Tomato Vepudu Pappu:రుచికరమైన టమాటో వేపుడు పప్పును ఇలా తయారు చేసుకొండి

Tomato Vepudu Pappu:రుచికరమైన టమాటో వేపుడు పప్పును ఇలా తయారు చేసుకొండి

Tomato Vepudu Pappu : వంటగదిలో తరచుగా ఉపయోగించే పప్పులలో కందిపప్పు ఒకటి. కంది పప్పు మనకు ఆరోగ్యకరం. మనము వివిధ రకాల పప్పు కూరలు సిద్ధం చేయడానికి కంది పప్పును ఉపయోగిస్తాము. కూరల్లో టమాటా పప్పు. టొమాటో పప్పు చాలా రుచిగా ఉంటుంది. మ‌నం త‌రుచూ చేసే ట‌మాటా ప‌ప్పుకు బ‌దులుగా క్రింద వివరించిన విధంగా తయారు చేసిన టమోటా పప్పు రుచికరమైనది.దీనిని వేపుడు ప‌ప్పు, ఎండు మిర‌ప‌కాయ‌ల ప‌ప్పు అని కూడా అంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాటా ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి . దీనికి త‌యారీకి కావ‌ల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Tomato Vepudu Pappu:రుచికరమైన టమాటో వేపుడు పప్పును ఇలా తయారు చేసుకొండి

 

ట‌మాట వేపుడు ప‌ప్పు తయారీకి కావలసిన పదార్థాలు:-

కంది పప్పు – అర కేజీ
తరిగిన టొమాటోలు- 2 (పెద్దవి)
నూనె- 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర- అర టీస్పూన్
ఆవాలు- అర టీస్పూన్
శ‌న‌గ‌ప‌ప్పు-, పావు టీస్పూన్
మెంతులు – పావు టీ స్పూన్‌
ధ‌నియాలు – పావు టీ స్పూన్
పచ్చి వెల్లుల్లి రెబ్బలు- 10
తరిగిన ఉల్లిపాయలు- 2 (మీడియం)
ఎండు మిరపకాయలు – 12
క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు
పసుపు- అర టీస్పూన్
ధనియాల పొడి – అర టీస్పూన్
కారం – అర టీస్పూన్
చింతపండు 10గ్రా.
నీరు- సగం లీటరు
ఉప్పు – రుచికి తగినంత

Read More  Sweet Curd:మ‌ట్టి కుండ‌ను ఉపయోగించి రుచికరమైన స్వీట్ పెరుగును ఇలా తయారు చేయండి

Tomato Vepudu Pappu:రుచికరమైన టమాటో వేపుడు పప్పును ఇలా తయారు చేసుకొండి

ట‌మాట వేపుడు ప‌ప్పు తయారీ చేసే విధానము:-

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ ను పెట్టి వేడి చేసుకోవాలి. అలా వేడి చేసిన కుక్కర్ లో నూనె పోసి వేడి అయినా తరువాత జీలకర్ర,ఆవాలు,శ‌న‌గ‌ప‌ప్పు, మెంతులు, ధ‌నియాలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక తరిగిన ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి 2 నిమిషాలు పాటు వేయించాలి. దీనిలో ఎండు మిరపకాయలను పెద్ద పెద్ద ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమము బాగా వేగిన తరువాత కందిప‌ప్పు, క‌రివేపాకు, ప‌సుపును వేసి కంది ప‌ప్పును ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకోవాలి.

ఇప్పుడు కందిపప్పు వేగాక టొమాటోలు, కారం పొడి, ధనియాల పొడి, కొంచెం నీళ్లు కలపండి. టొమాటో ముక్కలు కొంచెం ఉడికినంత వరకు అలాగే ఉండనివ్వండి. తరవాత ఉప్పు, రుచికి సరిపడా చింతపండు, నీళ్లు కలపాలి. మూతపెట్టి చిన్న మంట మీద నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

Read More  Korra Idli : ఆరోగ్యకరమైన కొర్ర ఇడ్లీని ఇలా తయారు చేయండి

ప‌ప్పు ఉడికిన త‌రువాత ప‌ప్పు గుత్తి, లేదా గంట స‌హాయంతో ఎండు మిర‌ప‌ప‌కాయ‌లను, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను కొద్దిగా మెత్త‌గా చేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఈవిధముగా ట‌మాట వేపుడు ప‌ప్పు తయారువుతుంది.దీనిని వేడి అన్నం మరియు రాగి సంగటితో కలిపి తింటే రుచిగా ఉంటుంది.

Sharing Is Caring: