అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?

అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?

శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. సంపద కోసం, అప్పులు తీరడం కోసం నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అప్లైశ్వర్యాలు చేకూరుతాయి. వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద చేతిలో నిలుస్తుంది. వ్యాపారంలో లాభాలు వుంటాయి.

అరకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం వుంటుంది. కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం సహకరిస్తుంది. ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ వుండదు. ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం వుంటుంది. ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి.

అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?

రెండు వెడల్పాటి ప్రమిదలు తీసుకోవాలి. రాళ్ల ఉప్పును తప్పక శుక్రవారం ఉదయం తీసుకోవడం చేయాలి. కలకండ, అక్షింతలు సిద్ధం చేసుకోవాలి. పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. ఓ చిన్నపాటి బెల్లం ముక్క.. అరటిపండ్లు రెండు, తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు.. ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని.. పూజగదిలో లక్ష్మీ ఫోటోను, లేదా ప్రతిమను శుభ్రం చేసుకుని చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. పువ్వులతో పటాలను అలంకరించుకోవాలి. బియ్యం పిండితో రంగవల్లికలు వేసుకోండి, ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి.

Read More  స్త్రీలు కొన్ని పనులు చెయ్యాలి కొన్ని పనులు చేయకూడదని పెద్దలు పదే పదే అంటుంటారు ఎందుకు

ముందుగా ఇత్తడి ప్లేటును తీసుకుని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమీదలను వుంచాలి. దానిపై నేతితో కానీ, నువ్వుల నూనెతో దీపమెలిగించాలి. ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి.

లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యంగానీ లేదా ఓ చిన్న పాటి బెల్లం ముక్కను పెట్టుకోవచ్చు. ఇక తాంబూలం తప్పక వుండాలి. తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. అంతే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే. ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయం సాయంత్రం వెలిగించి.. శనివారం లేదా ఆదివారం దీపాన్ని ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపేయాలి. అలాకాకుంటే ఇంట్లోని సింక్ లో నీటిని తెరిచి వుంచి వెంటనే ఆ ఉప్పును అందులో పారవేయాలి. ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అప్లైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ఈ దీపం వెలిగించేటప్పుడు కనకధార స్తోత్రాన్ని పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదలను మార్చాల్సిన అవసరం లేదు. అలాగే వాడుకోవచ్చు. ఇలా 9,11,21 వారాలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు దీపం పెట్టినా మంచిది. ఈ ఉప్పు, దీపాన్ని పెట్టిన వారికి శాశ్వతంగా ధన ఇబ్బందులు తొలగిపోతాయి. |

Read More  స్త్రీలు కొన్ని పనులు చెయ్యాలి కొన్ని పనులు చేయకూడదని పెద్దలు పదే పదే అంటుంటారు ఎందుకు

అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?

 

అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?

Sharing Is Caring:

Leave a Comment