...

ఆరోగ్యానిచ్చే పండ్లు

ఆరోగ్యానిచ్చే పండ్లు

కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు పండ్లు , మానవుడికి ప్రకృ  ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి.  ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను ఆహారంగా పేర్కొనవచ్చును . ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
మనం నిత్యం కేవలం భోజనం తీసుకోవడం తో మాత్రమే సరిపోదు . . దాంతోపాటు పండ్లు కూడా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యము గా ఉంటాము . వాటిలో చక్కటి పోషకాలతోపాటు రోగనిరోధక శక్తి పెంచే గుణము  కూడా ఉంటుంది . ఏకాకలములో వచ్ఛే   పండ్లు ఆ కాలములో తప్పనిసరిగా తినాలి . అప్పుడే అందానికి అందం , ఆరోగ్యానికి ఆరోగ్యము .
కొన్ని ముఖ్యమైన పండ్లు :
 • మామిడి పండు
 • జామిపండు
 • రేగుపండు
 • బొప్పాయి పండు
 • బేరిపండు
 • సపోటా పండు
 • నేరేడుపండు

 

మామిడి పండు 

మండించే వేసవి మధురమైన మామిళ్లనీ అందించి వేసవి ఎంతో హాయి అనిపించేలా చేస్తుంది. ఎ, మరియు సి విటమిన్లు ఇందులో ఎక్కువ గా ఉంటాయి. ఇందులోని సి- విటమిన్‌ అద్భుత యాంటీఆక్సిడెంట్‌గా  బాగా పనిచేస్తుంది. ఇంకా బీటాకెరోటిన్‌ కంటిజబ్బులను  కూడా దరిచేరనివ్వదు. చిన్నపిల్లలకు ఇది మంచి పోషకాహారం. ఇనుము, పొటాషియంలతోపాటు, కొద్దిపాళ్లలో కాల్షియం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని పాలీఫినాలిక్‌ ఆమ్లాలు పేగు, రొమ్ము, ప్రొస్టేట్‌, ల్యుకేమియా క్యాన్సర్లను కూడా  నిరోధిస్తాయి.

పోషకాలు

వంద గ్రా. మామిడిలో…
శక్తి: 70 క్యాలరీలు
పిండిపదార్థాలు: 17గ్రా.,
బీటా కెరోటిన్‌: 445 మై.గ్రా.,
విటమిన్‌-ఎ: 765 మై.గ్రా,
విటమిన్‌ఇ : 1.12 మై.గ్రా.,
విటమిన్‌ కె: 4.2 మై.గ్రా.,
పొటాషియం: 156 మి.గ్రా.,
ప్రొటీన్లు: 0.5గ్రా.,
సి-విటమిన్‌: 27.7 మి.గ్రా.,
పీచు: 1.8గ్రా.
దీని శాస్త్రీయ నామము ” Mangifera Anacardiaceae ” . పండుగా మారకముందు పులుపు గా ఉంటుంది . కుర గా , పచ్చడి గా వాడుదురు . మామిడిలో———–
విటమిన A,C,E , phytochemikals ,polyphenols ,17 amino acids, లు ఎక్కువ  గా ఉంటాయి .
రక్తపోటు బాధితులకు అవసరమయిన ‘పొటాసియం ‘ ఎక్కువ గా ఉంటుంది .
పీచు పదార్ధము అధికం గా ఉన్నందున విరోచనం సాఫీగా అవుతుంది .ఎక్కువగా తింటే ఉడుకు విరోచనాలు కూడా పట్టుకుంటాయి .
మామిడి పండు రసం వీర్య వృద్ధి ని  బాగా కలిగిస్తుంది ,
పాల  మామిడి పండు తో కలిపి తీసుకుంటే బలాన్నిస్తుంది .
రక్తం లో కొలెస్టరాల్ ని కూడా  తగ్గిస్తుంది ,
చర్మ సౌందర్యాన్ని  బాగా  పెంచుతుంది ,
మామిడి రసం వల్ల విరేచనాలవుతాయనుకోవడం అపోహ! మామిడి పండులో ప్రేవులపైన దుష్ప్రభావం చూపే అంశాలేమీ లేవు. అయితే ఒక్కోసారి మామిడి పండ్లు విష పదార్థాలతో కలుతమయ్యే అవకాశం కూడా ఉంది. మాగేసేటప్పుడు గాని, రసం తినేటప్పుడు గాని ఇలా జరిగేందుకు వీలుంది. ఇలాంటి కలుషిత పదార్థాలవల్ల గాని, సూక్ష్మక్రిముల వల్ల గాని సాధారణంగా విరేచనాలవుతుంటాయి.
మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతమందికి ‘సెగ గడ్డలు’కూడా  వస్తుంటాయి. శరీరంలో దాగివున్న ‘వేడి’ని బయటకు తెచ్చే గుణం మామిడికి ఉండటాన ఇలా జరుగుతుంది. వేడి శరీర తత్వం ఉన్నవారు మామిడి పండ్లను పరిమితంగా తినడం మంచిది. సోరియాసిస్ గాని, ఇతర చర్మవ్యాధులు గాని ఉన్నవారు, ప్రేవుల్లో అల్సర్లు ఉన్నవారూ మామిడిని తినడం మంచిది కాదు. అలాగే మధుమేహ వ్యాధి నియంత్రణలో లేనివారు కూడా.
  నేరేడు పండ్లు మామిడి పండ్లకు విరుగుడుగా  బాగా పనిచేస్తాయి. ఒకవేళ మామిడి పండ్లను ఎక్కువగా తిన్నట్లయితే దానికి విరుగుడుగా నాలుగైదు నేరేడు పండ్లను గాని, చిటికెడు వాము పొడిని గాని మరియు  జీలకర్రను గాని డికాక్షన్ కాచి తీసుకుంటే సరిపోతుంది.
మామిడి సీజనల్‌గా మాత్రమే దొరుకుతుంది. అయితే, సంవత్సరం పొడవునా మామిడిని వాడుకోవాలనుకునేవారు ‘ఆమ్‌చూర్’ రూపంలో  కూడా వాడుకోవచ్చు. మామిడి దొరికే సీజన్‌లో తాజా కాయలను సేకరించి నిలువునా కోసి ఎండబెట్టాలి. ఈ ముక్కలను తాజా మామిడికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చును .
 పచ్చి మామిడిలో విటమిన్-సి, విటమిన్-బి1, బి2లు సమృద్ధిగా ఉంటాయి.
మామిడిలో విటమిన్-సి అధికంగా ఉండటంవల్ల పచ్చి మామిడిని రక్తస్రావాలలో రక్తాన్ని నిలువరించడానికి కూడా వాడవచ్చు. కొంతమందికి ఆహారం మామూలుగా తీసుకుంటున్నా, ఆహారం ద్వారా ఐరన్ శరీరంలోనికి తగినంతగా విలీనం కాదు. అటువంటివారు పచ్చి మామిడిని వాడటంవల్ల ఫలితం బాగా  ఉంటుంది. విటమిన్-సి ఇనుము శరీరంలోనికి విలీనమవ్వడానికి సహాయపడుతుంది.
మామిడిని పచ్చిగా, దోరగా, పండుగా ఎలాగైనా వాడుకోవచ్చు. పచ్చిది తెచ్చి వరిగడ్డిలో మాగేస్తే మాగుతుంది. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచుకోదలిస్తే ముందుగా మామిడిని కడిగి నిట్టనిలువుగా రెండుగా కోయాలి. ఒకో భాగాన్ని బోర్లించి తొక్క తొలగించి ముక్కలుగా కోయాలి. లేదా, ముందుగానే తొక్కను తొలగించి ఆ తరువాత ముక్కలుగా తరగవచ్చును . ఒకవేళ పండినది వాడాల్సివస్తే ముందుగా బల్లపరపుగా ఉన్న రాయిమీద రసం మెత్తబడేలా అదిమి, రసం పిండాలి.
ఔషధోపయోగాలు  
పాదాల పగుళ్ళు: మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్ళు కలిపి పేస్టులాగా  తయారు చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనం చేసుకోవాలి. దీనితోపాటు ప్రతిరోజూ బూట్లు, సాక్సులు ధరించటం ముఖ్యం. పంటినొప్పి, చిగుళ్ళ వాపు: రెండు కప్పులు నీళ్ళు తీసుకొని మరిగించాలి. దీనికి రెండు పెద్ద చెంచాలు మామిడి పూతను వేసి మరికొంతసేపు మరగనివ్వాలి. స్టవ్‌మీద నుంచీ దింపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. అవసరమనుకుంటే ఇలా రోజుకు రెండుమూడుసార్లు చేయవచ్చును .
కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరుపరచి బాగా ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక సీసాలో భద్రపరచుకొని కొన్నిరోజులపాటు మజ్జిగతో కూడా కలిపి తీసుకోవాలి.
ఆర్శమొలలు (రక్తయుక్తం): అర చెంచాడు మామిడి జీడిని పొడి రూపంలో పెరుగు మీది తేటతో కలిపి తీసుకోవాలి.
జ్వరం: మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్ళకు, అరి చేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి బాగా తగ్గుతుంది.
బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనెను గాని, నువ్వుల నూనెను తీసుకొని మామిడి కాయలను  బాగా ఊరేయండి. ఇలా సంవత్సరంపాటు మాగేసి తల నూనెగా వాడుకోవాలి.
చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకుల నుంచి రసం తీసి కొద్దిగా వేడిచేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి.
ముక్కునుంచి రక్తస్రావం: మామిడి జీడినుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా  కూడా వేసుకోవాలి.
కంటినొప్పి: పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పులపైన సుఖోష్టంగా ఉండేలా వేడిచేసి మూసి వుంచిన కన్నుపైన ‘పట్టు’ వేసుకోవాలి.
దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండించి బూడిద అయ్యేంతవరకూ మండించండి. దీనికి ఉప్పుకలిపి టూత్ పౌడర్‌లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవ నూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను ‘డస్టింగ్ పౌడర్’లా వాడితే గాయాలు త్వరగా కూడా నయమవుతాయి.
ఎగ్జిమా: మామిడి చెట్టు బెరడును, నల్ల తుమ్మ బెరడును తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోండి. రోజూ పిడికెడంత మిశ్రమాన్ని తీసుకొని అర లీటరు నీళ్ళలో వేసి ఆవిరి వచ్చేవరకూ బాగా మరిగించి, ఆవిరిని ఎగ్జిమా సోకిన ప్రదేశానికి తగిలేలా చేయాలి. తడి ఆరిన తర్వాత నెయ్యి  బాగా  రాసుకొని మర్ధనా చేసుకోవాలి.
పుండ్లు: మామిడి బెరడును చిన్న చిన్న పీలికలు అయ్యేంతవరకూ దంచి, నీళ్ళలో వేసి మరిగించండి. ఈ డికాక్షన్‌తో పుండ్లను, వ్రణాలను కడిగితే త్వరగా మానతాయి.
నీరసం: మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్‌వాటర్లను చిలకరించి కూడా ఆస్వాదించండి.
వడదెబ్బ: పచ్చి మామిడికాయను నిప్పుల మీద వేడిచేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్ళను, పంచదారను చేర్చి తాగాలి. దీనివల్ల దప్పిక తీరడమే కాకుండా ఎండల తీక్షణతవల్ల కోల్పోయిన శక్తి కూడా  తిరిగి వస్తుంది.
చెమట కాయలు: రెండు పచ్చి మామిడి కాయలను గిన్నె లో నీళ్ళుపోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత గుజ్జును పిండి పంచదార మరియు  ఉప్పు కలిపి సేవించండి. దీనివల్ల శరీరంలో వేడి తగ్గి, ఒళ్లు పేలకుండా ఉంటుంది.
మధుమేహం: లేత మామిడి ఆకులను, వేప చిగుళ్ళను సమానభాగాలు తీసుకొని మెత్తగా నూరి ముద్దగా  తయారు చేయాలి. దీనిని నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహంలో హితకరంగా ఉంటుంది. ఇదే విధమైన యోగం మరోటి వుంది. మామిడి పూతను, మామిడి పిందెలను, ఎండిన నేరేడు గింజలను తీసుకొని మెత్తగా చూర్ణం చేసి భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజు చిన్న చెంచాడు మోతాదుగా తీసుకోవాలి. ఇది మధుమేహ రోగులకు ఉపయోగకారి.
స్టీృన్ (ప్లీహం) పెరుగుదల, కాలేయపు సమస్యలు: గుప్పెడు మామిడి గుజ్జుకు చిన్న చెంచాడు తేనెను కలుపుకొని మూడుపూటలా తాగండి. కాలేయపు సమస్యల్లో మామిడి గుజ్జును పాలతో కలిపి తీసుకోవాలి.
విరేచనాలు: మామిడి టెంకను పగులకొట్టి దీనిలోని జీడిని వేరుపరిచి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దీని బరువుకు సమానంగా సోపు (శతపుష్ప) గింజలను తీసుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా చూర్ణం చేసుకోవాలి. తర్వాత రెండు చూర్ణాలను బాగా కలిపి పలుచని గుడ్డతో జల్లించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చెంచాడు చొప్పున వేడి నీళ్ళతో తీసుకోవాలి. దీనితోపాటు మామిడి బెరడు లోపలి పొరను పేస్టులాగా చేసి బొడ్డు చుట్టూ రాస్తే ఇంకా మంచిది. మామిడి జీడే కాకుండా మామిడి పూత కూడా విరేచనాలను ఆపడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎండిన మామిడి పూతను తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇంతే కాకుండా మామిడి పూతను, దానిమ్మ పువ్వులను కలిపి ఎండించి, పొడిచేసి మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు.
“పచ్చి మామిడి” వేసవితాపం భరించలేక వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.
వేసవిలో సంభవించే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా.. పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే.. జాండీస్ (పచ్చ కామెర్లు) వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చును . అంతేగాకుండా మామిడి గుండెకు మంచి టానిక్‌లాగా బాగా పనిచేస్తుంది. పచ్చి మామిడికాయలో విటమిన్ సీ పుష్కళంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది. అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి.. ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అలా తిన్నట్లయితే ఆర్ధరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామిడిని పరిమితంగా తినటం మంచి పద్ధతి.

Glucose control with mango-మామిడితో గ్లూకోజు అదుపు!
చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే వేరు. ఇవి వూబకాయుల్లో చక్కెర స్థాయులు మెరుగుపడటానికి దోహదం చేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. రొమ్ముకణాల్లో వాపును అదుపుచేయటానికీ తోడ్పడుతున్నట్టూ బయటపడింది.
రోజూ మామిడిని తినటం వల్ల వూబకాయులపై పడే ప్రభావాలపై ఓక్లహామా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒకొకరికి 10 గ్రాముల మామిడి తాండ్రను (ఇది 100 గ్రాముల తాజా మామిడిపండ్లతో సమానం) తినిపించారు. పన్నెండు వారాల తర్వాత పరిశీలించగా.. వీరి రక్తంలోని గ్లూకోజు మోతాదులు గణనీయంగా తగ్గినట్టు తేలింది. ”అధిక కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న ఎలుకల్లో మామిడిపండ్లు గ్లూకోజు మోతాదులను మెరుగుపరుస్తున్నట్టు గత పరిశోధనలో తేలిన అంశాన్ని తాజా అధ్యయన ఫలితాలు బలపరుస్తున్నాయి” అని అధ్యయన నేత డాక్టర్‌ లూకాస్‌ చెబుతున్నారు. అయితే మామిడిలోని ఏయే పాలీఫెనోలిక్‌ రసాయనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందంటున్నారు.
మరోవైపు- మామిడిలోని పాలీఫెనాల్స్‌ రొమ్ముల్లోని క్యాన్సర్‌, క్యాన్సర్‌ రహిత కణాల్లో వాపు ప్రతిస్పందనను అదుపుచేస్తున్నట్టు ఇంకో అధ్యయనంలో  కూడా బయట పడింది.

జామిపండు 

పేదవాడి ఆపిల్‌ అని చిన్నచూపు చూస్తాం కానీ మన పెరట్లో కాసే జామలో ఆపిల్‌లో కన్నా పోషకాలెక్కువ. సిిట్రస్‌ జాతి పండ్లలో కన్నా ఇందులో సి -విటమిన్‌ నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువ. ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. హృద్రోగాలతోపాటు అనేక రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ఇందులోని పీచు మలబద్ధకాన్ని బాగా  తగ్గిస్తుంది. కాల్షియం, ఐరన్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి. సోడియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు వ్యర్థాలను తొలగించడంలో మూత్రపిండాలకు  బాగా సాయపడతాయి. దంత పరిరక్షణకూ జామ దివ్యౌషధం.
జామ మొక్కలు మిర్టిల్‌ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో,మధ్య మరియు దక్షిణ అమెరికాలకు జాతీయ మైనవి. జామపండు, 4 సెం.మీ నుండి 12 సెం.మీ పొడవు ఉండి చూడడానికి ఏపిల్‌ పండులాగాని, బేరి పండులాగ గాని ఉంటుంది. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీవర్ణం కలిగి తియ్యగా ఉండి కమ్మని వాసనతో ధృడమైన పచ్చని పై తొడుగు కలిగి ఉంటుంది. స్ట్రా బెర్రీ జామ (పి. కాటిల్‌ యానమ్‌) బ్రెజిల్‌ దేశంలో పుట్టి, ఎర్రని పళ్లు కలిగి ఉంటుంది. ఈ పళ్లు పై పొర గరకుగా లోపలి గుజ్జు ఎర్రగా, రుచికి స్ట్రాబెర్రీ లాగ ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన సువాసనతో నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా కలిగి ఉంటుంది. జామపండు లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ వర్ణం కలిగి ఉంటుంది. లోపలిగింజలు గట్టిగా ఉండి, పండుకూ పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది.
 పెక్టిన్‌ నిల్వలు పైన తొడుగులో ఎక్కువగా ఉండటం చేత ఉడికించిన జామను కాండీలు (అమెరికాలోని స్వీట్స్‌) జాములు, నారింజతో చేసే జాములు, రసాల తయా రీలో కూడా ఉపయోగిస్తారు. టొమాటోలకు బదులు గా, ఎర్రజామ ఉప్పుతో చేసే ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. జామ పళ్ల నుంచి, ఆకులనుంచి ‘టీ’ కూడా తయారు చేస్తారు. పోషకవిలువలు జామపళ్లను ‘మేలైన ఫలాలుగా’ పేర్కొనవచ్చును . ఎందుకంటే వీటిలో విటమిన్‌ ‘ఏ’ మరియు విటమిన్‌ ‘సి’ నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి.
జామపండులో విటమిన్‌ ‘సి’ నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. వీటిలో మినరల్స్‌, పొటాషియం మరియు  మెగ్నీషియం నిల్వలు అధిక మొత్తాలలో ఉండి సాధారణంగా అవసరమైన పోషకాలు తక్కువ కేలరీలలో ఉంటాయి. జామపళ్లలో ఉండే కెరటోనాయిడ్లు, పొలీఫెనాల్స్‌- ఇవి ఆక్షీకరణం కాని సహజరంగు కలిగించే గుణాలు ఈ పళ్లకి ఎక్కువ ఏంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలనుబాగా  కలుగజేస్తాయి. ఔషధపరమైన ఉపయోగాలు నాటు వైద్యంలో 1950 సంవత్సరం నుంచి జామ ఆకులు వాటిలోని విభాగాలు, ఔషధ లక్షణాలు పరిశోధ నలలో అంశంగా ఉన్నాయి. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు.  జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా కూడా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు.
ఆహార విలువ–జామ తినే భాగం 100 గ్రా.లలో
కాలరీలు 36-50
తేమ 77-86 గ్రా
పీచు 2.8-5.5. గ్రా
ప్రొటీన్స్‌ 0.9-1.0 గ్రా
క్రొవ్వు 0.1-0.5 గ్రా
యాష్‌ 0.43-0.7 గ్రా
కార్బోహైడ్రేట్లు 9.5-10 గ్రా
కాల్షియం 9.1-17 గ్రా
పాస్ఫరస్‌ 17.8.30 మి.గ్రా
ఐరన్‌ 0.30-70 మి.గ్రా
కెరోటీన్‌ (విటమన్‌ ‘ఏ’) 200-400
ఎస్కార్బిక్‌ ఆవ్లుము (విటమిన్‌ ‘సి’) 200-400 మి.గ్రా.
ధియామిన్‌ (విటమిన్‌ బి1) 0.046 మి.గ్రా
రిబోప్లేవిన్‌ (విటమిన్‌ బి2) 0.03-0.04 మి.గ్రా
నియాసిన్‌ (విటమిన్‌ బి3) 0.6-1.068 మి.గ్రా

