Palakura Pachadi:రుచికరమైన పాల‌కూర ప‌చ్చ‌డి చాలా సులువుగా తయారు చేసుకొండి

Palakura Pachadi:రుచికరమైన పాల‌కూర ప‌చ్చ‌డి చాలా సులువుగా తయారు చేసుకొండి

 

Palakura Pachadi: ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పాలకూర మనం తినే ఆకు కూరలలో ఒకటి.పాల‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది.పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. పాలకూరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.అందువ‌ల్ల కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి పాలకూర ఎంత‌గానో మేలు చేస్తుంది.

పాలకూరతో మనం కూర, పప్పు ఎక్కువగా వండుకోవచ్చు.దీన్ని ఉపయోగించి పచ్చడి ని కూడా వండుకోవచ్చు. ఇది రుచికరమైనదే కాదు.. పోషకాహారాన్ని కూడా అందిస్తుంది. పాలకూర పచ్చడిని ఎలా తయారు చేయాలో దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Palakura Pachadi:రుచికరమైన పాల‌కూర ప‌చ్చ‌డి చాలా సులువుగా తయారు చేసుకొండి

 

పాలకూర పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

తరిగిన పాలకూర -ఒక కట్ట (పెద్దది)
శ‌న‌గ‌ప‌ప్పు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర -అర టేబుల్ స్పూన్
కొత్తిమీర- అర టేబుల్ స్పూన్
మినప ప‌ప్పు – 1 టేబుల్ స్పూన్త
తరిగిన ఉల్లిపాయ -ఒకటి
పచ్చిమిర్చి- 8
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
చింతపండు- కొద్దిగా.

 

 

తాలింపు చేయడానికి కావలసిన పదార్థాలు:-

నూనె – ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు – ఒక రెమ్మ
ఎండు మిరపకాయలు – 2
పసుపు-పావు టీస్పూన్
మెత్తగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు- 6
జీలకర్ర -అర టీస్పూన్
ఆవాలు-అర టీస్పూన్
శెనగలు – 1 టీస్పూన్.

 

Palakura Pachadi:రుచికరమైన పాల‌కూర ప‌చ్చ‌డి చాలా సులువుగా తయారు చేసుకొండి

పాలకూర పచ్చడిని తయారు చేసే విధానము:-

ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఒక కడాయి పెట్టి వేడి చేసుకోవాలి . అలా వేడి అయిన కడాయిలో నూనె వేసుకోవాలి . నూనె కాగిన త‌రువాత ధ‌నియాలు,శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు,జీల‌క‌ర్ర వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తరువాత అందులో ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి అన్ని బాగా వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే క‌డాయిలో మ‌రో టేబుల్ స్పూన్ ను వేసి త‌రిగిన పాల‌కూరను వేసి బాగా వేయించుకోవాలి. పాల‌కూర పూర్తిగా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పాల‌కూర‌ను చ‌ల్లారనివ్వాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల మిశ్ర‌మాన్ని వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. దానిలో ఉడికించిన పాల‌కూర‌, రుచికి స‌రిప‌డా ఉప్పు, కొద్దిగా చింత‌పండును వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా మిక్సీపట్టిన మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే క‌డాయిలో నూనె వేసి బాగా కాగాక తాళింపు ప‌దార్థాల‌ను వేసి తాళింపును పెట్టుకోవాలి. ఈ తాళింపును మిక్సీ పట్టుకున్న పాల‌కూర మిశ్ర‌మంలో వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను కూడా ఈ మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. ఈ విధముగా రుచిగా ఉండే పాల‌కూర ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీల్లో తింటే భ‌లే రుచిగా ఉంటుంది.అదనంగా, పాలకూరలోని పోషకాలు మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి పాలకూరను అలాగే తీసుకోవచ్చు. ఇది ఆరోగ్య ప్రయోజనాలకు మూలం కావచ్చు.