ శాఖలు :- అటెండర్ జాబ్స్
6. రైల్వే :- కలాసి (Group D)
7. పోస్టల్ డిపార్ట్మెంట్ :- పోస్ట్మన్, మెయిల్గార్డ్, MTA
8.SSC (కేంద్ర ప్రభుత్వం) :- మల్టీ టాస్కింగ్ స్టాఫ్
9.పారామిలిటరీ బలగాలు (BSF, CRPF, CISF, ITBP) :- కానిస్టేబుల్స్

టెక్నికల్ కోర్సులు

S.No. కోర్సులు సం॥లు
1.ITI కోర్సులు / 1-2 సంవత్సరాలు / ITI (Govt) ITC (Private)/SSC మార్క్స్ -ఆధారంగా
2.డిప్లొమా కోర్సులు / 3-4 సంవత్సరాలు / పాలిటెక్నిక్ CITD / ర్యాంక్ ఆధారంగా
3.ఒకేషనల్ కోర్సులు / 2 సంవత్సరాలు / జూనియర్ కళాశాలలు / SSC మార్క్స్ ఆధారంగా

ఇంటర్ తరువాత ఉద్యోగావకాశాలు (ఏ గ్రూపైన)

కోర్సులు :- ఉద్యోగావకాశాలు

1. బ్యాంకింగ్ సర్వీసులు మరియు జీవిత భీమా సంస్థలు LIC. :- క్లరికల్ జాబ్స్
2. In state Govt-APSPC (AP State public service comm) :-గ్రూప్ – 4 జాబ్
3. In central Govt- SSC (Staff secection commission) :- క్లరికల్ కాన్స్టేబుల్
4. రాష్ట్ర పోలీస్ సర్వీస్ :-
5. పారామిలిటరీ బలగాలు (BSF, CRPF, CISF & ITBP):- హెడ్ కాన్స్టెబుల్
6. ఆర్మీ :- సోల్జర్ (టెక్నికల్), క్లర్క్
7. వైమానికాదళం :- ఎయిర్మెన్ గ్రూప్ Y (Non-Tech)
8. నావి :- అప్రెంటీస్
9.RTC :- కండక్టర్స్
10. పోస్టల్ డిపార్ట్మెంట్ :- పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్

 

గ్రాడ్యుయేషన్ తరువాత గల ఉద్యోగావకాశాలు

జాబ్స్ కి వెళ్ళడానికి అవకాశాలు :-

1.IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్). IPS (ఇండియన్ పోలీస్ సర్వీస్). IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) & IES (ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్)
2. గ్రూప్ 1 & 2 సర్వీసెస్
3.SSC (స్టాప్ సెలెక్షన్ కమీషన్), DSC (డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ) లెక్చరర్స్, టీచర్స్, ఇంటర్టర్స్
4.Bank PO, Insurance, FCI (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)
5. కంపెనీస్ ఫార్మసీ, రిఫైనరీ, స్టీల్ ప్లాంట్
6.సాఫ్ట్వేర్ కంపెనీస్
7.టూరిజం, జర్నలిజం బిజినెస్

డిగ్రీ విద్యార్థులకు గల ప్రవేశ పరీక్షలు

ప్రవేశ పరీక్ష = కోర్సులు

1.Ed CET/PE CET :- 2 years BEd Course / 1 year BPED
2. LAWCET (లా సెట్) :- 3 Years BL (బ్యాచిలర్ ఆఫ్ లా) రాష్ట్ర లా కళాశాలలు
3. GATE (గేట్) :- 2 years MTech & MSc in IIS, IITs etc…
4. PGCET (పేజి సెట్) :- 2 years MSc, M.Com & MA ఇన్ స్టేట్ యూనివర్శిటీ etc…
5. CAT (కాట్) :- 2 years MBA in IIM & సెంట్రల్ యూనివర్శిటీ
6. ICET (ఐసెట్) :- 2 years MBA & MCA ఇన్ స్టేట్ యూనివర్శిటీ etc…
7. NDA NA AFCAT :- ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ కోర్సులు
8. సివిల్ సర్వీస్ పరీక్ష :- IAS, IPS, IFS
9.GRE & TOEFL :- విదేశాలలో చదువు కోసం
10. JAM – 15 :- జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ MSC in IITs

లక్ష్యం ==లక్ష్యం చేరుకొనే మార్గం

1. కానిస్టేబుల్ :- ఇంటర్ కానిస్టేబుల్ ఎగ్జామ్
2.యస్.ఐ :- ఇంటర్ – డిగ్రీ – యస్.ఐ. ఎగ్జామ్
3.వి.ఆర్.ఓ / విలేజ్ సెక్రటరీ :-ఇంటర్- వి. ఒర్.ఓ / విలేజ్ సెక్రటరీ ఎగ్జామ్
4.నేవి :- ఇంటర్ (MPC) నేవి ఎగ్జామ్
5.ఎయిర్ ఫోర్స్ (Aiman) :- ఇంటర్ (MPC)- ఎయిర్మేన్ ఎగ్జామ్
6.ప్రైమరీ టీచర్ :- ఇంటర్- T.T.C (Diet) ఎగ్జామ్ – T.T.C కోర్సు- D.S.C. ఎగ్జామ్
7.హైస్కూల్ టీచర్ :- ఇంటర్- డిగ్రీ – EdSet ఎగ్జామ్ – BEd కోర్సు- D.S.C. ఎగ్జామ్
8.లెక్చరర్ :- ఇంటర్ డిగ్రీ – P.G. కోర్సు- NET/ SET/JL ఎగ్జామ్
9.ఇంజనీర్ :- ఇంటర్ (MPC). EAMCET/IIT JEEJBITSAT ఎగ్జామ్ – BTech.
10.ఇంజనీర్ :- పాలిసెట్ పాలిటెక్నిక్ ECET ఎగ్జామ్ BTech.
11.డాక్టర్ :- ఇంటర్(BIPC)- EAMCET/AIIMS/AFMC ఎగ్జామ్ – M.B.B.S
12.అగ్రికల్చర్ ఆఫీసర్ :- ఇంటర్ (BIPC)- EAMCET ఎగ్జామ్ – B.Sc (Agri)
13.ఫార్మసీ :- ఇంటర్ (MPC & BIPC)- EAMCET ఎగ్జామ్ B.Pharmcy
14.RTO /RDO/MRO/MPDO :- ఇంటర్-డిగ్రీ- గ్రూప్ 1 /గ్రూప్ 2 ఎగ్జామ్
15.ఐ.ఎ.యస్ / ఐ.పి.యస్ :- ఇంటర్ డిగ్రీ – సివిల్ సర్వీస్ ఎగ్జామ్
16.లాయర్ :- ఇంటర్ – LAWCET ఎగ్జామ్ లా కోర్సు
17.చార్టెడ్ ఎకౌంటెంట్ :- ఇంటర్ (M.E.C, C.E.C)- CPT ఎగ్జామ్ – C.A. కోర్సు

డిగ్రీ తర్వాత

1. డిగ్రీ తర్వాత :- PG:-ఎంఏ / ఎంఎస్సీ / ఎంకామ్ / ఇంటిగ్రేటెడ్ పిహెచ్ డి
2. డిగ్రీ తర్వాత :- టీచింగ్:- బీఈడి / బీపిఈ డి / స్పెషల్ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ పండిట్స్
౩. డిగ్రీ తర్వాత :-ప్రొఫెషనల్ కోర్సులు :- MCA / MBA / CA,CS,CMA
4. డిగ్రీ తర్వాత :- జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు:- హాస్పిటాలిటీ, లా, జర్నలిజం ఫారెన్ లాంగ్వేజెస్, ఫ్యాషన్ డిజైనింగ్..
5. డిగ్రీ తర్వాత :- ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులు:- ఫ్రెంచ్ / జర్మన్ /రష్యన్ /చైనీస్
6. డిగ్రీ తర్వాత :- ప్రభుత్వ రంగ ఉద్యోగాలు :- UPSC స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ / SSC / బ్యాంక్ పరిక్షలు
6. డిగ్రీ తర్వాత :- ఎంటర్ ప్రేన్యూర్ షిప్