ఉపయోగాలు :
 
వ్యాధినిరోధక శక్తి ని కూడా పెంచుతుంది .
శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది ,
కణజాలము పొరను కూడా   రక్షిస్తుంది ,
కొలెస్టిరాల్ ను  బాగా తగ్గిస్తుంది ,
జామ ఏడాది పొడవునా అడపాదడపా లబిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది . ప్రపంచం లొ అన్ని దేశాలలో ను లభిస్తుంది .  ఆసియా దేశాలలొ విసృతం గా పండుతుంది . కమలా పండు లో కంటే ఐదు   రెట్లు అధికం గా విటమిను ” సి ” ఉంటుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయ లో ఉంటుంది . చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచేందుకు అవసరమయ్యే ” కొల్లాజన్ ” ఉత్పత్తికి ఇది కీలకము .  కొవ్వు మెటబాలిజం ను ప్రభావితం జేసే ” పెక్టిన్” జామ లొ లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి , పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడం లో సహకరిస్తుంది . జామ లొ కొవ్వు , క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు .

రేగుపండు :

రేగుపండు చెర్రీ, బేరి పండ్ల జాతికి చెందినది. ఈ పండు మంచి అరుగుదలకు కారణమయ్యే పీచును కలిగి వుండి జీర్ణవ్యవస్థను మెరుగు పరచటంలో ఎంతో సహాయం చేస్తుంది.

ప్రయోజనాలు
: రేగు పండ్లలో అవి పచ్చివి కాని ఎండబెట్టినవి కాని వీటిలో నియోక్లోరోజనిక్‌, క్లోరోజనిక్‌ ఆమ్లమనే ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియంట్స్‌ ఉన్నాయి. అవి యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తాయి. ఇవి శరీరానికి ఎంతో లాభం చేకురుస్తాయి.
రేగుపండ్లలో యాంటీ ఆక్సిడెంట్‌లు ఎక్కువ గా ఉండటం వల్ల న్యూరాన్‌కు కొవ్వు, కణం యొక్క పొరలో ఉండే కొవ్వుకు జరిగే హానిని ఆపుతుంది. రేగుపండు తినటం వలన శరీరంలో ఇనుము తయారవ్వటం, శరీరం ఇనుమును పోషించుకోవటం తేలిక అవుతుంది. తద్వారా రక్తప్రసరణ మెరుగై ఆరోగ్యకర కణజాలాలు బాగా  పెరుగుతాయి. రేగుపండును తరచుగా తినటం వల్ల కంటికి సంబంధిచిన నాళాలు శిథిలమవ్వకుండా కాపాడబడతాయి. అలాగే ఇతర ఇన్‌ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. దానివల్ల మన కళ్ళు ఆరోగ్యంగా ఉండి చూపు మెరుగవుతుంది.
రేగుపండులో ఉన్న క్యాన్సర్‌ నిరోధక పదార్థాలు శరీరంలో పెరిగే క్యాన్సర్‌, కణుతులను ఆపివేయటంలో సహాయం చేస్తుందని పరిశోదకులు కూడా  కనుగొన్నారు. రేగుపండులో ఉన్న శుభ్రపరిచే గుణం, రక్తాన్ని శుద్ధిచేసి గుండెకు ఏ విధమయిన ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. రేగుపండులో ఉన్న సి విటమిన్‌ ఉబ్బసం పెద్దపేగుల క్యాన్సర్‌, నొప్పులతో కూడిన కీళ్ళవాతం, దీర్ఘకాల కీళ్ళవాతం నుండి శరీరంను రక్షిస్తుంది. రేగుపండు యొక్క చిక్కని రసం మనుషులో వచ్చే ఇన్‌ఫ్లూయంజాను తగ్గించటంలోనూ, రాకుండా ఆపటంలోనూ బాగా పనిచేస్తుంది.

బొప్పాయి పండు  

మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం మరియు  బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. 2007 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు అంచనా. ముఖ్యంగా కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ, పరమాత్ముని కాయ, మదన ఆనపకాయ అని  కూడా బొప్పాయిని పిలుస్తుంటారు.
బొప్పాయి పండులో వున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ “ఏ”, విటమిన్ “బీ”, విటమిన్ “సీ”, విటమిన్ “డీ”లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో papain అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం పూర్తిగా శుభ్రంగానున్నట్లే లెక్క. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తనపని తాను చేసుకుంటూ పోతుంటుంది.

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు

శక్తి 40 kcal 160 kJ
పిండిపదార్థాలు 9.81 g
– చక్కెరలు 5.90 g
– పీచుపదార్థాలు 1.8 g
కొవ్వు పదార్థాలు 0.14 g
మాంసకృత్తులు 0.61 g
విటమిన్ A 55 μg 6%
థయామిన్ (విట. బి1) 0.04 mg 3%
రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.05 mg 3%
నియాసిన్ (విట. బి3) 0.338 mg 2%
విటమిన్ బి6 0.1 mg 8%
విటమిన్ సి 61.8 mg 103%
కాల్షియమ్ 24 mg 2%
ఇనుము 0.10 mg 1%
మెగ్నీషియమ్ 10 mg 3%
భాస్వరం 5 mg 1%
పొటాషియం 257 mg 5%
సోడియం 3 mg 0% శాతములు,
కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు మరియు పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం.
 •  మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా కూడా  లభిస్తాయి.
 •  కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.
 •  బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి బాగా తోడ్పడుతుంది.
 •  విటమిన్‌ బి (రైబోఫ్లెవిన్‌ 250 మైక్రోగాములు) నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
 •  బొప్పాయి ‘కాయ’ జీర్ణానికి తోడ్పడితే, ‘పండు’ పోషకాలనిస్తుంది.
 •  బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చును . యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.
 •  కొలెస్ట్రాల్‌ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చును .

