Pesara Guggillu:రుచికరమైన పెస‌ల‌ గుగ్గిళ్లు ఇలా తయారు చేసుకొండి

Pesara Guggillu:రుచికరమైన పెస‌ల‌ గుగ్గిళ్లు ఇలా తయారు చేసుకొండి

Pesara Guggillu: పెసలు.. అందరికీ సుపరిచితమే. అలాగే వీటిని తినడం వల్ల చాలా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని కూడా మ‌న‌కు తెలుసు. పెసలు మన శరీరానికి కావల్సిన అన్ని పోషకాలను కలిగి ఉంటుంది. పెసలులో విటమిన్ సి విటమిన్ బి, విటమిన్ సి విటమిన్ కె అలాగే వివిధ రకాల ప్రొటీన్లు మరియు మినరల్స్‌ పుష్కలంగా
ఉన్నాయి.

పెసలు జుట్టు మరియు చర్మాన్ని రక్షించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బిపిని నిర్వహించడంలో మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు అధిక బరువును తగ్గించడంలో ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పెసలు అనే పదం విన్నప్పుడల్లా మన మనసులో మెదిలే మొదటి ఆలోచన పెస‌ర‌ట్టు. అయితే పెస‌ర‌ట్టు కాకుండా పెస‌ల‌తో చాలా రుచిగా ఉండే గుగ్గిళ్లను కూడా త‌యారు చేయవచ్చును.
పెసల నుండి గుగ్గిళ్లను తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము .

 

Pesara Guggillu:రుచికరమైన పెస‌ల‌ గుగ్గిళ్లు ఇలా తయారు చేసుకొండి

పెసర గుగ్గిళ్ల తయారీకి కావలసిన పదార్థాలు:-

పెసరలు- 200 గ్రాములు
సరిపడా- నీరు
నూనె – రెండున్నర టీస్పూన్ల
శెనగపప్పు- అర టీస్పూన్
జీలకర్ర- 1/2 టీస్పూన్
ఆవాలు -అర టీస్పూన్
వెల్లుల్లి ముక్కలు- 5
ఎండు మిర్చి- 2
కరివేపాకు -1 రెబ్బ
తరిగిన పచ్చిమిర్చి- 3
తరిగిన ఉల్లిపాయ- 1
పసుపు – చిటికెడు.
ఉప్పు -రుచికి తగినంత

Pesara Guggillu:రుచికరమైన పెస‌ల‌ గుగ్గిళ్లు ఇలా తయారు చేసుకొండి

పెసర గుగ్గిళ్లను తయారు చేసే విధానము:-

ముందుగా పెసలను బాగా కడగాలి, వాటికి సరిపడా నీటిలో రెండు గంటలు నానబెట్టాలి .అలా నానబెట్టిన పెసలను కుక్కర్‌లో వేసి పెసలు మునిగిపోయే వరకు తగినంత నీరు, ఉప్పు మరియు అర టేబుల్ స్పూన్ నూనె వేసి కుక్కర్‌ను మూతపెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలా ఉడికిన పెసలలోని నీటిని జల్లెడ ఉపయోగించి వాడకట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి . దాని మీద ఒక కడాయి పెట్టి అది వేడి అయినా తరువాత దానిలో నూనె పోయాలి. నూనె కాగిన త‌రువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి.

తాలింపు వేగిన తర్వాత ఉడికిన పెసలను కడాయిలో వేసి, మూతపెట్టి, నాలుగు నిమిషాలు ఉంచి తరువాత స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచిగా ఉండే పెసర గుగ్గిలను తయారు అవుతాయి . వీటిని సాయంత్రం పూట స్నాక్స్‌గా తింటే రుచి మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది.