Jonna Dosa:ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన జొన్నదోశ‌ ఇలా చేసుకొండి

Jonna Dosa:ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన జొన్నదోశ‌ ఇలా చేసుకొండి

Jonna Dosa : మనకు లభించే వివిధ రకాల ధాన్యాలలో జొన్న ఒకటి. ఈ ధాన్యాలను ఆహారంలో భాగంగా తినడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వీటిని ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జొన్నల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యము మెరుగుపరుస్తుంది. మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సులభంగా లభిస్తాయి. జొన్నలు కేవలం రొట్టెలు మాత్రమే కాకుండా, దోశలను తయారు చేసుకోవచ్చు . ఇవి చాలా రుచికరమైనవి. ఇవి పోష‌కాల‌ను, శ‌క్తిని అందిస్తాయి. జొన్న దోశలను తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Jonna Dosa:ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన జొన్నదోశ‌ ఇలా చేసుకొండి

 

జొన్న దోశ తయారీకి కావలసిన పదార్థాలు:-

జొన్న పిండి- మూడు కప్పులు
మిన‌ప ప‌ప్పు -1 కప్పు
మెంతులు – 1 టీస్పూన్అ
అటుకులు- పావు కప్పు
ఉప్పు- తగినంత
నూనె – పావు కప్పు.

Jonna Dosa:ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన జొన్నదోశ‌ ఇలా చేసుకొండి

జొన్న దోశను తయారు చేసే విధానము :-

మిన‌ప ప‌ప్పు మరియు మెంతులను నీటితో బాగా కడిగి నానబెట్టుకో వాలి . మరొక గిన్నెలో అటుకులను కడిగి నానబెట్టాలి. ఒక మిక్సీ జార్ తీసికొని దానిలో మిన‌ప ప‌ప్పు ,అటుకులను మరియు రుచికి సరిపడా
ఉప్పు వేసి మెత్తగా పట్టుకోవాలి . ఇప్పుడు ఈ మిశ్రమంలో జొన్న పిండిని కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మరోసారి మెత్తగా పట్టుకొని గిన్నెలో వేసి మూత పెట్టాలి. ఈ మిశ్రమాన్ని పది లేదా పన్నెండు గంటల మధ్య పులియబెట్టాలి. ఇలా పులియబెట్టుకున్న పిండిని మ‌రోసారి గ‌రిటెతో బాగా క‌లుపుకోవాలి.

తర్వాత స్టవ్ మీద పెనం పెట్టాలి. పెనం వేడెక్కిన తర్వాత మీరు దానిపై పిండిని దోశగా వేయవచ్చును . నూనె వేసి రెండు వైపులా ఎర్రగా వేయించాలి. దానిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే రుచికరమైన జొన్న దోశ తయారవుతుంది . పల్లీ చట్నీ అల్లం చట్నీ మరియు కొబ్బరి చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అదనంగా జొన్నలోని పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. మీ రోజువారీ ఆహారంలో జొన్నలను చేర్చుకోవడం రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో బాగా సహాయపడుతుంది. శరీరం యొక్క రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.