 

ఇతర ఉపయోగాలు

బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది.
 •  బొప్పాయిలోని తెల్లని గుజ్జుని మొహనికి రాయడంవల్ల మంచి మెరుపు వస్తుంది.మొటిమలూ కూడా  తగ్గుతాయి.
 •  బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డుచర్మానికి ఎంతో మంచిది. అందుకే సబ్బులు, క్రీముల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు.
 •  బొప్పాయి పండు తింటే హృద్రోగాలూ, కోలన్‌ క్యాన్సర్లూ రావు. పండులోని బీటా కెరోటిన్‌ క్యాన్సర్‌నీ రాకుండా నిరోధిస్తుంది.
 •  ఆస్తమా, కీళ్లవ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది.
 •  మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు.
 •  ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.
 •  బొప్పాయిపండులోని పీచు మొలల్నీ రానివ్వదు.
 •  బొప్పాయిపండు తినడంవల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి… వంటివీ కూడా తగ్గుతాయి.
 •  బొప్పాయిపండు తామర వ్యాధిని  బాగా తగ్గిస్తుంది.
 •  పచ్చికాయ అధిక రక్తపోటుని (హై బీపీ) నియంత్రిస్తుంది.
 •  శృంగారప్రేరితంగానూ కూడా  పనిచేస్తుంది.
 •  గింజల్లో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంథెల్‌మింటిక్‌ గుణాలు మెండు. అందుకే కడుపునొప్పికీ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకీ వీటిని మందుగా కూడా వాడతారు.
 •  కొన్నిచోట్ల ఆకుల రసాన్ని హృద్రోగాలకు ఔషదంగా ఉపయోగిస్తారు.
 •  డయాబెటిస్‌ కారణంగా వచ్చే హృద్రోగాల్ని పచ్చి బొప్పాయి తగ్గిస్తుంది.
 •  బొప్పాయిలోని పపైన్‌ను ట్యాబ్లెట్‌గా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా కూడా వాడుతున్నారు.
 •  ఈ పపైన్‌ గాయాల్ని మాన్పుతుంది. ఎలర్జీల్ని తగ్గిస్తుంది. అందుకే గాయాలమీదా పుండ్లపైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి.
 •  పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్‌ ఆయింట్‌మెంట్‌ తయారుచేస్తారు.
 •  నొప్పి నివారిణిగానూ( పెయిన్‌కిల్లర్‌) పపైన్‌ గొప్పదే. అందుకే నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్‌ చేస్తారు.
 • జాగ్రత్తలు
 • బొప్పాయి కాయలు గర్భస్రావాన్ని కలుగజేస్తాయి. దీనికి ముఖ్యకారణం అందులో ఉండే ‘పపైన్‌’ (పాలు). ఇది గర్భాశయంలో ప్రారంభదశలో ఉన్న అభివృద్ధి చెందుతున్న పిండం చుట్టూ ఉండే ప్రొటీనులను కరిగించివేస్తుంది. అందువల్ల గర్భిణిస్త్రీలు, పాలిచ్చు తల్లులు బాగా పండిన బొప్పాయి పండు తినటం మంచిది.
 • బొప్పాయి పాలు దురదకు కారణమవుతాయి. అందుకే పచ్చి బొప్పాయి కోసేటప్పుడు ఒంటికి తగలనివ్వకూడదు.
 • పండు, గింజలు, ఆకులు, పాలల్లో కారైశ్బన్‌ అనే యాంథెల్‌మింటిక్‌ ఆల్కలాయిడ్‌ ఉంటుంది. ఇది ఎక్కువయితే చాలా  ప్రమాదకరం.
 • క్యారెట్‌ మాదిరిగానే బొప్పాయిని ఎక్కువగా తింటే కెరటెనిమియా వ్యాధి వస్తుంది.

 

బేరిపండు :

బేరిపండు తియ్యగా, రుచిగా ఉంటుంది. ఇది యాపిల్స్‌కు, సీమ దానిమ్మకు దగ్గర సంబంధం కలిగి వుంది. ఈ పండు యొక్క తోలు పసుపు, ఆకుపచ్చ, గోధుమ లేదా ఎరుపురంగులలో గాని లేక రెండు మూడురంగుల కలయికతో గాని ఉంటుంది. లోపలిభాగం తెలుపు లేక లేత పసుపురంగులో ఉంటుంది. బాగా తియ్యగా, రసాత్మకంగా ఉంటుంది. ఈ కండలోపల మధ్యలో గింజలుంటాయి.ఈ పండు కండభాగం చాలా వెడల్పుగా గుండ్రంగా ఉండి పైకి వచ్చేకొద్దీ సన్నబడుతూ వుంటుంది.రూపం రంగు, రుచి, పరిమాణం నిల్వ వుండే లక్షణాల మీద అధారపడి ఎన్నోరకాలుగా మనకు లభిస్తాయి.
శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ వలన కలిగే ఆక్సిజన్‌కు సంబంధించిన హాని నుంచి బేరిపండులో పుష్కలంగా విటమిన్‌ సి కలిగి వుండటం చేత యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాల వలన శరీరాన్ని రక్షిస్తాయి. ఈ పండులో ఉన్న పీచు మలబద్దకాన్ని తగ్గించటంలో కూడా సహాయం చేస్తుంది. శరీరంలోని మలాన్ని బయటకు పంపటంలో క్రమత్వాన్ని ఇస్తుంది.
బేరిపండును తినటం వలన స్త్రీలలో మెనోపాజ్‌ తర్వాత వచ్చే వక్షోజాల క్యాన్సర్‌ రాకుండా ఆపవచ్చు. బేరిపండును హైపోఎర్జనిక్‌ పండు అంటారు. ఇది మిగతా అన్ని పళ్ళతో పోలిస్తే దీనివలన కలిగే వ్యతిరేక పరిణామాలు తక్కువ. క్రమం తప్పకుండా బేరిపండ్లు తింటే వయసురీత్యా కలిగే కండరాల శైధిల్యాన్ని ఆపవచ్చును . కండరాల శైధిల్యం వలన వయసు పైబడిన వారిలో దృష్టిలోపం ఏర్పడుతుంది. బేరిపండు రక్తపోటును తగ్గించి గుండెపోటు రాకుండా ఆపుతుంది. ఇందులో ఉన్న పెక్టిన్‌ కొవ్వును తగ్గించటంలో బాగా  ఉపయోగ పడుతుంది.
పెద్దపేగు ఆరోగ్యంగా పనిచేయటానికి ఈ పండు సహాయపడుతుంది. బేరిపండు రసంలో గ్లూకోజు, ఫ్రక్టోజు పుష్కలంగా ఉండటం వలన తక్షణశక్తి కూడా  లభిస్తుంది. ఒక గ్లాసు బేరిపండు రసం తాగితే జ్వరం త్వరగా తగ్గుతుందని చాలామంది నమ్ముతారు. రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచటానికి ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు  బాగా సహాయం చేస్తాయి.
శరీరంలోని వివిధ భాగాల్లో వచ్చే వాపు, మంట, నొప్పి తగ్గడానికి బేరిపండు రసం ఎంతో మంచిది. బేరిపండులోని బొరాన్‌ శరీరంలోని క్యాల్షియం నిలిచి వుండేట్లు చేసి తద్వారా ఎముకల క్షీణతను అరికడుతుంది. బేరిపండులో ఉన్నటువంటి ఫాలైట్‌ పసిపిల్లలలో న్యూరాల్‌ ట్యూబ్‌ లోపాలను రాకుండా ఆపుతుంది.

సపోటా పండు :

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృ తి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం…..ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
సపోటా (Sapodilla – Manilkara zapota), ఒక సతత హరితమైన చెట్టు. ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో  బాగా పెరుగుతుంది. భారత ఉపఖండం, మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను పండ్లకోసం కూడా పెంచుతారు. స్పానిష్ పాలకులు ఫిలిప్పీన్స్‌లో ఈ పంటను ప్రవేశపెట్టారు. సపోటా చెట్టు 30-40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలికి తట్టుకోగలదు. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది. (gummy latex called chicle.) ఆకులు ఒకమాదిరి పచ్చగా, నునుపుగా ఉంటాయి. అవి 7-15 సెంటీమీటర్ల పొడవుంటాయి, . తెల్లటి, చిన్నవైన పూలు గంట ఆకారంలో ఆరు రేకలు గల corolla తో ఉంటాయి. సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా, 4-8 సెంటీమీటర్లు వ్యాసంతో ఉంటుంది. ఒకో పండులో 2 నుండి 10 వరకు గింజలు ఉంటాయి.
 పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా, కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా పండు చాలా తీయగా ఉంటుంది. కాయగా ఉన్నపుడు గట్టిగా ఉండే గుజ్జు భాగం పండినపుడు బాగా మెత్తగా అవుతుంది. పచ్చి కాయలలో సపోనిన్ అనే పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది tannin లాంటి పదార్ధమే. ఇది తింటే నోరు ఎండుకుపోతుంది. (తడి ఆరుతుంది) గింజలు కొంచెం పొడవుగా ఉండి, ఒక ప్రక్క ములుకుదేరి ఉంటాయి. సపోటా చెట్లు సంవత్సరానికి రెండు కాఫులు కాస్తాయి. పూవులు సంవత్సరం పొడవునా ఉంటాయి. పచ్చి కాయలో latex (జిగురు లేదా పాలు అంటారు.) ఎక్కువ ఉంటుంది.
 ఈ కాయలు చెట్టున ఉన్నపుడు పండవు. కోశిన తరువాతనే పండుతాయి. ఇదివరకు సపోటా (Sapodilla)ను Achras sapota అనేవారు కాని ఇది సరైన పేరు కాదు. భారతదేశంలో “చిక్కూ” లేదా “సపోటా’ అంటారు . బెంగాల్ ప్రాంతంలో “సొఫెడా” అంటారు. దక్షిణాసియా, పాకిస్తాన్‌లలో “చికో” అని, ఫిలిప్పీన్స్‌లో “చికో” అని, ఇండినేషియాలో “సవో” (sawo) అని, మలేషియాలో “చికు” అని అంటారు. వియత్నాంలో hồng xiêm (xa pô chê) అని, గుయానాలో “సపోడిల్లా’ అని, శ్రీలంకలో “రత-మి”అని, థాయిలాండ్‌, కంబోడియాలలో లమూత్ (ละมุด) అంటారు. కొలంబియా, నికరాగ్వే వంటి దేశాలలో níspero అని, క్యూబా వంటి చోట్ల nípero అని, Kelantanese Malayలో “sawo nilo” అంటారు ..
సపోటా చెట్టు ఆకూ, కాయా, కొమ్మా, రెమ్మా ఏది తుంపినా పాలు కూడా వస్తాయి. సపోటా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దీనితో పాటు విలువైన పోషక పదార్థాలు కూడా ఇస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్‌ వుండదు. ఆ మాటకొస్తే కొవ్వు పదార్థాలూ చాలా తక్కువే. విటమిన్లూ, ఖనిజాలూ పుష్కలం. తాజా సపోటాలో విటమిన్‌ సి, కాల్షియం అధికంగా వుంటాయి. మగ్గిన సపోటాను తింటే వుండే రుచి అనుభవించాలే గానీ చెప్పతరం కాదు.  నోట్లో కరిగిపోతూ, కాస్త గరుకుగా, కాస్త మృదువుగా మొత్తానికి అద్భుతంగా అనిపిస్తుంది. మన దేశంలో సపోటాలు విరివిగా కాస్తాయి. అవి ఇక్కడ ఎంత ప్రాచుర్యం పొందాయంటే అసలవి ఇక్కడే పుట్టాయేమో అన్నంతగా! పంతొమ్మిదవ శతాబ్దంలో సపోటా జిగురును ఆంటోనియో లోపెజ్‌ అనే అతను తన కుమారుడు థామస్‌ ఆడమ్స్‌కి ఇచ్చాడు. ఆడమ్స్‌ ఆ తరువాత దానిలో ఇతర పదార్థాలు కలిపి ‘చికిల్స్‌’ తయారు చేశాడు. ఆ తరువాత చికిల్స్‌ చిక్లెట్స్‌ గానూ, బబుల్‌ గమ్‌ గానూ ప్రాచుర్యం పొందాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే మలయన్లు ఈ సపోటా జిగురును వాడేవారని తెలుస్తోంది. సపోటా చెట్టు ఆకూ, కాయా, కొమ్మా, రెమ్మా ఏది తుంపినా పాలు వస్తాయి.
రకాలు : 
మన రాష్ట్రంలోని సపోటా కొనుగోలుదారులు పాల రకాన్ని బాగా ఇష్టపడతారు. మహారాష్ట్రలో కాలి పత్తి రకాన్ని, కర్ణాటకలో క్రికెట్ బాల్ రకాల్ని ఇష్టంగా తింటారు. పాల రకంలో దిగుబడి ఎక్కువ. పండు కోలగా, చిన్నదిగా ఉంటుంది. పలచని తోలుతో కండ మృదువుగా ఉంటుంది. పండ్లు బాగా తీయగా ఉంటాయి. అయితే ఈ పండ్లు నిల్వకు, రవాణాకు, ఎగుమతికి అనుకూలంగా ఉండవు. క్రికెట్ బాల్ రకం సపోటా పండ్లు గుండ్రంగా, పెద్దగా ఉంటాయి. ఒక మోస్తరు తీపి కలిగి ఉంటాయి. సముద్ర మట్టం నుండి వెయ్యి అడుగుల ఎత్తు వరకూ ఉన్న ప్రాంతాల్లోనూ, పొడి వాతావరణంలోనూ దిగుబడి బాగా వస్తుంది. కాలి పత్తి రకం పండ్లు కోలగా, మధ్యస్త పరిమాణంలో ఉంటాయి. తోలు మందంగా, కండ తీయగా ఉంటుంది. ఈ రకం పండు నిల్వ, రవాణా, ఎగుమతికి అనుకూలమైనది. అయితే ఈ రకం సపోటాలో దిగుబడి తక్కువ. ఇవి కాక ద్వారపూడి, కీర్తి బర్తి, పీకేయం-1, 3, డీహెచ్‌యస్ 1, 2 రకాలు కూడా అనువైనవే. వీటిలో డీహెచ్‌యస్ 1, 2 హైబ్రిడ్ రకాలు.
వైద్యపరముగా ఉపయోగాలు : 
శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే.. నిమిషాల తేడాతో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుంది. పెరటి పండు అయిన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు సపోటాలను వాడవచ్చును . సపోటా పండ్లలో మాంసకృత్తులు, కెరోటిన్లు మరియు  నియాసిన్, పిండి పదార్థాలు, ఇనుము, సి విటమిన్, కొవ్వు, పీచు, థయామిన్, క్యాల్షియం, రైబోఫ్లేవిన్లు, శక్తి, ఫ్రక్టోస్ షుగర్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.
 యాంటీ వైరల్ మరియు  యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్(Anti parasitic) సుగుణాలను మెండుగా కలిగి ఉన్నాయి. ఇవి హానిచేసే సూక్ష్మక్రిములను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి. ఇక పోషకాల విషయానికి వస్తే.. విటమిన్‌ ‘ఏ ‘కంటిచూపును బాగా మెరుగుపరుస్తుంది. విటమిన్‌ ‘సీ ‘శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. తాజా పండులోని పొటాషియం, రాగి, ఇనుము, లాంటి పోషకాలు.  ఫోలేట్‌, నియాసిన్‌, పాంథోయినిక్‌ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ పండును తినిపించాలి. ఆరోగ్యంతోపాటు బరువూ పెరుగుతారు. అలాగే.. తక్కువ బరువున్నవారు సపోటాను అవసరమైన మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.
గర్భిణులు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు సపోటాలను మితంగా స్వీకరిస్తే రక్తహీనత క్రమబద్ధీకరణ అవుతుంది. బాలింతలు ఈ పండును ఫలహారంగా తీసుకుంటే పిల్లలకు పాలు పుష్కళంగా వృద్ధి చెందుతాయి. తియ్యగా ఊరిస్తూ, భలే రుచిగా ఉన్నాయికదా అని సపోటా పండ్లను అదేపనిగా తినటం మంచిది కాదు. అలా చేస్తే అజీర్ణంతోపాటు పొట్ట ఉబ్బరం కూడా చేస్తుంది. ఇక గుండె జబ్బులతో బాధపడేవారు మాత్రం రోజుకు ఒక పండును మించి తీసుకోకూడదు. ఒబేసిటీ, మధుమేహంతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. సపోటా తినటం వల్ల చర్మం సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. తాజాపండ్లను ప్యాక్‌ రూపంలో కాకుండా ఆహారంగా స్వీకరించడం వల్ల విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా విటమిన్‌- ‘ఎ’, ‘సి’ లు చర్మానికి కొత్త నిగారింపునిస్తాయి. అలాగే సపోటా గింజలను మెత్తగా నూరి ముద్దలా చేసి, దానికి కొంచెం ఆముదం నూనె కలిపి తలకు రాసుకోవాలి. మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా  బాగా మారుతాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. సపోటా పళ్ళు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గి, రతి సామర్థ్యం పెరుగుతుందంటున్నారు వైద్యులు.
 ఆహార పోషక విలువలు170g, 1 sapodilla contains :
శక్తి – Calories: 141
నీరు -Water: 132.60g
పిండిపదార్ధము -Carbs: 33.93g
మాంసకృత్తులు –Protein: 0.75g
పీచుపదార్ధం -Fiber: 9.01g
మొత్తం కొవ్వుపదార్ధము -Total Fat: 1.87g
సాచ్యురేటెడ్ కొవ్వు -Saturated Fat: 0.33g
చెడ్డ కొవ్వు -Trans-fats: Not known (or 0)
ఖనిజలవణాలు -Minerals:
కాల్సియం -Calcium: 35.70mg
ఐరన్‌-Iron: 1.36mg
మెగ్నీషియం -Magnesium: 20.40mg
భాష్వరము -Phosphorus: 20.40mg
పొటాసియం-Potassium: 328.10mg
సోడియం-Sodium: 20.40mg
జింక్ -Zinc: 0.17mg
కాఫర్ -Copper: 0.15mg
మాంగనీష్ -Manganese: Not known
సెలీనియం -Selenium: 1.02mcg
విటమిన్లు -Vitamins:
విటమిన్‌’ఏ’-Vitamin A: 102.00IU
థయమిన్‌-Thiamine (B1): 0.00mg
రైబోఫ్లెవిన్‌-Riboflavin (B2): 0.03mg
నియాసిన్‌-Niacin (B3): 0.34mg
పాంథోనిక్ యాసిడ్-Pantothenic acid (B5): 0.43mg
విటమిన్‌ ‘ బి 6’ -Vitamin B6: 0.06mg
ఫోలిక్ యాసిడ్-Folic acid/Folate (B9): 23.80mcg
సయనోకొబాలమైన్‌-Vitamin B12: 0.00mcg
విటమిన్‌ ‘సీ’-Vitamin C: 24.99mg
విటమిన్‌’ ఇ ‘-Vitamin E (alpha-tocopherol): Not known
వి్టమిన్‌’ కె ‘ -Vitamin K (phylloquinone): Not known
Essential Amino Acids:
ఐసోలూసిన్‌-Isoleucine: 0.03g
లూసిన్‌-Leucine: 0.04g
లైసిన్‌-Lysine: 0.07g
మితియోనిన్‌-Methionine: 0.01g
ఫినైల్ అలమిన్‌-Phenylalanine: 0.02g
థియోనిన్‌-Threonine: 0.02g
ట్రిప్టోఫాన్‌-Tryptophan: 0.01g
వాలిన్‌-Valine: 0.03g
Miscellaneous:
ఆల్కహాల్ -Alcohol: 0.00g
కెఫిన్‌-Caffeine: Not known
Source : Wikipedia.org (అంతర్జాలము).

నేరేడుపండు :

సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు కూడా చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం. సిజిజియం క్యుమిన్‌ దీని శాస్త్రీయ నామము .
జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో కూడా ఉంటాయి.
కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం కూడా తగ్గుతుంది.
మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.
పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కాబట్టి.. అధిక బరువు ఉన్నవారు.. మధుమేహ రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.
ఒక్క పండే కాదు.. నేరేడు చెట్టు ఆకులు, బెరడు, గింజలు కూడా ఎంతో మేలుచేస్తాయి. ఆకులు నేరేడు ఆకులతో చేసే కషాయం.. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టినచోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే.. ఉపశమనం లభిస్తుంది.  నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త, జిగట విరేచనాలతో బాధపడేవారికి 30ఎమ్‌.ఎల్‌ నీళ్లలో కలిపి తేనె, పంచదార జోడించి ఇస్తే గుణం ఉంటుంది. నెలసరి సమస్యలకు నేరేడు చెక్క కషాయాన్ని 25 రోజులపాటు 30ఎమ్‌.ఎల్‌ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. నోట్లో పుండ్లు, చిగుళ్ల సమస్యలకు దీని కషాయం పుక్కిలిస్తే మార్పు ఉంటుంది.
జాగ్రత్తలు: నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరవాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతోపాటు..
నోట్లో వెగటుగా ఉంటుంది. విరుగుడు: ఉప్పు, వేడినీరు. పోషకాలు (వందగ్రాముల్లో)
తేమ: 83.7గ్రా,
పిండి పదార్థం: 19 గ్రా,
మాంసకృత్తులు: 1.3గ్రా,
కొవ్వు: 0.1గ్రా,
ఖనిజాలు: 0.4గ్రా,
పీచుపదార్థం: 0.9గ్రా,
క్యాల్షియం: 15-30మి.గ్రా,
ఇనుము: 0.4మి.గ్రా-1మి.గ్రా,
సల్ఫర్‌: 13మి.గ్రా,
విటమిన్‌ సి: 18మి.గ్రా.
    వేడి ప్రభావానికి కడుపులో గ్యాస్‌ చేరి ఏం తిన్నా అరగనట్లుగా అనిపిస్తుంది. ఒక్కోసారి వాంతి చేసుకోవాలన్న భావన కూడా కలుగుతుంది. ఇలాంటప్పుడు నాలుగైదు నేరేడు పళ్లను తింటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడినీ కూడా  తగ్గిస్తుంది.
 కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలానే ఇవి రక్తక్యాన్సర్‌ కారకాలను నిరోధిస్తాయని కూడా అవి తెలుపుతున్నాయి.
నేరేడు పండ్లలో అధికమోతాదులో సోడియ, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మంగనీస్  మరియు జింక్‌, ఇరన్‌, విటమిన్‌, సీ, ఎ రైబోప్లెవిన్‌, నికోటిన్‌ ఆమ్లం, కొలైన్‌, ఫోలిక్‌, మాలిక్‌ యాసిడ్లు తగిన లభిస్తాయి. దానిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్తకణాలను బాగా  వృద్ధి చేస్తుంది.
 ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు బాగా తగ్గుతాయి. నేరేడు ఆకులు యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కలిగి ఉన్నాయి. అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. నేరేడు రసాన్ని, నిమ్మరసంతో కలిపి తీసుకొంటే మైగ్రేన్‌కు పరిష్కారం లభిస్తుంది. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. గాయాలు త్వరగా మానిపోతాయి. ఇది మాత్రమే కాదు. దీనికి రక్తాన్ని శుద్ధి చేస్తే శక్తి కూడా ఉంది.
పోషక విలువలు మెండు – నేరేడు పండు 
 ఎండాకాలం చివర్లో, వర్షాలు మొదలయ్యే సమయంలో కనిపించే పండు నేరేడు. దీనికి ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే గుణం ఉందని ఎన్నో పరిశోధనలు చేసిన వైద్యలు చెపుతున్నారు.అంతే కాదు ఐస్ క్రీం , వైన్ , జ్యూస్, జెల్లి, జాం వంటివి తయారు చేయడానికి ఈ పండును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో పొటాషియం , ఫాస్పరస్, ఐరన్, కాల్షియం కూడా ఉన్నాయి. ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్  కూడా ఈ పండులో వున్నాయి.ఇన్ని మంచి పదార్థాలను కలిగిన ఈ పండు వల్ల మనకు కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం. ఈ చెట్లు మూడు రకాలుగా ఉంటాయి.
1) erect
2) trailing vines
3) semi -erect

ఈ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు.

 

నేరేడులోని ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. గింజల్లో జంబోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధి నివారణకు దోహదపడుతుంది. గింజలను ఎండబెట్టి పొడిచేసి రోజుకు రెండు సార్లు ఒక స్పూన్ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిపై చక్కని ప్రభావం చూపుతుంది అని డాక్టర్లు  కూడా చెపుతున్నారు.

ఈ చెట్టు బెరడును నలగ్గొట్టి వేడి నీళ్ళలో నానబెట్టి కషాయం చేసుకొని దానిలో తేనే కలుపుకొని తాగితే రక్త స్రావం బాగా తగ్గిపోతుంది.

చెవుల్లో నుంచి చీము కారడం వల్ల బాధ పడే వారికి ఇది చాలా మంచి మందు. ఆకులూ, పండ్లను దంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి రెండు చెవుల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. తొందరగా ఉపశమనం కూడా  కలుగుతుంది.

వైట్ డిశ్చార్జ్ తో బాధ పడేవారు ఈ చెట్టు వేర్లను దంచి ముద్ద చేసి బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి తీసుకుంటే రక్త హీనత, వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గుతుంది.

అతి మూత్ర వ్యాధితో బాధ పడేవారు ఈ పండు గింజలను పొడి చేసి ఉదయం ఖాళీ కడుపుతో చన్నీళ్ళతో తాగితే మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు ఈ నేరేడు పండ్లను తినడం మంచిది. ఎందుకంటే ఈ పండులో సహజమైన యాసిడ్ లు ఉన్నాయి. అవి కాలేయాన్ని శక్తివంతం చేసి దాని పని తీరును  బాగా మెరుగుపరుస్తాయి.

అర్షమొలలు (ఫైల్స్) తో బాధ పడే వారికి నేరేడు బాగా పని చేస్తుంది. ఈ పండ్లను అవి దొరికే కాలంలో ప్రతి రోజు ఉదయం ఉప్పుతో కలిపి  తింటే మంచి ఫలితం కలినిపిస్తుంది.

అంతే కాదండోయ్ ఇన్ని మంచి గుణాలు కలిగిన ఈ పండ్లను ఎక్కువగా తింటే గొంతు పట్టేసే అవకాశం కూడా ఉంది.

Sharing Is Caring:

Leave a Comment